శకం మొదలయిందా?
ఆమెలో నాన్నమ్మ ఇందిరాగాంధి పోలికలు చాలానేఉన్నాయి. రూపంలో ఆమెను పోలినా రాజకీయంగా ఎంతవరకు వారసురాలు అని చర్చిస్తే మాత్రం ఇపుడే చెప్పలేమని అంటారు. అయితే సోదరుడు రాహుల్ [more]
ఆమెలో నాన్నమ్మ ఇందిరాగాంధి పోలికలు చాలానేఉన్నాయి. రూపంలో ఆమెను పోలినా రాజకీయంగా ఎంతవరకు వారసురాలు అని చర్చిస్తే మాత్రం ఇపుడే చెప్పలేమని అంటారు. అయితే సోదరుడు రాహుల్ [more]
ఆమెలో నాన్నమ్మ ఇందిరాగాంధి పోలికలు చాలానేఉన్నాయి. రూపంలో ఆమెను పోలినా రాజకీయంగా ఎంతవరకు వారసురాలు అని చర్చిస్తే మాత్రం ఇపుడే చెప్పలేమని అంటారు. అయితే సోదరుడు రాహుల్ గాంధీ కంటే కూడా ఆమెకు పట్టుదల ఎక్కువ. తనకు అప్పగించిన బాధ్యతను త్రికరణ శుద్ధిగా నెరవేర్చేందుకు తగిన శక్తిని ఆమె ఉపయోగిస్తారు. ఆమె ప్రియాంకాగాంధి. కాంగ్రెస్ లో రేపటి అధ్యక్షురాలు ఆమె అని ఒక మాట కూడా ఇపుడు గట్టిగా వినిపిస్తోంది. ఈ దేశంలో ఇపుడు మోడీ హవా గురించి చెప్పనక్కరలేదు. కొమ్ములు తిరిగిన ప్రతిపక్ష యోధులు కూడా మోడీని ఒక్క మాట అనడానికి వెనకా ముందూ ఆలోచిస్తున్నారు, కానీ ప్రియాంక మాత్రం అలా కాదు, మోడీని గట్టిగా ఎదుర్కొంటూనే ఉన్నారు. ప్రతీ రోజూ ఎక్కడికి అక్కడ జవాబు చెబుతూనే ఉన్నారు. ట్విట్టర్ ద్వారా కానీ, బయట ప్రసంగాల ద్వారా, మీడియా ద్వారా ఇలా మోడీతో చెడుగుడు ఆడుకుంటున్నారు. ఆమె మా భవిష్యత్తు అని కాంగ్రెస్ లో మిగిలిన నాయకులు అంటున్నారు. ఆమెను చూసే ఇంకా కొనసాగుతున్నామని చెప్పెవారు కూడా ఎక్కువగానే ఉన్నారు.
యూపీ మీదే కన్ను…
రాహుల్ గాంధీ కంటే వ్యూహ రచనలో ప్రియాంక దిట్ట అంటారు. 2019 ఎన్నికల్లో కర్నాటకలో మెజారిటీకి కొద్ది సీట్లు తక్కువగా బీజేపీ వచ్చినపుడు ఎలాగైనా సర్కార్ ఏర్పాటు చేసి కమలానికి ఖంగు తినిపించాలన్న ఆలోచన వచ్చింది ప్రియాంకకేనని అంటారు. ఆమె మాటతోనే అటు జేడీఎస్ దేవేగౌడ, ఇటు కాంగ్రెస్ లోని సిద్ధరామయ్య చేతులు కలిపి పదమూడు నెలల పాటు పాలన చేశారు. మరో వైపు మాయావతి పార్టీ బీఎస్పీ కి ఉన్న ఎమ్మెల్యే సహకారం కూడా తీసుకున్నారు. ఇలా మోడీ, షాల కంటే మెరుపు వేగంతో ప్లాన్ వేసి కర్నాటకాన్ని కీలకమైన మలుపు తిప్పిన ఘనత ప్రియాంకదేనని అంటారు. అలా మోడీ, షాలకు దెబ్బ తీసిన నేతగా కూడా కాంగ్రెస్ లోపలా, బయటా చెప్పుకుంటారు. ఇక సార్వత్రిక ఎన్నికలలో ఆమె అలుపెరగకుండా తిరిగి ప్రచారం చేశారు. ప్రధానంగా యూపీ రాజకీయాలపైనే ఆమె దృష్టి పెట్టారు. అక్కడ మెజారిటీ సీట్లు సాధించాలనుకున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో మోడీ వేవ్ బలంగా ఉంది. పైగా విపక్షాల మధ్య విధానపరమైన అవగాహన లేదు. దాంతో యూపీలో కాంగ్రెస్ దెబ్బతినిపోయింది. అయినా ఓడిన చోటనే నిలిచి గెలవాలని ప్రియాంక అనుకుటున్నారు.
కమలాన్ని కదిలించేలా….
కమలానికి అసలైన బలం ఉత్త్రప్రదేశ్, అది 2014 అయినా, 2019 అయినా కూడా ఎక్కువ సీట్లు బీజేపీకి ఇచ్చి కేంద్రంలో పీఠాన్ని అందించింది యూపీనే. దాంతో అక్కడ నుంచే నరుక్కురావాలని ప్రియాంక ఆలోచిస్తున్నారు. ఇపుడు ఆమె చూపు అంతా బీజేపీ సీఎం ఆదిత్యానాధ్ యోగి మీదనే ఉంది. యోగి తప్పులను జనంలో పెట్టి కడిగేస్తున్నారు. బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఓ వైపు దేశ రాజకీయలలో మోడీని టార్గెట్ చేసిన ప్రియాంక యూపీ నుంచే సమర నినాదాన్ని వినిపిస్తున్నారు. 2022లో యూపీ ఎన్నికలు ఉన్నాయి. నిజానికి కాంగ్రెస్ యూపీలో అధికారం పోగొట్టుకుని సరిగ్గా అప్పటికి మూడున్నర దశాబ్దాలు అవుతుంది. అటువంటి చోట కాంగ్రెస్ కి గట్టి పునాదులు వేయడం అంటే అసాధ్యమే కానీ దాన్ని సాధించేందుకు ప్రియాంక సిధ్ధపడుతున్నారు. ఆమె మా యూపీ ముఖ్యమంత్రి అభ్యర్ధి అని ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ అంటున్నారు.ప్రియాంక పనితీరు బాగుంది. విపక్ష నేతగా ఆమె ఎస్పీ, బీఎస్పీ కంటే కూడా గొప్పగా పనిచేస్తున్నారు. మాయావతి, అఖిలేష్ యాదవ్ లను జనం చూసేశారు. బీజేపీకి కూడా పట్టం కట్టారు, ఇక ప్రియాంక శకం మొదలవుతోందని అంటున్నారు. మరి యూపీ సీఎం గా ప్రియాంక పీఠం దక్కించుకుంటారా. రాజకీయాల్లో ఏం జరుగుతుందో చెప్పలేం. యూపీ నుంచి ఢిల్లీకి బాటలు వేస్తున్న కాంగ్రెస్ యువ నాయకురాలు ప్రియాంక ఆ పార్టీకి రేపటి ఆశాకిరణం అంటే అతిశయోక్తి కాదేమో.