ఇక రాక తప్పేట్లు లేదు
వందేళ్లకు పైగా చరిత్రగల హస్తం పార్టీ అయోమయ పరిస్థితి ఎదుర్కొంటోంది. ఎటు వెళ్లాలో తెలియక, ఏం చేయాలో తెలియక నాలు రోడ్ల కూడలిలో నిస్తేజంగా నిలిచి ఉంది. [more]
వందేళ్లకు పైగా చరిత్రగల హస్తం పార్టీ అయోమయ పరిస్థితి ఎదుర్కొంటోంది. ఎటు వెళ్లాలో తెలియక, ఏం చేయాలో తెలియక నాలు రోడ్ల కూడలిలో నిస్తేజంగా నిలిచి ఉంది. [more]
వందేళ్లకు పైగా చరిత్రగల హస్తం పార్టీ అయోమయ పరిస్థితి ఎదుర్కొంటోంది. ఎటు వెళ్లాలో తెలియక, ఏం చేయాలో తెలియక నాలు రోడ్ల కూడలిలో నిస్తేజంగా నిలిచి ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే పార్టీ సుప్త చేతనావస్థలో ఉంది. అంపశయ్యపై ఉంది. వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ వ్యవహారాల్లో వెనకటి మాదిరిగా చురుగ్గా పాల్గొనలేక పోతున్నారు. నాయకులను, కార్యకర్తలను కలుసుకోవడం, సమావేశాలకు హాజరు కావడానికే పరిమితమవుతున్నారు. గతంలో మాదిరిగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు క్షేత్రస్థాయి పర్యటనలు చేలయలేక పోతున్నారు. ఇక లోక్ సభ ఎన్నికల వరకూ అధ్యక్షుడిగా పనిచేసిన రాహుల్ గాంధీ ఓటమితో కాడి కింద పడేశారు. ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు. ఎంతమంది నచ్చ చెప్పినా ఆయన తన వైఖరిని వీడలేదు. గాంధీయేతర కుటుంబం వారు అధ్యక్ష పదవి చేపట్టాలన్నది ఆయన ఉవాచ. అయితే పార్టీ సీనియర్లు ఎవరూ పదవి చేపట్టేందుకు ముందుకు రాలేదు. గాంధీ కుటుంబాన్ని కాదని ఆ పదవి చేపట్టినా ఫలితం ఉండదన్నది వారి విశ్వాసం. అందుకే అన్యం..శరణం…నాస్తి అంటూ మళ్లీ సోనియా గాంధీ నాయకత్వాన్ని కోరారు. చివరకు ఆమె అయిష్టంా తాత్కాలికంగా పార్టీ పగ్గాలు చేపట్టారు. అనారోగ్యం ఆమెను వెంటాడుతుంది. శారీరకంగా సోనియా బలహీనంగా ఉన్నారు.
పార్టీ బాధ్యతలను కూడా….
ఈ పరిస్థితుల్లో మళ్లీ అధ్యక్ష్య పదవిపై చర్చ మొదలయింది. రాహుల్, ప్రియాంకల్లో ఎవరో ఒకరు పార్టీ పగ్గాలు చేపట్టాలని పార్తీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రియాంక గాంధీ వైపు మొగ్గు చూపుతున్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. చురకుదనం, చొరవ గల ప్రియాంక నాయకత్వం పార్టీకి దిశానిర్దేశం చేయలగదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. నాయనమ్మ ఇందిరాగాంధీ పోలికలు, ఆమె హావభావాలను పలికించగలిగిన నేర్పు, తెలివితేటల ప్రియాంక గాంధీలో ఉన్నాయన్న వాదన బలంగా వినపడుతోంది. ప్రసంగాల్లో వాడి వేడి, ధాటి ఆహుతులఅను ఆకట్టుకోగలదని చెబుతున్నారు. ప్రియాంకకు తన వాక్చాతుర్యం కలసి వచ్చే బాగా కలసి వచ్చే అంశం. తాజాగా ఈనెల 15న ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరిగిన బహిరంగ సభలో సోనియా, రాహుల్, మన్మోహన్ సింగ్ వంటి వారు ప్రసంగించారు. అయితే వీరిలో అందరికన్నా ప్రియాంక గాంధీ ప్రసంగమే సభికులను ఆకట్టుకుందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఎక్కడా తడబడకుండా, ఏకధాటిగా ఆమె చేసన ప్రసంగం ప్రజల్లోకి బాగా వెళ్లిందని చెబుతున్నారు. కిలో ఉల్లి రూ.100 కావడం, 45ఏళ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం పెరగడం, నాలుగు కోట్ల మంది ఉద్యోగాలు పోవడం, పదిహేను వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటూ సమకాలీన అంశాలను సూటిగా ప్రస్తావించడం ద్వారా సభికులను ఆకట్టుకోగలిగారు.
చురుగ్గా ఉంటూ…..
1972 జనవరి 12న జన్మించిన ప్రియాంక గాంధీ ఢిల్లీలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. 1997లో ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాను వివాహం చేసుకున్నారు. 2019 జనవరి 23న అధికారికంగా రాజకీయ ప్రవేశం చేశారు. మరుసటి నెల ఫిబ్రవరి 4న పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి పార్టీ వ్యవహారాల్లో క్రియాశీలకంగా ఉంటున్నారు. రాజకీయాల్లోకి రానప్పటికీ అంతకు ముందు కూడా రాజకీయాలను ఒక కంట గమనిస్తూనే ఉన్నారు. తల్లి, సోదరుడికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. 2004లో తల్లి సోనియా తరుపున రాయబరేలి నియోజకవర్గంలో, సోదరుడు రాహుల్ తరుపును అమేధీలో విస్తృత ప్రచారం నిర్వహించారు. 2009లోనూ తెరవెనక పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొన్నారు.
దశల వారీగా బాధ్యతలు…..
2007 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాయబరేలి, అమేధీ లోక్ సభ స్థానాల్లోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల పర్యవేక్షణ బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారు. 2019లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తర్వాత తూప్పు యూపీ ప్రాంత బాధ్యతలను ప్రియాంక గాంధీ అప్పగించారు. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గం ప్రియాంక పర్యవేక్షణ పరిధిలోనే ుంది. ప్రియాంక లో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయనిి, పార్టీని గాడిన పెట్టే శక్తి సామర్థ్యాలు ఉన్నాయని, ప్రముఖ రాజకీయ వ్యాఖ్యాత రషీద్ కిద్వాయ్ పేర్కొన్నారు. కిద్వాయ్ సోనియా బయోగ్రఫీ పుస్తక రచయిత. 2004లోనే రాహుల్ తో పాటు ప్రియాంక గాంధీ రాజకీయాల్లోకి వచ్చి ఉంటే పార్టీ పరిస్థితి మరో రకంగా ఉండేదని ఢిల్లీకి చెందిన రాజకీయ విశ్లేషకుడు ప్రతాప్ భాను మెహతా విశ్లేషించారు. 2024 ఎన్నికల్లో నాయనమ్మ, తల్లి ప్రాతినిధ్యం వహించిన రాయబరేలి నుంచి ప్రియాంక గాంధీ బరిలోకి దిగే అవకాశముంది. హస్తం పార్టీ శ్రేణులు మాత్రం ప్రస్తుతం ప్రియాంక గాంధీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి.
-ఎడిటోరియల్ డెస్క్