Uttar pradesh : ప్రియాంకను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారా?
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ ఎన్నికలు కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకం. యూపీ ఎన్నికల బాధ్యతను ప్రియాంక గాంధీ తన భుజస్కందాలపై తీసుకున్నారు. యూపీలో ఉండి పార్టీని [more]
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ ఎన్నికలు కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకం. యూపీ ఎన్నికల బాధ్యతను ప్రియాంక గాంధీ తన భుజస్కందాలపై తీసుకున్నారు. యూపీలో ఉండి పార్టీని [more]
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ ఎన్నికలు కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకం. యూపీ ఎన్నికల బాధ్యతను ప్రియాంక గాంధీ తన భుజస్కందాలపై తీసుకున్నారు. యూపీలో ఉండి పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కీలక భూమిక పోషిస్తుందని ప్రియాంక గాంధీ అభిప్రాయపడుతున్నారు. క్యాడర్ లో జోష్ నింపేందుకు ప్రియాంక గాంధీ కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
ప్రత్యక్ష ఎన్నికల్లో….
ప్రియాంక గాంధీ ఇప్పటివరకూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీ కి మద్దతుగా అమేధి, రాయబరేలిలో ఎన్నికల ప్రచారాన్ని మాత్రమే నిర్వహించారు. గత ఎన్నికల నుంచే ఇది ప్రారంభమయింది. అయితే ఆ తర్వాత ప్రియాంక గాంధీకి పార్టీలో కీలక పదవిని ఇచ్చారు. రాహుల్ , ప్రియాంక గాంధీలు కలసి కట్టుగా పార్టీకి పూర్వ వైభవం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
పోటీకి దిగి….
ఈ నేపథ్యంలో వచ్చే ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేయాలని భావిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గం ఏదనేది ఇంకా ఖరారు చేయకపోయినా, అమేధీ, పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మంట్ నుంచే ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశముంది. దీనిపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కసరత్తులు ప్రారంభించింది. ప్రియాంక గాంధీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాల్సి ఉన్నందును కాంగ్రెస్ కు బలమున్న నియోజకవర్గాన్ని ఆమె ఎంచుకుంటారు.
సీఎం అభ్యర్థిగా…..
ప్రియాంక గాంధీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే యోచనలో కూడా కాంగ్రెస్ అధినాయకత్వం ఉంది. దీనివల్ల కొన్ని వర్గాలు కాంగ్రెస్ కు మరింత చేరువయ్యే అవకాశాలున్నాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలంటే ప్రియాంక పోటీ చేస్తేనే ప్రజలు పార్టీని మరింత విశ్వసిస్తారు. అందుకే ఈసారి యూపీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రియాంక గాంధీ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ప్రియాంక గాంధీపై యూపీ నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.