ముప్పు ఉందని ముందు తెలియదా?
మద్రాస్ హైకోర్టు అభిప్రాయంలో తప్పు ఏముంది? కరోనా కేసులు భారత్ లో పెరగడానికి ఎన్నికలు కాదా? కరోనా సెకండ్ వేవ్ పొంచి ఉందని తెలిసినా ఎన్నికలను వాయిదా [more]
మద్రాస్ హైకోర్టు అభిప్రాయంలో తప్పు ఏముంది? కరోనా కేసులు భారత్ లో పెరగడానికి ఎన్నికలు కాదా? కరోనా సెకండ్ వేవ్ పొంచి ఉందని తెలిసినా ఎన్నికలను వాయిదా [more]
మద్రాస్ హైకోర్టు అభిప్రాయంలో తప్పు ఏముంది? కరోనా కేసులు భారత్ లో పెరగడానికి ఎన్నికలు కాదా? కరోనా సెకండ్ వేవ్ పొంచి ఉందని తెలిసినా ఎన్నికలను వాయిదా వేయకుండా ముందుకెళ్లడం వల్లనే సమస్య తలెత్తింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాతనే కరోనా వైరస్ భారత్ లో వ్యాప్తి చెందిందంటున్నారు. సెకండ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణుల హెచ్చరికలను కూడా పెడచెవినపెడుతూ నిర్ణయం తీసుకున్నారు.
కాలపరిమితి ముగిసేలోపు….
దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగాలి. వాటి కాలపరిమితి ముగిసే లోపు ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. అది ఎన్నికల కమిషన్ బాధ్యత. అయితే కష్ట సమయంలో రాజ్యాంగాన్ని సవరించుకునే వీలుంది. ఆయా రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనను పెట్టడం లేదా ఆ ప్రభుత్వాలనే కొంతకాలం పాటు కొనసాగించడం చేసే వీలుంది. కానీ ఎన్నికల కమిషన్ కరోనా పొంచి ఉందని తెలిసినా ఎన్నికలను నిర్వహించడానికే ముందుకు వెళ్లింది.
కేసులు పెరగడానికి….
ఇప్పుడు భారత్ లో రోజుకూ మూడు లక్షలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. దీనికి కారణం తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరి, కేరళ ఎన్నికలు జరిగాయి. వీటితో పాటు దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. పోలింగ్ సందర్భంగా పెద్దయెత్తున ప్రజలు గుమికూడటంతోనే కరోనా వ్యాప్తి ఎక్కువయిందన్నది నిపుణులు కూడా చెబుతున్నారు. దీంతో పాటు అనేక రాష్ట్రాల్లో స్థానికసంస్థల ఎన్నికలను కూడా నిర్వహించారు.
అన్నింటికీ అనుమతిచ్చి….
ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికలు నిర్వహించడం ఎందుకున్న ప్రశ్న తలెత్తుతుంది. ఎన్నికల కమిషన్ ను మద్రాస్ హైకోర్టు అందుకే తప్పు పట్టింది. కరోనా సమయాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోయిన కేంద్ర ప్రభుత్వం కూడా వైరస్ పెరగడానికి కారణమని చెప్పాలి. కేవలం ఎన్నికలే కాదు బహిరంగ సభలు, ర్యాలీలకు అనుమతివ్వడం, పెద్ద సంఖ్యలో జనం చేరడం కూడా వైరస్ వ్యాప్తికి కారణమని చెప్పాలి. మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యల్లో ఏమాత్రం తప్పులేదన్న కామెంట్స్ వినపడుతున్నాయి.