అందుకే పోలీసులు ఇలా ప్రవర్తిస్తున్నారా?
కరోనా పై యుద్ధంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ లో వైద్యులు, పారిశుధ్యపనివారు తరువాత స్థానంలో పోలీసులే ఉన్నారు. ఇప్పటికే వైరస్ మహమ్మారి బారిన వందలాదిమంది పోలీసులు ఉభయ [more]
కరోనా పై యుద్ధంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ లో వైద్యులు, పారిశుధ్యపనివారు తరువాత స్థానంలో పోలీసులే ఉన్నారు. ఇప్పటికే వైరస్ మహమ్మారి బారిన వందలాదిమంది పోలీసులు ఉభయ [more]
కరోనా పై యుద్ధంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ లో వైద్యులు, పారిశుధ్యపనివారు తరువాత స్థానంలో పోలీసులే ఉన్నారు. ఇప్పటికే వైరస్ మహమ్మారి బారిన వందలాదిమంది పోలీసులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పడ్డారు. ఈ పోరాటంలో కొందరు ప్రాణాలు సైతం పోగొట్టుకున్నారు. వీరి కారణంగా కుటుంబ సభ్యులకు సోకి వారు ఆసుపత్రి పాలయిన సందర్భాలు కోకొల్లలు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రాణాలు ఫణంగా పెట్టిన వారికి అంతా జేజేలు పలుకుతూనే ఉన్నారు. అయితే నాలుగు నెలలుగా రోడ్డున పడి ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్న చాలా మంది పోలీసుల మానసిక పరిస్థితి దెబ్బతిన్నట్లు ఇటీవల ఏపీ లో చోటు చేసుకుంటున్న సంఘటనలు చెప్పక చెబుతున్నాయి.
మాస్క్ లేదని …
పోలీసులకు డ్రెస్ కి ఒక పవర్ ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది. అయితే దానిని ఎక్కడ ఎలా వాడాలో తెలిసినవారు కూడా కరోనా కాలంలో మతి, గతి తప్పేస్తున్నారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ లో అవాంఛనీయ సంఘటనలు ఇటీవల పెరిగిపోతున్నాయి. ప్రకాశం జిల్లా చీరాల ప్రాంతంలో ఒక ఎస్ ఐ మాస్క్ పెట్టుకోలేదని ఒక యువకుడి పై దాడి చేయడం అతడు బైక్ పై నుంచి పడి చికిత్స పొందుతూ చనిపోవడం సంచలనమే అయ్యింది. ఇక తూర్పు గోదావరి జిల్లాల్లో అయితే సీతానగరం ఎస్ ఐ మరికొందరు కానిస్టేబుల్స్ ఒక యువకుడికి గుండు కొట్టించి చితక్కొట్టారు. అలాగే కోరుకొండ మండలంలో ఒక బాలిక రేప్ జరిగిందని పోలీస్ స్టేషన్ కి వెళితే నానా అవమానాలు పొందింది. ఇక ఇదే జిల్లాలో ఒక న్యాయవాదిపై పోలీసులు ఇంటిపై పడి చేసిన హంగామాకు సాక్షత్తు జిల్లా ఎస్పీ హై కోర్టు లో చీవాట్లు తినాలిసి వచ్చింది. ఇలా రోజుకో సంఘటన సంచలనమే అవుతుంది. ఆయా సంఘటనల్లో కొందరు పోలీసులు చేసిన పనులకు ప్రభుత్వం జవాబు చెప్పుకుని దోషిగా నిలవాలిసి వస్తుంది.
మానసిక సమస్యలే కారణం …
కరోనా ను అరికట్టే విధుల్లో పోలీసులు శ్రమిస్తున్న వైనం కి ప్రతి ఒక్కరు సలాం కొట్టాలిసిందే. అయితే అదే సమయంలో వీరిపై పడుతున్న వత్తిడి కుటుంబ సభ్యుల కోసం, తమ కోసం వచ్చే ఆలోచనలు తీవ్ర వేదనకు గురి చేస్తున్నట్లు మానసిక వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణం ఏపీ లో పోలీసులకు విధులు నిర్వహించే సమయాన్ని కుదించడం ఒక వారం విశ్రాంతి మరో వారం డ్యూటీ ఉండేలా చూడటం సత్ఫలితాలను ఇస్తుంది అంటున్నారు. కరోనా విజృంభిస్తున్నా ఎపి లో రాజకీయ కార్యకలాపాలు ఏ మాత్రం తగ్గలేదు. అధికారపక్షం నేతలకు ప్రోటోకాల్, విపక్షం చేసే ఆందోళనలకు బందోబస్తు నిర్వహిస్తూ పగలు రాత్రి పోలీసులు పడుతున్న శ్రమను ఇప్పటికైనా ఉన్నతాధికారులు గుర్తించాలని నిపుణులు సూచిస్తున్నారు. కింది స్థాయి సిబ్బంది పై వత్తిడి తొలగించే అన్ని మార్గాలను ప్రభుత్వం పోలీసు అధికారులు ఆలోచన చేయాలని మానసికవైద్యులు చేస్తున్న అప్పీల్ పై సర్కార్ దృష్టి పెట్టడం ఇప్పుడు తక్షణ కర్తవ్యం.