చిన్నమ్మ పరువు పోయిందా ?
ఏపీ బీజేపీలో కీలక నేతగా ఉనన కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ఇపుడు ఆరోపణల్లో ఇరుక్కున్నారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి జంప్ చేసి పెద్ద పదవిని [more]
ఏపీ బీజేపీలో కీలక నేతగా ఉనన కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ఇపుడు ఆరోపణల్లో ఇరుక్కున్నారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి జంప్ చేసి పెద్ద పదవిని [more]
ఏపీ బీజేపీలో కీలక నేతగా ఉనన కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ఇపుడు ఆరోపణల్లో ఇరుక్కున్నారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి జంప్ చేసి పెద్ద పదవిని ఆశించిన ఆమె గత ఏడాది విశాఖ ఎంపీగా కూడా డిపాజిట్లు కోల్పోయారు. అయితే పురంధేశ్వరి ఓటమి వెనక వైసీపీ ప్రభంజనంతో పాటు తాను కూడా ఒక ప్రధాన కారణమని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణల బట్టి అర్ధమవుతోంది. నిజానికి ఇన్నాళ్ళూ ఇది పార్టీ వర్గాలకు తెలిసినా ఢిల్లీ వరకూ పొక్కలేదు. ఇపుడు మొత్తం లోకానికే తెలిసిపోయింది. పురంధేశ్వరి విశాఖ ఎంపీ అభ్యర్ధిగా బీజేపీ నుంచి పోటీ చేశారు కానీ పెద్దగా ప్రచారం చేయలేదు, ఎటూ ఓడిపోతానని తెలిసి ఆమె మొక్కుబడి తంతుగానే కధ నడిపించారని చెబుతారు.
తమ్ముడి అల్లుడుకి ….
గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పురంధేశ్వరి విశాఖ నుంచి పోటీ చేసినప్పటికీ ఓడిపోవడం ఖాయమని ముందే తెలుసు. దాంతో ఆమె టీడీపీ అభ్యధిగా ఉన్న బాలయ్య అల్లుడు శ్రీ భరత్ కి ఇండైరెక్ట్ గా మద్దతు ఇచ్చారని అప్పట్లో ప్రచారం జరిగింది. దానికి ఇపుడు విజయసాయిరెడ్డి ఆరోపణలు మరింత బలాన్ని చేకూర్చేలా ఉన్నాయి. ఎన్నికల ఫండ్ అంటూ బీజేపీ జాతీయ నాయకత్వం పెద్ద మొత్తంలోనే కొన్ని నియోజకవర్గాలకు, కొందరి కీలక నేతలు భారీగా ఇచ్చినట్లుగా కూడా అప్పట్లో చెప్పుకున్నారు. అలా విశాఖకు వచ్చిన ఫండ్ ని కూడా పురంధేశ్వరి పెద్దగా ఖర్చు చేయలేదని విజయసాయిరెడ్డి ఆరోపణల ద్వారా తెలుస్తోంది. అంతే కాదు, బీజేపీ ఎన్నికల కమిటీలో కూడా పురంధేశ్వరి కీలకమైన పాత్ర పోషించారు. దాంతో ఆమె ఇపుడు చిక్కుల్లో పడ్డారని అంటున్నారు.
ఉప్పు అందించారా…?
విశాఖలోనే మకాం వేసిన విజయసాయిరెడ్డికి చిన్నమ్మ వ్యతిరేక వర్గీయులైన పార్టీ నాయకులు ఉప్పు అందించారని అంటున్నారు. ఆమె రాకను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న వారు కూడా బీజేపీలో ఉన్నారు. ఆమె చుట్టపు చూపుగా విశాఖ వచ్చి వెళ్తారని, పార్టీ కోసం చేసిందేమీ లేదని కూడా అంటారు. ఇక ఆమె ఎన్టీయార్ కుమార్తె అని, ఏదో ఆమె పొడిచేస్తుందని జాతీయ నాయకత్వం భ్రమలు పెట్టుకుని పెద్ద పీట వేస్తోందని, ఫలితంగా మొదటి నుంచి బీజేపీలో ఉన్న వారు బ్యాక్ బెంచ్ కి వెళ్ళిపోయారని అంటున్నారు.
నీలినీడలేనా…?
ఏపీ బీజేపీలో ఉన్న నాయకుల మీద, వారి సమర్ధత మీద కేంద్ర నాయకులకు ఇప్పటికే పెద్దగా నమ్మకాలు లేవు. ఎవరు పార్టీలోకి వచ్చి చేరినా కూడా పదవులు ఆశిస్తున్నారు తప్ప పార్టీ పటిష్టతకు పనిచేయడం లేదని కూడా నివేదికలు ఉన్నాయి. ఇపుడు ఎన్నికల నిధుల గొడవ బయటకు రావడంతో ఉన్న పరువు కూడా కొందరు నేతలు పోగొట్టుకున్నారని అంటున్నారు. ఇందులో పురంధేశ్వరి పేరు కూడా ఉండడంతో ఆమెకు జాతీయ నాయకత్వం దగ్గర ఒక్కసారిగా మార్కులు తగ్గిపోతాయని అంటున్నారు. మరో వైపు ఆమెను విశాఖ నుంచి వేరు చేయలనుకుంటున్న బీజేపీ నాయకులకు కూడా ఇది ఓ అవకాశంగా ఉంది. మొత్తానికి చిన్నమ్మ పార్టీ మారినా కూడా బీజేపీలో ఇక నిచ్చెన మెట్లు ఉండవేమోనని అంటున్నారు.