చిన్నమ్మ చిరునామాను మార్చేస్తున్నారట
పురంద్రీశ్వరి భారతీయ జనతా పార్టీలో జాతీయ స్థాయి నేతగా ఎదిగారు. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవంతో ఆమెకు కేంద్రమంత్రి పదవి వస్తుందని ఆశించారు. కానీ ఆ [more]
పురంద్రీశ్వరి భారతీయ జనతా పార్టీలో జాతీయ స్థాయి నేతగా ఎదిగారు. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవంతో ఆమెకు కేంద్రమంత్రి పదవి వస్తుందని ఆశించారు. కానీ ఆ [more]
పురంద్రీశ్వరి భారతీయ జనతా పార్టీలో జాతీయ స్థాయి నేతగా ఎదిగారు. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవంతో ఆమెకు కేంద్రమంత్రి పదవి వస్తుందని ఆశించారు. కానీ ఆ బీజేపీ అగ్రనేతలు ఆ ఊసే ఎత్తడం లేదు. అసలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్కరికి కూడా మోడీ కేబినెట్ లో అవకాశం ఇవ్వలేదు. పురంద్రీశ్వరి కనుక మొన్నటి ఎన్నికల్లో గెలిచి ఉంటే ఖచ్చితంగా మంత్రిపదవి వచ్చి ఉండేది. అయితే రాజ్యసభ ఇచ్చి మరీ పురంద్రీశ్వరికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం కేంద్ర నాయకత్వానికి ఇష్టం లేదు.
తొలుత విశాఖ అనుకున్నా…..
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుందని ఇప్పటికే కేంద్ర నాయకత్వం పురంద్రీశ్వరికి చెప్పినట్లు సమాచారం. దీంతో పురంద్రీశ్వరి తాను పోటీ చేసే స్థానంపై మల్లగుల్లాలు పడుతున్నారు. సహజంగా పురంద్రీశ్వరికి విశాఖపట్నంలో మంచి పట్టుంది. ఒకసారి పురంద్రీశ్వి అక్కడి నుంచి విజయం సాధించారు. కేంద్ర మంత్రి కూడా అయ్యారు. అక్కడ ఈసారి పోటీ చేయాలని తొలుత భావించారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశంతో పురంద్రీశ్వరి పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.
విజయవాడ అయితేనే…?
అందుకే విశాఖపట్నంకు దూరంగా వెళ్లాలని పురంద్రీశ్వరి నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె ఫోకస్ విజయవాడపై ఉందంటున్నారు. విజయవాడ, ఏలూరు పార్లమెంటు నియోజకవర్గాల్లో అయితే కొంత ఛాన్స్ ఉందని పురంద్రీశ్వరి నమ్ముతున్నారు. అందుకోసమే ఈ రెండు నియోజకవర్గాలపై ఫోకస్ ఎక్కువగా పెట్టాలని భావిస్తున్నారు. విజయవాడ లో కూడా అమరావతి ఎఫెక్ట్ ఉంటుందేమోన్నన దిగులు ఎటూ ఉంది.
ఈ సీటే సేఫ్ అట….
అయితే ఎన్టీఆర్ కుమార్తె కావడంతో తనకు విజయవాడలో ప్రజలు కొంత మినహాయింపు ఇస్తారని భావిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ నుంచి కేశినేని నాని ఉన్నారు. ఆయన ఇప్పటికే రెండు సార్లు విజయం సాధించారు. సహజంగా వ్యతిరేకత ఉంటుంది. ఇక వైసీపీకి అక్కడ సరైన నేత లేరు. దీంతో తనకు విజయవాడ అయితేనే బాగుంటుందన్న నిర్ణయానికి పురంద్రీశ్వరి వచ్చినట్లు తెలిసింది. సామాజికవర్గాల పరంగా చూసుకున్నా బెజవాడ సేఫెస్ట్ ప్లేస్ అని చిన్నమ్మ డిసైడ్ అయ్యారంటున్నారు.