పురందేశ్వరికి బీజేపీలో ఉక్కబోత ?
కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నాయకురాలు..దగ్గుబాటి పురందేశ్వరి యాక్టివ్ అయ్యేదెప్పుడు ? ఆమె నోరు విప్పేదెప్పుడు ? పార్టీలో కీలకంగా మారేదెప్పుడు ? ఇదీ.. బీజేపీలో జరుగుతున్న [more]
కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నాయకురాలు..దగ్గుబాటి పురందేశ్వరి యాక్టివ్ అయ్యేదెప్పుడు ? ఆమె నోరు విప్పేదెప్పుడు ? పార్టీలో కీలకంగా మారేదెప్పుడు ? ఇదీ.. బీజేపీలో జరుగుతున్న [more]
కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నాయకురాలు..దగ్గుబాటి పురందేశ్వరి యాక్టివ్ అయ్యేదెప్పుడు ? ఆమె నోరు విప్పేదెప్పుడు ? పార్టీలో కీలకంగా మారేదెప్పుడు ? ఇదీ.. బీజేపీలో జరుగుతున్న చర్చ. బీజేపీ విధానాల ప్రకారం.. ఇప్పుడు కొందరు వాయిస్ విప్పుతున్నా.. ఓ వర్గం మీడియా తమను పట్టించుకోవడం లేదని .. కమలం పార్టీ రాష్ట్ర నేతలు విమర్శిస్తున్నారు. అయితే.. ఈ విమర్శలకు సదరు కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి మాత్రం అతీతం. ఆమె వ్యాఖ్యలను వక్రీకరించడం లేదా.. వేరే కోణంలో రాయడం అనేవాటికి మెజారిటీ మీడియా వ్యతిరేకం.
జాతీయ స్థాయిలో…?
దీంతో పురందేశ్వరి చేసే రాజకీయ కామెంట్లకుఎంతో ప్రాధాన్యం ఉంది. అయితే.. ఆమె మాత్రం గడప దాటి బయటకు రావడం లేదని అంటున్నారు. కొన్నాళ్ల కిందటి వరకు పార్టీలో తనకు గుర్తింపు లేదని భావించిన పురందేశ్వరి.. కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అయితే.. జాతీయ స్థాయిలో పార్టీలో పదవి ఇచ్చిన తర్వాత కూడా పురందేశ్వరి మౌనంగానే ఉంటున్నారు. దీంతో ఆమె ఎప్పుడు నోరు విప్పుతారు ? అనేది ప్రధాన ప్రశ్నగా ఉంది. వాస్తవానికి పురందేశ్వరి 2014, 2019 రెండు ఎన్నికల్లో బీజేపీ అధిష్టానం లోక్సభ సీటు ఇచ్చింది. రాజంపేట, వైజాగ్ నుంచి పోటీ చేసిన ఆమె ఓడిపోయారు.
ఇష్టం లేకపోయినా?
అయితే ఈ రెండు సార్లు కూడా పోటీ చేయడం పురందేశ్వరికి ఇష్టం లేకపోయినా గత్యంతరం లేని పరిస్థితుల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయితే.. రాజ్యసభ లేదా.. నామినేటెడ్ పదవి అయినా తనకు దక్కుతుందనే ఆశతో .. బీజేపీ బాట పట్టిన పురందేశ్వరి.. దీనికి భిన్నంగా కేంద్రంలోని బీజేపీ వ్యవహరించడంతో ఒకింత అసహనంతోనే ఉన్నారు. అయితే పార్టీ పదవి ఇచ్చినా ఆమె అంత హ్యాపీగా లేరనేది వాస్తవం. దీనికి తోడు.. అధికార పార్టీ వైసీపీ నేతలతో పురందేశ్వరి కుటుంబానికి ఉన్న సంబంధాలు.. వ్యాపార లావాదేవీలు వంటివి కూడా వైసీపీ సర్కారుపై విమర్శలు సంధించేందుకు అడ్డుపడుతున్నాయని తెలుస్తోంది.
అందుకే ఏ పార్టీని?
పైగా వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ పుంజుకుంటుందనే ఆశలు అందరిలోనూ ఎలా ఉన్నాయో.. పురందేశ్వరికి కూడా అలానే ఉన్నాయి. దీంతో ఆమె భవిష్యత్ వ్యూహంపై తర్జన భర్జన పడుతున్నారని, వచ్చే ఎన్నికలు కూడా దాటి పోతే.. ఇక, క్రియాశీల రాజకీయాలకు దూరమైనట్టేనని.. పురందేశ్వరి ఆలోచిస్తున్నాని.. ఈ క్రమంలో అవసరమైతే.. ఏదైనా సంచలన నిర్ణయం తీసుకున్నా..ఆశ్చర్యం లేదని తెలుస్తోంది. ఏ పార్టీని ప్రత్యర్థిని చేసుకుని విమర్శలు చేసేందుకు ఆమె ఇష్టపడడం లేదని అంటున్నారు. ఇదీ.. సంగతి..!