సొంత ఇంట్లో సెగ కొంప ముంచేట్లు ఉందే?
రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సొంత ఫ్యామిలీ సభ్యులు వేర్వేరు పార్టీల్లో ఉండడం చూశాం. గత ఎన్నికల్లోనూ ఒకే ఫ్యామిలీకి చెందిన నేతలు వేర్వేరు పార్టీల తరపున [more]
రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సొంత ఫ్యామిలీ సభ్యులు వేర్వేరు పార్టీల్లో ఉండడం చూశాం. గత ఎన్నికల్లోనూ ఒకే ఫ్యామిలీకి చెందిన నేతలు వేర్వేరు పార్టీల తరపున [more]
రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సొంత ఫ్యామిలీ సభ్యులు వేర్వేరు పార్టీల్లో ఉండడం చూశాం. గత ఎన్నికల్లోనూ ఒకే ఫ్యామిలీకి చెందిన నేతలు వేర్వేరు పార్టీల తరపున పోటీ చేసి అదృష్టం పరీక్షించుకున్నారు. ఉదాహరణకు గత ఎన్నికల్లోనే విశాఖ జిల్లా మాడుగుల నుంచి టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, జనసేన నుంచి ఆయన సోదరుడు పోటీ చేస్తే ఇద్దరూ ఓడిపోయారు. అక్కడ వైసీపీ విజయం సాధించింది. అయితే ఇప్పుడు ఆసక్తికరంగా ఏపీలో ప్రధాన పార్టీలుగా ఉన్న టీడీపీ, వైసీపీ నుంచి మామ, కోడలు మధ్య ఆసక్తికర పోరు జరిగే ఛాన్సులు కనిపిస్తున్నాయి.
ఉపముఖ్యమంత్రి పదవితో…?
ఆ కోడలు డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీ వాణి. ఆ కోడలు మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రాజు. కురుపాం నుంచి 2014, 2019 రెండు ఎన్నికల్లోనూ పుష్ప శ్రీ వాణి భారీ మెజార్టీతో విజయం సాధించారు. గత ఎన్నికల తర్వాత జగన్ ఆమెకు మంత్రి పదవితో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా కట్టబెట్టారు. అయితే పుష్ప శ్రీ వాణి ఫ్యామిలీలో రాజకీయ విబేధాలు ముందు నుంచే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. గత ఎన్నికలకు ముందే ఆమెకు స్వయానా మామ అయిన చంద్రశేఖర్ రాజు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.
వైసీపీ నుంచి టీడీపీలోకి….
ఇక జగన్ ప్రభుత్వం ఏర్పడ్డాక సొంత పార్టీ నేతలను పనులు కావడం లేదని విమర్శలు చేసి మరీ ఆ తర్వాత టీడీపీ గూటికి వచ్చేశారు. ఆయన గతంలో కాంగ్రెస్ తరపున రద్దయిన నాగూరు నియోజకవర్గం నుంచి ఓ సారి ఎమ్మెల్యేగా గెలిచారు. మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజుకు ఆయన స్వయానా సోదరుడు. ఇక కురుపాంలో గత రెండు ఎన్నికల్లోనూ టీడీపీ నుంచి పోటీ చేసి తల్లి, కొడుకులు జనార్థన్ థాట్రాజ్, నరసింహా ప్రియా థాట్రాజ్ ఇద్దరూ కొద్ది రోజుల క్రితమే మృతి చెందారు.
సరైన నేత లేక…?
దీంతో ఇప్పుడు కురుపాం టీడీపీకి సరైన నాయకుడు లేకుండా పోయాడు. ఈ క్రమంలోనే అక్కడ గిరిజనుల్లో పట్టున్న నిమ్మక జయరాజ్ లేదా చంద్రశేఖర్ రాజు పేర్లు పార్టీలో వినిపిస్తున్నాయి. కొందరు పుష్ప శ్రీ వాణి ఓటింగ్‌కు దెబ్బ కొట్టాలంటే ఆమెపై ఆమె మామనే పోటీకి పెడితే ఖచ్చితంగా ఈ సారి అక్కడ విన్ అవుతామని సూచిస్తున్నారు. మరి పార్టీ అధిష్టానం నిర్ణయం ఎలా ? ఉంటుందో ? చూడాలి.