ఈమె కన్నీళ్లకు అసలు కారణం ఇదేనట?
పాలిటిక్స్‌లో ఎవరు ఎప్పుడు ప్రత్యర్తులుగా మారతారో.. ఎవరు ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో.. ఎప్పుడు పరిస్థితులు యాంటీగా మారతాయో చెప్పడం కష్టం. ఇప్పుడు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారట వైసీపీ [more]
పాలిటిక్స్‌లో ఎవరు ఎప్పుడు ప్రత్యర్తులుగా మారతారో.. ఎవరు ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో.. ఎప్పుడు పరిస్థితులు యాంటీగా మారతాయో చెప్పడం కష్టం. ఇప్పుడు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారట వైసీపీ [more]
పాలిటిక్స్‌లో ఎవరు ఎప్పుడు ప్రత్యర్తులుగా మారతారో.. ఎవరు ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో.. ఎప్పుడు పరిస్థితులు యాంటీగా మారతాయో చెప్పడం కష్టం. ఇప్పుడు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారట వైసీపీ నాయకురాలు, జగన్ కేబినెట్లో డిప్యూటీ సీఎంగా ఉన్న పాముల పుష్పశ్రీవాణి. జగన్‌కు, వైఎస్ ఫ్యామిలీకి అత్యంత అనుకూలంగా ఉండడమే కాకుండా వైఎస్ పేరును సైతం తన చేతులపై పచ్చబొట్టు వేయించుకున్న ఏకైక నాయకురాలిగా కూడా పుష్పశ్రీవాణి పేరు తెచ్చుకున్నారు. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం నుంచి రెండుసార్లు వరుస విజయాలు కైవసం చేసుకున్న ఆమెకు జగన్ వైసీపీ అధికారంలోకి రాగానే కీలకమై నడిప్యూటీ సీఎం పదవిని ఎస్టీ కోటాలో కట్టబెట్టి గౌరవించారు.
చెక్ పెట్టేందుకు…?
దీంతో పుష్పశ్రీవాణి జిల్లాలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. తన నియోజకవర్గం కురుపాం సహా విజయనగరం, సాలూరు, బొబ్బిలి నియో జకవర్గాల్లోనూ పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, పుష్పశ్రీవాణి హవాతో సీనియర్ మంత్రి, వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ ఇబ్బంది పడుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన పుష్పశ్రీవాణికి చెక్ పెట్టాలని ఆయన నిర్ణయించు కున్నారట. విజయనగరం జిల్లాలో బొత్స హవా మామూలుగానే ఓ రేంజ్లో ఉంటుంది. అలాంటిది అధికారంలో ఉన్నప్పుడు ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
ముగ్గురు ఎమ్మెల్యేలు.. ఎంపీలు…
జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు.. ఒక ఎంపీ బొత్స బంధువులే.. ఇక జడ్పీచైర్మన్ కూడా బొత్స తన బంధువులకే ఇప్పించుకునేలా ఎప్పటికప్పుడు చక్రం తిప్పుతున్నారు. ఇక ఇప్పుడు ప్రొటోకాల్ ప్రకారం జిల్లాలో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పుష్పశ్రీవాణి హవా స్టార్ట్ అయ్యింది. ఇది సహజంగానే బొత్సకు నచ్చడం లేదట. దీంతో పాటు ఏజెన్సీలో పుష్పశ్రీవాణి హవా నడుస్తుండటం కూడా ఆయనకు నచ్చడం లేదట. ఆమె హవాకు బ్రేకులు వేయాలని బొత్స అనుకున్నదే తడవుగా ఆయన చక్రం తిప్పారు. టీడీపీకి చెందిన సీనియర్ నాయకురాలు శోభా హైమావతి కుమార్తె శోభా స్వాతిరాణిని ఆమె భర్త గణేష్‌తో సహా పార్టీలోకి తీసుకువచ్చారు. గతంలో స్వాతీరాణి.. జెడ్పీటీసీ చైర్‌పర్సన్‌గా కూడా పనిచేశారు.
చెక్ పెట్టాలనే…?
నిజానికి స్వాతీరాణి.. గత ఎన్నికల సమయంలో టీడీపీ నుంచి అసెంబ్లీ లేదా ఎంపీ టికెట్‌ను ఆశించారు. కురుపాం, సాలూరు ఎస్టీ నియోజకవర్గాలు కావడంతో వాటిలో ఒక సీటును లేదా అరకు ఎంపీ సీటును ఇవ్వాలని అభ్యర్థించింది. అయితే, టీడీపీ అధినేత ఆమెను పక్కన పెట్టారు. దీంతో అప్పటి నుంచి కూడా పార్టీలో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్న స్వాతిరాణిని, ఆమె భర్త గణేష్‌ను వైసీపీలోకి తీసుకురావడంద్వారా తన హవాను పెంచుకోవడంతోపాటు.. పుష్పశ్రీవాణి హవాకు చెక్ పెట్టాలని భావించిన బొత్స.. ఆ విధంగా వారిని పార్టీలోకి చేర్చుకున్నారు. పార్టీ కీలక నాయకుడు సాయిరెడ్డి నేతృత్వంలో వీరు పార్టీలోచేరిపోయారు.
కురుపాం టిక్కెట్ ఇప్పిస్తానని…..
స్వాతీరాణికి కురుపాం టికెట్ ఇప్పించే బాధ్యతను కూడా బొత్స తీసుకుంటారనే ప్రచారం సాగుతుండడం గమనార్హం. ఇదిలావుంటే, ఈ విషయం తెలిసినప్పటి నుంచి డిప్యూటీసీఎం పుష్ప శ్రీవాణి తల పట్టుకుంటున్నారు. స్వాతీరాణి దంపతులు పార్టీలోకి చేరడంపై ఆమె తన అనుచరులతోనూ చర్చించారని తెలిసింది. ఇటీవల ఆమె ఓ మీటింగ్‌లో కన్నీళ్లు పెట్టుకోవడం వెనక కారణం కూడా ఇదే అంటున్నారు. మొత్తానికి బొత్స వ్యూహం ఫలిస్తుందా? పుష్ప శ్రీవాణి చెక్ పడుతుందా? లేదా? అనేది చూడాల్సి ఉంది.