రుద్దితే ఊరుకుంటారా?
పుట్టా సుధాకర్ యాదవ్. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు. అటు తెలంగాణతోను, ఇటు ఏపీతోనూ కూడా రాజకీయ సంబంధాలు, అనుబంధాలు ఉన్న [more]
పుట్టా సుధాకర్ యాదవ్. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు. అటు తెలంగాణతోను, ఇటు ఏపీతోనూ కూడా రాజకీయ సంబంధాలు, అనుబంధాలు ఉన్న [more]
పుట్టా సుధాకర్ యాదవ్. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు. అటు తెలంగాణతోను, ఇటు ఏపీతోనూ కూడా రాజకీయ సంబంధాలు, అనుబంధాలు ఉన్న కీలక నేత. రాజకీయ ఆధిపత్య పోరులో అనేక సార్లు చతికిల పడ్డ నాయకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. అయితే, తాజా గా ఆయన పరిస్థితి యూటర్న్ అయింది. కొన్నిదశాబ్దాలుగా చేస్తున్న రాజకీయాల్లో ఇప్పుడు ఏం చేయాలనే విషయం ఆయనను కలవర పెడుతోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన పుట్టా సుధాకర్ యాదవ్.. టీడీపీ రాజకీయాల్లో కీలక నాయకుడిగా ఎదిగారు. కడప జిల్లా మైదుకూరులో తనకు ప్రత్యేక గుర్తింపు కోసం పాకులాడారు.
ఆశలు నెరవేరలేదే……
అయితే, ఆయన ఆశలు నెరవేరలేదు. దీంతో టీటీడీలో చైర్మన్ పదవిపై కన్నేసిన ఆయన దానిని అనేక ఒత్తిళ్లమధ్య సొంతం చేసుకున్నారు. వాస్తవానికి క్రిస్టియానిటీకి దగ్గరగా ఉండే పుట్టా సుధాకర్ యాదవ్ కు ఈ పదవిని ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అనేక మంది దీనిని వ్యతిరేకించారు. అయితే, తనకు స్వయానా వియ్యంకుడు అయ్యే మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ద్వారా చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి మరీ ఈ పదవిని సొంతం చేసుకున్నారు. అయితే, ఈ విషయంలోనూ పుట్టా సుధాకర్ యాదవ్ వివాదాస్పదమే అయ్యారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో గత ప్రభుత్వం నామినేట్ చేసిన పదవులను ఒదులుకోవడం అనేది సర్వసాధారణం.
ఫైట్ చేసి మరీ….
అయితే, పుట్టా సుధాకర్ యాదవ్ మాత్రం తమకు శ్రీవారే ఈ పదవులు ఇచ్చారు కాబట్టి నేను రాజీనామా చేయను. అంటూ భీష్మించారు. దీంతో ప్రభుత్వమే జీవో పాస్ చేసి చైర్మన్ గిరీని ఊడగొట్టే వరకు తెచ్చుకున్నారు. ఇక, ఎన్నికల విషయానికి వస్తే.. తాజాగా ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో శెట్టిపల్లి రఘురామి రెడ్డి చేతిలో పుట్టా సుధాకర్ యాదవ్ ఘోరంగా ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చినా రఘురామిరెడ్డి చేతిలో ఓడిన పుట్టా సుధాకర్ యాదవ్ తాజా ఎన్నికల్లో ఫైట్ చేసి టిక్కెట్ తెచ్చుకుని మరీ రెండోసారి ఓడారు. అయితే, వాస్తవానికి ఎన్నికలకు ముందు ఆయన మరో వియ్యంకుడు, తెలంగాణ ప్రభుత్వంలో కీలక స్తానంలో ఉన్న తలసాని శ్రీనివాస యాదవ్.. ఓ సూచన చేశారు. వైసీపీలోకి జంప్ అయిపో..ఖచ్చితంగా నీకల తీరుతుంది! అని సూచించారు. అయితే, పుట్టా మాత్రం టీడీపీ తరఫునే పోటీ చేశారు. కానీ, తలసాని మాత్రం ఏపీకి వచ్చి మరీ.. చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్న బాబును తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.
బలవంతంగా రుద్దితే…..
ఈ క్రమంలో పుట్టా సుధాకర్ యాదవ్ ప్రతి విమర్శ కానీ, కౌంటర్ కానీ, చేయక పోవడం గమనార్హం. పుట్టా సుధాకర్ యాదవ్ బంధుత్వంతోనే తలసానిపై విమర్శలు చేయడం లేదన్న టాక్ కూడా వచ్చింది. పుట్టా టీటీడీ చైర్మన్గా ఉండడంతో చంద్రబాబు మైదుకూరులో మరో సీనియర్ నేత డీఎల్.రవీంద్రారెడ్డికి సీటు ఇవ్వాలనుకున్నారు. అయితే బీసీ కార్డుతో పాటు బాబుపై అనేక ఒత్తిళ్లు ( బ్లాక్మెయిల్ పాలిటిక్స్ వాడారన్న టాక్ కూడా ఉంది ) చేసి ఆయనే మరోసారి సీటు తెచ్చుకుని ఓడిపోయారు. ఇదిలావుంటే, తాజా ఎన్నికల్లో ఓటమి, కీలకమైన టీటీడీ పదవిని వదులుకోవడం వంటి రీజన్ల నేపథ్యంలో ఇప్పుడు పుట్టా ఫ్యూచర్ ఏంటి? అనే ప్రశ్న అనుచరుల్లో కలుగుతోంది. ఇక మైదుకూరులో పదేళ్లుగా ఆయన్ను బలవంతంగా భరిస్తూ వస్తోన్న టీడీపీ కేడర్ కూడా ఆయన్ను పట్టించుకునే పరిస్థితి లేదు. బాబు ఈ సారి పుట్టాను తమపై బలవంతంగా రుద్దితే ఒప్పుకోమని తెగేసి చెపుతున్నారు. ఈ క్రమంలోనే పుట్టా ఎలా ముందుకు వెళ్తారో ? చూడాలి.