ఒక పేజీ ఎప్పటికీ పీవీదే
దేశానికి దిశ నిర్దేశం చేసిన భారత ప్రధానుల్లో ఒక్కక్కరిది ఒక్కో శైలి. నవభారత నిర్మాణానికి పునాదులు వేసిన నేతగా ప్రధమ ప్రధాని పండిత నెహ్రూ చరిత్ర పుటల్లో [more]
దేశానికి దిశ నిర్దేశం చేసిన భారత ప్రధానుల్లో ఒక్కక్కరిది ఒక్కో శైలి. నవభారత నిర్మాణానికి పునాదులు వేసిన నేతగా ప్రధమ ప్రధాని పండిత నెహ్రూ చరిత్ర పుటల్లో [more]
దేశానికి దిశ నిర్దేశం చేసిన భారత ప్రధానుల్లో ఒక్కక్కరిది ఒక్కో శైలి. నవభారత నిర్మాణానికి పునాదులు వేసిన నేతగా ప్రధమ ప్రధాని పండిత నెహ్రూ చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. జైైకిసాన్ నినాదంతో ద్వతీయ ప్రధాని లాల్ బహుదుార్ శాస్త్రి గుర్తుండిపోయారు. బ్యాంకుల జాతీయి కరణ, రాజభరణాల రద్దు, గరీబీహఠావో నినాదాలతో తృతీయ ప్రధాని ఇందిరాగాంధీ ప్రజల మనస్సులో చిరస్ధానం సాధించాకున్నారు. శాస్త్రపరిజ్ఞాన్ని కొత్తపుంతలు తొక్కించిన నేతగా రాజీవ్ గాంధీ ప్రజలను ఆకట్టుకున్నారు. సరళీకృత ఆర్ధిక, పారిశ్రామిక విధానాల పితామహుడిగా పాములపర్తి వెంకట నరసింహరావు ఒక్కసారిగా దేశ గమనాన్ని మార్చి చరిత్ర సృష్టించారు పీవీ. రాజకీయాల నుంచి వైదొలగి వానప్రస్ధానాన్ని స్వీకరించే దిశలో అనుాహ్యంగా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియెాగం చేసుకొని ఆర్ధికంగా స్వావలంబనకు పీవీ నరసింహారావు వేసిన అడుగులు కారణంగానే నేడు భారత్ ఓ శక్తిగా నిలిచింది. పెద్దగాప్రజాదరణ లేనప్పటికి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని దేశాని పరుగులు పెట్టారు పాములపర్తివారు. దక్షిణాదికి చెందిన తొలి ప్రధానిగా, నెహ్రూ గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తి అయిదేళ్ళ పదవీకాలాన్ని పూర్తిచేసిన నేతగా చరిత్రను పీవీ నరసింహారావు సృష్టించారు.
ఆధునిక శాస్త్ర విజ్ఞానంపై…
పీవీ నరసింహారావు ఒక న్యాయవాది, విద్యావేత్త, సాహితీ వేత్త, బహుభాషా వేత్త పరిపూర్ణ ఆధ్యాత్మికవాది, పంచెకట్టుతో సంప్రదాయవాదిగా కనిపించినప్పటికి ఆధునిక శాస్త్రవిజ్నానంపై అపార పట్టు, అనుభవం కలిగిన నాయకుడు-ఒక్కమాటలో చెప్పాలంటే బహుముఖ ప్రతిభాశాలి. భారతప్రధానులు ఎవరికి ఇన్ని ప్రత్యేకతలు లేవనడం అతిశయెాక్తికాదు. డిగ్రి అనంతరం నాగపూర్ లో ఎమ్.ఎ, పూనే లో లా చేసిన పి.వి కరీంనగర్ జిల్లా మంధని అసెంబ్లీ నియెాజకవర్గం నుంచి ఎమ్. ఎల్.ఎ గా పోటీచేసి రాజకీయ అరంగేట్రం చేశారు. 1957 నుంచి 77 వరకు ఎమ్.ఎల్.ఎ గా, తెలుగు అకాడమీ, అధికారభాషా సంఘం అధ్యక్షుడిగా, విధ్యామంత్రిగా, ముఖ్యమంత్రిగా ఆ యా పదవులకు పీవీ నరసింహారావు వన్నెలద్దారు. విద్యామంత్రిగా గురుకుల పాఠశాల వ్యవస్ధను ప్రారంభించి నాణ్యమైన విధ్యకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రిగా భుా సంస్కరణలను ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించారు.
విదేశాంగ మంత్రిగా….
1977 లో హన్మకొండ నుంచి పార్లమెంట్ కు వెళ్ళడం ద్వారా పీవీ నరసింహారావు ప్రతిభ, దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. 1980 లో ఇందిరాగాంధీ మంత్రివర్గంలో విదేశాంగమంత్రిగా విదేశాంగవిధానాన్ని కొత్తపుంతలు తొక్కించారు.హోంమంత్రిగా పనిచేశారు. రాజివ్ గాంధీ మంత్రివర్గంలో కొత్తగా ఏర్పాటుచేసిన మానవ వనరుల అభివృద్ధి శాఖమంత్రిగా దానిని తీర్చిదిద్దారు. అప్పటివరకు దానిని విధ్యాశాఖ అనివ్య వహరించేవారు. ఇదంతా ఒకఎత్తు. ప్రధానిగా ఆయన తన అద్వితీయ ప్రతిభతో జాతీయంగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. 1991 లో అధికార పగ్గాలు చేపట్టేనాటికి దేశ ఆర్ధిక పరిస్ధితి దయనీయంగా ఉంది. బంగారాన్ని తాకట్టు పెట్టాల్సిన దుస్ధితి నెలకొంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు పూర్తీగా అడుగంటాయి. ఇటువంటి పరిస్ధితుల్లో ఆర్ధికశాఖ మంత్రిగా సంప్రదాయ రాజకీయనాయకుడు పనికిరాడని గ్రహించారు. ఈ శాఖ పగ్గాలు చేపట్టాల్సిందిగా ఆర్.బి.ఐ మాజీ గవర్నర్, సుదీర్ఘ అనుభవశాలి అయిన ఐ.జి.పటేల్ ను కోరారు. ఆయన సున్నితంగా తిరస్కరించడంతో రాజకీయవాసనలు లేని ఆర్.బి.ఐ మరో మాజీ గవర్నర్ డాక్టర్ మన్మోహన్ సింగ్ కు పగ్గాలు అప్పగించి పూర్తిస్వేచ్ఛ ఇచ్ఛారు.
సరళీకృత ఆర్థిక విధానాల ద్వరా….
సరళీకృత ఆర్ధిక, పారిశ్రామిక విధానాలను ఆవిష్కరించారు. లైసెన్స్ ను అంతమెుందించారు. రెడ్ టేపిజం ను పీవీ నరసింహారావు రుాపుమాపారు. ఈ విధానాలు కొద్ది కాలంలోనే మంచి ఫలితాలను ఇచ్చాయి. ఆర్ధిక వ్యవస్ధ క్రమంగా గాడిలో పడసాగింది. ప్రధానిగా పి.వి సాధించీన విజయాలు అనన్యసామాన్యం. పంజాబ్ లో తీవ్రవాదాన్ని అణచివేసి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. కశ్మీర్ లో ఉగ్రవాదాన్ని నియంత్రించారు. అమెరికాతో సంబంధాలను బలోపేతం చేశారు. రాజస్ధాన్ లోని పోఖ్రాన్ లో అణుపరీక్షలకు ప్రయత్నాలు ప్రారంభించారు. 1996 లో మళ్ళిగెలిచి ఉంటే ఆయన ఆద్వర్యంలోనే అణుపరీక్షలు జరిగి ఉండేవని నాటి పరీక్షలకు నేతృత్వం వహించిన అబ్దుల్ కలాం పేర్కొనడం ఇక్కడ గమనార్హం 1992 లో ఇజ్రాయెల్ తో దౌత్య సంబంధాల పునరుద్ధరణ పీవీ నరసింహారావు తీసుకున్న మరో సాహసోపేత నిర్ణయం. దీంతో డిల్లీలో ఇజ్రాయెల్ తన రాయబార కార్యాలయాన్ని ప్రారంభించింది. అప్పటివరకు ముస్లింలకు భయపడి, అరబ్ దేశాల ఒత్తిడితో ఇజ్రాయెల్ ను భారత్ దుారం పెట్టేది. లుక్ ఈస్ట్ పాలసీ తో ఆగ్నేసియా దేశాలతో సంబంధాలను బలోపేతం చేశారు. తద్వారా చైనా ఆధిపత్యానికి కొంతవరకు చెక్ పెట్టారు. చైనాతో సత్సంబధాల కోసం హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో ప్రవాసజీవితం గడుపుతున్న దలైలామాను దుారం పెట్టారు. 1993 మార్చి 12 నాటి ముంబయి అల్లర్లను సమర్ధంగా ఎదుర్కొన్నారు. ఐరాస లో భారత్ గళాన్ని వినిపించేందుకు నాటిభాజపా అగ్రనేత అటల్ బీహారీ వాజ్ పేయిని పంపండం పి.వి దూరదృష్టికి, రాజకీయ పరిణతికి నిదర్శనం. ఇలాంటి దుారదృష్టిగల నిర్ణయాలు ఎన్నో తీసుకున్నారు.
కాంగ్రెస్ గుర్తుంచుకోకున్నా…..
1992 డిసెంబరు 6 న బాబ్రీమసీదు విధ్వంసం పీవీ నరసింహారావు వైఫల్యంగా కొందరు పేర్కొంటారు. కానీ నాటి యు.పి లోని కళ్యాణ్ సింగ్ భాజపా సర్కార్ ఇచ్చిన హామీని నమ్మి తాను మెాసపోయానని పి.వి తరచుా సన్నిహితుల వద్ద చెప్పేవారు. ఉత్తరాది నాయకులు ‘రావు ‘ గా, దక్షిణాది నాయకులకు పి.వి గా ఆయన సుపరిచితుడు అర్జున్ సింగ్, నారయణ్ దత్ తివారీ వంటి నాటి కాంగ్రెస్ అధినేత లు పి.వి సోనియా మధ్య దుారం పెంచేందుకు ప్రయత్రించారన్న వాదనలు అప్పట్లో ఉండేవి. వారి వల్లే సోనియా పీవీ నరసింహారావును దుారం పెట్టారని కాంగ్రెస్ వర్గాల అభిప్రాయం. 1996 ఎన్నకల్లో ఓటమి అనంతరం పార్టీ అధ్యక్ష పదవినుంచి పి.వి ని తొలగించిన తీరు, సీతారాం కేసరికి పగ్గాలు అప్పగించడంలో సోనియా పాత్ర బహిరంగం. జార్ఖాండ్ ముక్తిమోర్చా, సెయింట్స్ కిట్స్ కుంభకోణం, జైన్ హవాలా కుంభకోణాలుపీవీ నరసింహారావు ప్రతిష్టను మసకజార్చాయి. చివరికి ఈ ముాడు కేసుల్లో ఆయనకు న్యాయస్ధానాల నుంచి క్లీన్ చిట్ ఇచ్చింది. అత్యున్నతమైన పదవి చేపట్టినప్పటికీ ఆర్ధింగా ఇబ్బంది పడ్డ నేత బహుశా పి.వి ఒక్కరే అంటే అతిశయెాక్తి కాదు. పీవీ నరసింహారావు సేవలను సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్ గుర్తుంచుకోకపోయినా జాతి ఎపుడు స్మరించుకుంటుంది.
-ఎడిటోరియల్ డెస్క్