పీవీ…. కళ్ళు తెరిపించారా ?
పీవీ నరసింహారావు. రాజకీయాల్లో రుషి లాంటి వారు. ఆయన పాండిత్యం పామరులకు అసలు అర్ధం కాదు, పీవీని ఆయన ఠీవీని విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న రోజులోనే [more]
పీవీ నరసింహారావు. రాజకీయాల్లో రుషి లాంటి వారు. ఆయన పాండిత్యం పామరులకు అసలు అర్ధం కాదు, పీవీని ఆయన ఠీవీని విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న రోజులోనే [more]
పీవీ నరసింహారావు. రాజకీయాల్లో రుషి లాంటి వారు. ఆయన పాండిత్యం పామరులకు అసలు అర్ధం కాదు, పీవీని ఆయన ఠీవీని విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న రోజులోనే ప్రపంచ దేశాలు మెచ్చుకునేవి. గొప్పవారు ఎపుడూ తమ గురించి తాము చెప్పుకోరని అంటారు. పీవీ ఆ కోవకు చెందిన నాయకుడే. ఆయన విలువను తెలుసుకోవాలంటే ఎంతో కొంత అయినా బుర్రలో గుజ్జు ఉండాలి. కానీ కాంగ్రెస్ రాజకీయమంతా మరుగుజ్జులతో నిండిన వేళ పీవీ వంటి మహనీయున్ని పక్కన పెట్టారు. ఆయనతో తమకు అసలు సంబంధం లేదని అన్నారు. ఇక ఏ దేశ ప్రధానికి జరగని అవమానం ఆయనకు చేసి తమ స్థాయి ఇంతేనని కూడా నిరూపించుకున్నారు. ఆయన భౌతిక కాయం కూడా ఏఐసీసీ ఆఫీస్ లో ఉంచేందుకు నోచుకోలేకపోయింది. అందరి ప్రధానులలాగా ఢిల్లీలో అంత్యక్రియలు జరిగే భాగ్యం కూడా లేదని తేల్చిచెప్పారు.
ఆయనే గొప్ప …..
పాతికేళ్ల దేశ రాజకీయాన్ని ఒకసారి చూస్తే చరిత్రకారులైనా, రాజకీయ విశ్లేషకులైనా కూదా ఒక్కటే చెబుతారు. పీవీ సాధించిన విజయాలు అసమాన్యం అని కూడా అంటారు. ఒకనాడు బంగారాన్ని కుదువ పెట్టుకున్న దౌర్భాగ్య స్థితి నుంచి ఈ దేశాన్ని కాపాడి నెహ్రూ మార్క్ ఆర్ధిక విధానాలకు పూర్తిగా రెండవ కోణాన్ని ఆవిష్కరించిన ఘనత పీవీది. ఆయన చూపిన బాటతోనే ఈ రోజు దేశం ఇంతటి సౌభాగ్యాన్ని సంతరించుకుంది. ఇక బీజేపీలో ఖాతాలో పడిన ప్రోఖ్రాన్ పరీక్షల వ్యవహారం వెనక తెలివి కూడా పీవీదే. వాజ్ పేయ్ ప్రధాని అయ్యాక దాన్ని అందిపుచ్చుకున్నారంతేనని చెబుతారు. ఇలా దేశానికి ఆర్ధిక, రక్షణ స్వావలంబన కలిగించిన మహానేతగా పీవీని చెబుతారు. బాబ్రీ మసీద్ కూలడం కూడా పీవీ తప్పు కాదని తరువాత కధ చూస్తే అర్ధమవుతుంది. ఓ విధంగా బాబ్రీ మసీద్ కూల్చివేతతో అయోధ్య వివాదాన్ని పీవీ కొత్త మలుపు తిప్పారని కూడా చెప్పాలేమో.
మహనీయుడేనా…
ఇలా దేశమంతా కొనియాడిన పీవీని కాంగ్రెస్ అగ్ర నాయకత్వం మాత్రం ఎపుడూ పట్టించుకోలేదు, పైగా సంకుచితంగా ఆలోచన చేసి ఆయన వల్ల ముస్లిం ఓట్లు పోతాయని బెంగపడింది. కానీ ఇపుడు అదే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధి పీవీ గొప్ప నేత అంటున్నారు. ఆయన మహనీయుడు అని కీర్తిస్తున్నారు. నిజంగా ఇన్నేళ్ల తరువాత అయినా కాంగ్రెస్ పార్టీ పీవీని అందిస్తున్న నివాళిగా దీన్ని చెప్పుకోవాలేమో. పీవీ లాంటి రాజనీతికోవిదున్ని కోల్పోయి ఎంత లోటు పడుతున్నామో నిజంగా సోనియాగాంధీ తెలుసుకుంటే అంత కంటే కావాల్సింది లేదు కూడా. ఇక టీయారెస్ పీవీని తమ వాడిగా చేసుకునే ప్రయత్నంలో మరేమో కానీ శత జయంతి ఉత్సవాలను నిర్వహిస్తోంది. దాని వల్లనే కాబోలు కాంగ్రెస్ కి కూడా కళ్ళు తెరచుకున్నాయి. నిజానికి పీవీ లాంటి మహానుభావులకు ప్రాంతాలు, పరిధులు లేవు. ఆయన విశ్వ మానవుడే. పీవీని తెలంగాణాకే పరిమితం చేయకుండా దేశమంతా ఆయన శత జయంతి ఉత్సవాలు చేస్తే బాగు అని పలువురు అంటున్నారు. అలాగే ఏపీలో జగన్ సర్కార్ కూడా పీవీని స్మరించుకుని ఆయన పేరిట ఒక కొత్త జిల్లాకు పేరు పెడితే ఆయన స్పూర్తి అందరిలోనూ కలకాలం ఉంటుంది. కేంద్రంలోని మోడీ సర్కార్ సైతం భారత రత్న పీవీకి ఇస్తే తన గురువు వాజ్ పేయికి నిజమైన స్నేహితుడికి గౌరవం ఇచ్చినట్లుగా ఉంటుంది.