రాజుగారికి టార్చర్ మొదలైందా ?
ఆయన జీవితాశయం ఎంపీ కావాలని. దాని కోసం అటూ ఇటూ పార్టీలు మారి మొత్తానికి వైసీపీ తరఫున 2019 ఎన్నికల్లో నర్సాపురం నుంచి గెలిచారు. సరే ఎంపీ [more]
ఆయన జీవితాశయం ఎంపీ కావాలని. దాని కోసం అటూ ఇటూ పార్టీలు మారి మొత్తానికి వైసీపీ తరఫున 2019 ఎన్నికల్లో నర్సాపురం నుంచి గెలిచారు. సరే ఎంపీ [more]
ఆయన జీవితాశయం ఎంపీ కావాలని. దాని కోసం అటూ ఇటూ పార్టీలు మారి మొత్తానికి వైసీపీ తరఫున 2019 ఎన్నికల్లో నర్సాపురం నుంచి గెలిచారు. సరే ఎంపీ అయ్యారు, వైసీపీ సిఫార్స్ తో లోక్ సభలో పార్లమెంటరీ కమిటీ చైర్మన్ పదవి కూడా దక్కింది. కానీ ఎందుకో రఘురామ కృష్ణంరాజుకి పాతవాసనలు పోలేదో లేక అందరూ ఆరోపిస్తున్నట్లుగా ఆయన వ్యాపార సంబంధాల కారణంగానో కేంద్రంలో సఖ్యతగా ఉండాలనుకున్నారో తెలియదు కానీ కాషాయం నేతలతో చనువుగా ఉంటూ వచ్చారు. ఇది వైసీపీకి కంటగింపుగా మారి కధ ఆయన మీద వేటు వేసేటంతగా సాగిపోయింది. రఘురామ కృష్ణంరాజు మీద ఇపుడ్ లోక్ సభ స్పీకర్ వద్ద వైసీపీ ఇచ్చిన అనర్హత పిటిషన్ పెండింగులో ఉంది.
ఫుల్ సైలెంట్…
ఇక రఘురామ కృష్ణంరాజు మీద మొదట్లో వైసీపీ నుంచి గట్టి రియాక్షన్స్ వచ్చినా కూడా ఇపుడు ఫుల్ సైలెన్స్ ని పార్టీ పాటిస్తోంది. ఏపీలో ప్రతీ దానికీ జగన్ ని ముడిపెడుతూ విపక్ష పాత్ర పోషిస్తున్న రఘురామ కృష్ణంరాజుకి వైసీపీ నుంచి మౌనమే సమాధానం అవుతోంది. ఆయన్ని పట్టించుకోవద్దని వైసీపీ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఏమైనా వెళ్లాయేమో తెలియదు కానీ వ్యూహాత్మకంగానే వైసీపీ సైడ్ చేసింది. ఇపుడు టీడీపీ అనుకూల మీడియాకు రఘురామ కృష్ణంరాజు అట్రాక్షన్. ఆయన అక్కడ మీడియా మీట్ల పేరిట జగన్ మీద విరుచుకుపడితే దానిని హైలెట్ చేస్తున్నారు.
వెంటాడుతున్నారా ……
ఇవన్నీ ఇలా ఉంటే మరో వైపు వైసీపీ ఫ్యాన్స్ అనుకోవచ్చు, కార్యకర్తలు కావచ్చు, వారికి ఏ హద్దులూ ఉండవు కాబట్టి రఘురామ కృష్ణంరాజుకు నేరుగా ఫోన్ చేసి బెదిరిస్తున్నారుట. అలాగే ఆయన మీద సోషల్ మీడియాలో అసభ్యమైన పదజాలంతో హాట్ కామెంట్స్ పెడుతున్నారుట. దీంతో మండిపోతున్న రఘురామ కృష్ణంరాజు ఒక్క లెక్కన బరస్ట్ అవుతున్నారు. ఆయన వీరి మీద దాడికి తన శక్తియుక్తులను ధారపోయడమే ఇపుడు అసలైన టర్నింగ్ పాయింట్. ఓ దశలో అవేశంతో ఆయన మీడియా ముఖంగానే వీరి మీద దూషణలకు పాల్పడుతున్నారు. మొత్తానికి ఈ విధంగా తెర వెనక టార్చర్ చేస్తున్న వారెవరో కానీ రఘురామ కృష్ణంరాజుకి కొత్త బాధలు ఎక్కువయ్యాయని అంటున్నారు.
రాజీనామా చేయరట……
మరో వైపు తనకు ఫోన్ చేసి రాజీనామా చేయమని డిమాండ్ చేస్తున్న వారికి రఘురామ కృష్ణంరాజు గట్టిగా సమాధానం ఇస్తున్నారు. తాను రాజీనామా చేయనని, తాను ప్రజల మద్దతుతో గెలిచానని అంటున్నారు. తనను రాజీనామా చేయమన్న వారు అబద్దపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ ని ముందు రాజీనామా అడగాలని కూడా అంటున్నారు. మొత్తం మీద చూస్తే రఘురామ కృష్ణంరాజు విషయాన్ని వైసీపీ పై స్థాయిలో వదిలేసింది. ఇక క్యాడర్ నుంచి సోషల్ మీడియా నుంచి మాత్రం రఘురామ కృష్ణంరాజుకు వేధింపులు మొదలైపోయాయన్నమాట. మరో వైపు ఆయన విమర్శలకు ప్రతి విమర్శలు చేసి పెద్దవారిని చేయాలనుకోలేదన్న వ్యూహాన్ని వైసీపీ అమలుచేస్తోంది. దీంతో రఘురామ కృష్ణంరాజు పోరాటం అంతా ఇపుడు బ్లాక్ మెయిల్ ఫోన్ కాల్స్ చేస్తున్న వారితో, సోషల్ మీడియా వారితోనేనన్న మాట. ఏదేమనుకున్నా మూడు నెలల వ్యవధిలోనే రఘురామ కృష్ణంరాజు దర్జా ఇలా తగ్గిపోవడమే వైసీపీ వేసిన రివర్స్ ప్లాన్ గా ఉందనుకోవాలి.