జగన్ చుట్టూ కోటరీయే నన్ను దగ్గరకు రానివ్వడం లేదు….
ముఖ్యమంత్రి చుట్టు ఉన్న కోటరీ తన లాంటి వారిని సీఎం దగ్గరకు రానివ్వడం లేదని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఇద్దరు ముగ్గురు ఎంపీలను తప్ప [more]
ముఖ్యమంత్రి చుట్టు ఉన్న కోటరీ తన లాంటి వారిని సీఎం దగ్గరకు రానివ్వడం లేదని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఇద్దరు ముగ్గురు ఎంపీలను తప్ప [more]
ముఖ్యమంత్రి చుట్టు ఉన్న కోటరీ తన లాంటి వారిని సీఎం దగ్గరకు రానివ్వడం లేదని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఇద్దరు ముగ్గురు ఎంపీలను తప్ప మిగతా వారిని సీఎం కూడా కలవడం లేదని అన్నారు. ఒక టీవీ ఛానల్ లో ఆయన మాట్లాడారు. సీఎం అంటే నాకు అత్యంత గౌరవం అని చెప్పారు. సీఎం ని నేరుగా కలిసే అవకాశం లేక మీడియా ద్వారా చెప్పాల్సి వచ్చిందని రఘురామకృష్ణంరాజు తెలపిారు. సీఎం ను కలవనివ్వకుండా కొందరు అడ్డు పడుతున్నారన్నారు. టీటీడీ విషయంలో భక్తుడిగానే తాను స్పందించానని చెప్పారు. ఇసుక కొరత తీవ్రంగా ఉందని, 16వేలకు ధర పెరిగిందని చెప్పారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విషయంలో కోర్టు తీర్పులే తాను ఉదహరించానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా వచ్చే వరకు వేచి ఉంటే బాగుండేదని రఘురామ కృష్ణంరాజు అభిప్రాయపడ్డారు.
కోటరీ ఎవరో తెలుసు….
కోట్ల రూపాయల ఫీజులు చెల్లించి న్యాయవాదుల్ని పెట్టుకున్న తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే వరకు ఆగి ఉండాల్సిందని అన్నారు. రమేష్ కుమార్ ని అభిశంసన చేసి ఉండాల్సిందని, ఎన్నికల సంస్కరణ అని చెబుతూ దుర్భాషలు ఆడటాన్ని ఆయన తప్పుపట్టారు. రమేష్ కుమార్ విషయంలో సీఎంని అందరూ తప్పు దోవ పట్టించారన్నారు రఘురామ కృష్ణం రాజు, కోటరీ ఎవరు ఉన్నారో నాకు తెలీదని, కోటరీలో పేర్లు మీరే చెబుతున్నారు.., అందరికి ఆ పేర్లు తెలిసినవేనని చెప్పారు. వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్నారెడ్డి, విజయ సాయిలతో పాటు ఓ అధికారి వల్ల సీఎం కి దగ్గర కాలేకపోతున్నామని తెలిపారు. సీఎం మాత్రమే తమ నాయకుడు, ఆయనకు మాత్రమే జవాబుదారీగా ఉంటానని రఘురామ కృష్ణంరాజు చెప్పారు. న్యాయ వ్యవస్థను పరిగణలోకి తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉందన్నారు. సీఎం నిర్ణయాల్లో తప్పు లేదని, ఆచరణలో కి తెచ్చే సమయంలో న్యాయ పరమైన చిక్కులు వచ్చాయన్నారు.
పార్టీ నుంచి సస్పెండ్ కావాలని….
పార్టీ నుంచి సస్పెండ్ అవ్వడం తన ఉద్దేశం కాదని రఘురామకృష్ణంరాజు తెలిపారు. తాను ఏ తప్పు చేయలేదన్నారు. ఎంతో మంది తమ పార్టీలోకి రావాలని ఉవ్విళ్లూరుతుంటే తాను సస్పెండ్ అవ్వాలని ఎందుకు అనుకుంటానని ప్రశ్నించారు. దేశం మొత్తం వైసీపీ వైపు చూస్తుంటే, తాను బీజేపీ వైపు ఎందుకు చూస్తానని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. 22మందిలో ఎంత మందిని సీఎం కలుసుకున్నారని ప్రశ్నించారు. సీఎం ఢిల్లీ వచ్చినప్పుడు తాను కలుసుకున్నానని చెప్పారు. గత్యంతరం లేక బయటకు వచ్చి చెప్పుకుంటున్నానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. గంగ రాజు కొడుకు రంగరాజుని మా పార్టీలోకి తెచ్చారని, తనకు మాట మాత్రం చెప్పకుండా ఆయన్ని తెచ్చి పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడు చేశారన్నారు. బీజేపీ నాయకుడి కొడుకుని వైసీపీలోకి తెచ్చారన్నారు. పార్టీ నిర్ణయమే శిరోధార్యం అని తానేమి చెప్పలేనని రఘురామ కృష్ణంరాజు తెలపారు.