వైసీపీలో రఘురామకృష్ణంరాజును సమర్థించే లీడర్లున్నారా..!
వైసీపీ విషయంలో కొరకరాని కొయ్యగా మారిన ఎంపీ.. నరసాపురం పార్లమెంటు సభ్యుడు కనుమూరి రఘురామ కృష్ణంరాజు. పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నట్టుగా ఆయన స్వపక్షంలోనే విపక్షంగా [more]
వైసీపీ విషయంలో కొరకరాని కొయ్యగా మారిన ఎంపీ.. నరసాపురం పార్లమెంటు సభ్యుడు కనుమూరి రఘురామ కృష్ణంరాజు. పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నట్టుగా ఆయన స్వపక్షంలోనే విపక్షంగా [more]
వైసీపీ విషయంలో కొరకరాని కొయ్యగా మారిన ఎంపీ.. నరసాపురం పార్లమెంటు సభ్యుడు కనుమూరి రఘురామ కృష్ణంరాజు. పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నట్టుగా ఆయన స్వపక్షంలోనే విపక్షంగా మారిన విషయం వాస్తవం. పార్టీని తాను ఏమీ అనలేదంటూనే విపక్షాని కన్నా ఘోరంగా అనాల్సినవి అ అనేస్తారు. ఇక, పార్టీ అధినేత జగన్ తన గుండెల్లో ఉన్నాడని, తాను హనుమంతుని మాదిరిగా గుండెలు చీల్చి చూపించలేనని చెబుతూనే..జగన్‌ను ఇరుకున పెట్టేలా కామెంట్లు, సూచనలు, డిమాండ్లను లేవనెత్తుతున్నారు. దీంతో వైసీపీలో రఘురామ కృష్ణంరాజు వ్యవహారం తెగదు.. సాగదు అన్నట్టుగా తయారైంది.
సస్పెండ్ చేయకుండా….
అయితే, ఇలా దూకుడుగా వ్యవహరించే నేతను, పార్టీ లైన్‌ను దాటేసిన నాయకుడిని, చెవిలో చెప్పుకోవాల్సిన విషయాలను నడిరోడ్డుపై చెప్పుకోవడాలు.. వంటివి చూశాక.. పార్టీ నుంచి ఆయనను బహిష్కరిస్తారని అందరూ అనుకున్నారు. లేదా కనీసం సస్పెండ్ చేయడం ఖాయమని చెవులు కొరుక్కున్నారు. కానీ, అనూహ్యంగా ఆయనపై అనర్హత వేటు వేయించేందుకు పార్టీ అధినేత జగన్ పావులు కదిపారు. అయితే, ఈ విషయం చాలా గోప్యంగా సాగినా.. ఎక్కడో ఒక చోట లీకై.. ఏకంగా రఘురామ కృష్ణంరాజు చెవిలోనే పడిందా? దీంతో ఆయన ముందుగానే అలెర్ట్ అయ్యారా? అంటే.. ఔననే అంటున్నారు తాజాగావైసీపీ నాయకులు.
వారి సూచనల మేరకే….
తనపై అనర్హత వేటు వేసేందుకుజగన్ పావులు కదుపుతున్నారని, పార్టీ కీలకనేతలతో ఆయన చర్చించారని, రేపో మాపో.. తనపై పార్లమెంటు స్పీకర్‌కు ఫిర్యాదు చేయనున్నారని రఘురామ కృష్ణంరాజుకు ముందుగానే తెలిసిపోయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రఘు నేరుగా బీజేపీ కీలక నేతలతో భేటీ అయ్యారని, తనపై వేటు వేయకుండా చూడాలని కూడా ఆయన కోరారని తెలుస్తోంది. ఇదే విషయం ఇప్పుడు ఇటు వైసీపీలోను, ఢిల్లీలోనూ కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే, బీజేపీ వ్యూహాత్మకంగా ఆయనను హైకోర్టుకు వెళ్లాలనే సూచనలు చేసిందని, వారి సూచనలు, సలహాల మేరకే రఘురామ కృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారని అంటున్నారు.
ఎవరు అందించారన్న దానిపై…
దీంతో ఇప్పుడు లోక్ సభ స్పీకర్.. ఇది ఎలాగూ.. హైకోర్టులో ఉంది కాబట్టి.. తాను జోక్యం చేసుకోనని చెప్పడానికి.. ఇటు హైకోర్టు.. ఇది ఎలాగూ స్పీకర్ పరిధిలో ఉందికనుక మేం ఏమీ చెప్పలేమని కాలం గడిపేందుకు అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. మొత్తంగా వైసీపీలోనే రఘురామ కృష్ణంరాజును సమర్థించే వారు ఉన్నారనేది స్పష్టం అవుతోందని చెబుతున్నారు. అందుకే ఇక్కడ వేటు వేస్తారన్న విషయాన్ని ఆయనకు ముందుగానే ఉప్పందించారన్న విషయం సైతం అధిష్టానం గ్రహించిందన్న చర్చలు వైసీపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.