నేరం నాది కాదు.. వారిదే?
అపుడెపుడో పాతకాలంలో రెండు సినిమాలు వచ్చాయి. దేవుడు చేసిన మనుషులు అని ఒకటి, మనుషులు చేసిన దొంగలు అని ఒకటి. ఇక ఇంకా చెప్పుకుంటే లాజికల్ టైటిల్ [more]
అపుడెపుడో పాతకాలంలో రెండు సినిమాలు వచ్చాయి. దేవుడు చేసిన మనుషులు అని ఒకటి, మనుషులు చేసిన దొంగలు అని ఒకటి. ఇక ఇంకా చెప్పుకుంటే లాజికల్ టైటిల్ [more]
అపుడెపుడో పాతకాలంలో రెండు సినిమాలు వచ్చాయి. దేవుడు చేసిన మనుషులు అని ఒకటి, మనుషులు చేసిన దొంగలు అని ఒకటి. ఇక ఇంకా చెప్పుకుంటే లాజికల్ టైటిల్ గా నేరం నాది కాదు ఆకలిది అని అన్నగారి సినిమా కూడా వచ్చింది. వీటి కధ ఏంటి అన్న దానికంటే ఈ సినిమాల టైటిల్స్ చూస్తేనే హీరో పాత్ర ఎంత నెగిటివిటీతో ఉన్నా ఈజీగా ఎదుటివారి మీదకు నెట్టేయడం కనిపిస్తుంది. దానికి కావాల్సినంతగా తన వైపు అనుకూల వాదన వినిపించడం సినిమా మొత్తంలో ఉంటుంది. ఇపుడు రాజకీయాల్లోనూ ఈ ట్రెండ్ వచ్చేసింది. ఏడాది క్రితం చంద్రబాబు ఓడిపోయారు. అపుడు జనమంతా రోజూ వచ్చి కరకట్ట వద్ద ఉన్న ఆయన ఇంట్లో చేరి బోరున విలపిస్తూ ఎందుకోడిపోయవయ్యా. ఎవరు ఓడించారయ్యా అంటూ రాగాలూ, దీర్ఘాలు తీసిన కధ గుర్తుండే ఉంటుంది. ఇక పవన్ కళ్యాణ్ జనసేన విషయంలో అంతే. పవన్ నిజాయతీని జనం అర్ధం చేసుకోలేక ఓడించారు అంతే. ఇదీ అభిమానులు తేల్చిన తార్కిక విశ్లేషణ.
నేరం నాది కాదు…
ఇపుడు మళ్ళీ అచ్చం ఎన్టీయార్ పాత సినిమా టైటిల్ లాగానే నేరం నాది కాదు, ఏ తప్పూ నేను చేయలేదు అని పరమ బుద్ధిమంతుడిగా నర్సాపురం రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు అంటున్నారు. తాను ఎప్పటికీ వైసీపీకి వీర విధేయుణ్ణేనని కూడా చెప్పుకుంటున్నారు. తనను ఇలా చేసింది, రచ్చకు ఈడ్చింది హడావుడి మీడియాయేనని ఇది ఆ మాయేనని కూడా ఆడిపోసుకుంటున్నారు. రెండు గొట్టాలు పెట్టి ఏదో చెప్పమంటారు, ఏది చెప్పినా కూడా తప్పే, చెబితే ఇలా చూపిస్తారు. చెప్పకపోతే ఎస్కేప్ అయ్యారని మీరే హెడ్ లైన్స్ వేస్తారు అంటూ మీడియా మీద మండిపోతున్నారు రఘురామకృష్ణం రాజు.
నాడు అలా….
మరి ఇంతలా మీడియాను ఇపుడు దూరం పెడుతున్న రఘురామకృష్ణం రాజు నాడు వైసీపీ వద్దు మాకీ ఎల్లో చానల్స్ అంటూ కొన్నింటిని బహిష్కరించిన సంగతి తెలిసి కూడా వాటి చర్చలో పాలుపంచుకుని వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడినపుడు ఈ సోయి ఏమైందని వైసీపీ నేతలే అంటున్నారు. ఇక ప్రెస్ నోట్లు రిలీజ్ చేస్తూ లేఖలు రాస్తూ తరచూ వైసీపీ సర్కార్‌ని ఇబ్బంది పెట్టేలా చేసిన చేష్టలను ఏమనాలి అని కూడా అంటున్నారు. ఇన్ని రకాలుగా చేసి తీరా ఇపుడు మాత్రం నా తప్పు ఏమీ లేదు అంతా మీడియా చేసిన పనే. వైసీపీకి నేను వీర సైనికుణ్ణి అని రఘురామకృష్ణం రాజు చెబుతూంటే మీడియా కూడా నోరువెళ్లబెట్టి చూస్తోంది.
నమ్మాలా…?
ఇక వైసీపీ మరో ఇరవై ఏళ్ల పాటు అధికారంలో ఉండాలన్న ఉద్దేశ్యంతో తాను ప్రభుత్వానికి సలహాలు సూచనలు మాత్రమే ఇచ్చాను అని రఘురామకృష్ణం రాజు అంటున్నారు. తాను కరడు కట్టిన వైసీపీ కార్యకర్తను అంటూంటే నమ్మాల్సిందేనా అంటున్నారు. ఇక వైసీపీకి మంచి భవిష్యత్తు కోసమే తాను ఈ రకంగా చెప్పాను తప్ప తనకు ఎటువటి ద్వేషమూ లేదని కూడా ఆయన అంటున్నారు. సరే ఇది వైసీపీ హై కమాండ్ నమ్ముతుందో లేదో పక్కన పెడితే ఇన్నాళ్ళూ రఘురామకృష్ణం రాజు ఎపిసోడ్ చూస్తున్న జనాలు అయినా వీటిని నమ్ముతారా అంటే జవాబు కష్టమే. ఇక ఇన్నాళ్ళూ వైసీపీ మీద ఓ రేంజిలో విరుచుకుపడిన రఘురామకృష్ణం రాజు పాపమంతా మీడియా మీదకు నెట్టేసి పునీతుడు అయినా జగన్ క్షమిస్తారా. ఆయన ఎంపీ పదవి మీద వేలాడుతున్న అనర్హత కత్తి అదృశ్యం అవుతుందా అంటే డౌటే మరి.