ఫస్ట్ బలయ్యేది రాజుగారేనటగా ?
వైసీపీలో రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఒక్క లెక్కన బరస్ట్ అవుతున్నారు. ఆయన నేరుగా జగన్ మీదకు దాడికి దిగుతున్నారు. జగన్ సర్కార్ ప్రళయం అంచున ఉందని కూడా [more]
వైసీపీలో రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఒక్క లెక్కన బరస్ట్ అవుతున్నారు. ఆయన నేరుగా జగన్ మీదకు దాడికి దిగుతున్నారు. జగన్ సర్కార్ ప్రళయం అంచున ఉందని కూడా [more]
వైసీపీలో రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఒక్క లెక్కన బరస్ట్ అవుతున్నారు. ఆయన నేరుగా జగన్ మీదకు దాడికి దిగుతున్నారు. జగన్ సర్కార్ ప్రళయం అంచున ఉందని కూడా హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఇందంతా ఎందుకు చేస్తున్నారు. కేవలం వైసీపీ సర్కార్ లోపాలను మాత్రమే తాను ప్రస్తావిస్తున్నాను అని చెప్పుకునే రఘురామకృష్ణంరాజు ఇపుడు జగన్ మీద వ్యక్తిగత దాడికి ఎందుకు దిగుతున్నారు. దీని వెనకాల ఏం జరుగుతోంది. ఈ మతలబు ఏంటి అన్నది చర్చగా ఉంది. అయితే ఢిల్లీ కబుర్లు చూస్తే మాత్రం తొందరలోనే జగన్ కి రాజు గారిని మాజీ చేసి కానుకగా ఇస్తారా అన్న డౌట్ వస్తోంది.
అది నిజమేనా….?
బీజేపీది ఇపుడు విశ్వసనీయత పరీక్ష. ఎన్డీయే నుంచి ఒక్కొక్కరూ వెళ్ళిపోతున్నారు. దాంతో ఎవరో ఒకరిని పార్టీలో చేర్చుకోవాలి. అతి పెద్ద పార్టీగా ఉన్న వైసీపీని ఎన్డీయేలోకి తీసుకురావడం ద్వారా ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా మా బలం పెరిగింది అని చెప్పుకోవచ్చు. అలాగే సౌత్ లో మేము గట్టిగా ఉన్నాం, తెలుగు రాష్ట్రాలో ఒక చోట మిత్ర పక్ష ప్రభుత్వం ఉందని కూడా ఢంకా భజాయించి చెప్పుకోవచ్చు. అందుకే బీజేపీ ఇపుడు జగన్ ని చేరదీస్తోందని అంటున్నారు.
తలనొప్పిగానా….?
అయితే జగన్ మాత్రం ముందు తాను పెట్టిన కొన్ని డిమాండ్లు కేంద్రం అర్జంటుగా పరిష్కరించమని పట్టుపడుతున్నారని టాక్. అవేంటి అంటే శాసనమండలి రద్దు, మూడు రాజధానుల విషయంలో అంతా సజావుగా జరిగేలా చేయడం. ఇక ఏపీకి దండీగా నిధులు ఇవ్వడం. పోలవరం ప్రాజెక్ట్ కి ఏ పేచీ పూచీ లేకుండా కావాల్సిన నిధులు ఇవ్వడం. వీటితో పాటుగా అతి ముఖ్యమైన కోరికగా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ని అర్జంటుగా అనర్హత వేటు వేసి ఇంటికి పంపించేయడం, అలాగే చంద్రబాబు మీద సీబీఐ విచారణ చేయించడం. మరి బీజేపీకి ఇందులో కొన్ని కష్టమైనవి, క్లిష్టమైనవి కూడా ఉన్నాయి.
అదే ముందుట….
దాంతో బీజేపీ తెలివిగా రఘురామకృష్ణంరాజు అనర్హత వేటును ముందుకు తెచ్చి కధ నడపడానికి సిద్ధంగా ఉందని అంటున్నారు. ఇది చాలా సులువు. మిగిలినవి చేయాలంటే బీజేపీకి కొన్ని విషయంలో మనసు రావాలి. అంటే నిధులు ఇవ్వాలంటే కేంద్రం ఉదారంగా ఉండాలి.అందుకే ముందుగా చిన్న డిమాండ్ నుంచే నరుక్కురావాలని బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారు అంటున్నారు. ఈ రకంగా బీజేపీ వైసీపీ రాయబేరాల్లో ఫస్ట్ బలి అయ్యేది రఘురామకృష్ణంరాజు మాత్రమేనని అంటున్నారు. దాంతో రాజు గారు ఇపుడు ఒక్కసారిగా సౌండ్ పెంచేశారు. ఆయన నేరుగా జగన్ నే టార్గెట్ చేస్తున్నారు. నిండా మునిగాక చలి ఎందుకు అన్న ధోరణిలో రాజు గారి ఆవేశం కనిపిస్తోంది. మొత్తానికి తొందరలోనే రఘురామకృష్ణంరాజు మీద అనర్హత వేటు పడి ఢిల్లీని వదిలి వచ్చేస్తారా అన్న చర్చ అయితే వైసీపీలో సాగుతోందిట.