రాహుల్ రావాల్సిందేనా?
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ మళ్లీ రాబోతున్నారు. పార్టీ సీనియర్లు సయితం దీనిని ధృవీకరిస్తున్నారు. గత లోక్ సభ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ పార్టీ [more]
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ మళ్లీ రాబోతున్నారు. పార్టీ సీనియర్లు సయితం దీనిని ధృవీకరిస్తున్నారు. గత లోక్ సభ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ పార్టీ [more]
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ మళ్లీ రాబోతున్నారు. పార్టీ సీనియర్లు సయితం దీనిని ధృవీకరిస్తున్నారు. గత లోక్ సభ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ తాను పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నానని, సీనియర్లు ఆ పదవి చేపట్టాలని రాహుల్ గాంధీ సూచించి పదవి నుంచి తప్పుకున్నారు. రాహుల్ గాంధీని సీనియర్లు ఎంత బతిమాలినా ఆయన అంగీకరించలేదు.
తాత్కాలికంగానే…..
కొంతకాలం తర్వాత తిరిగి సోనియా గాంధీ తాత్కాలికంగా పార్టీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. సోనియా గాంధీ బాధ్యతలను స్వీకరించిన తర్వాత దేశంలో కాంగ్రెస్ కు కొంత సానుకూల వాతావరణమే కన్పించింది. మహారాష్ట్రలో అధికారంలోకి బీజీపీని రానివ్వకుండా నిలువరించడం లో సోనియా గాంధీ సక్సెస్ అయ్యారు. అక్కడ కూటమిని ఏర్పాటు చేసి బీజేపీకి చెక్ పెట్టారు. హర్యానాలోనూ పార్టీ మంచి విజయమే సాధించింది. జార్ఖండ్ లోనూ బీజేపీని దెబ్బకొట్టింది.
తిరిగి రాహుల్ ను….
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కు కొంత సానుకూల వాతావరణం ఏర్పడిందని భావించిన కాంగ్రెస్ సీనియర్లు తిరిగి రాహుల్ గాంధీని అధ్యక్ష పదవి చేపట్టాలని వత్తిడి తెస్తున్నారు. సోనియా గాంధీ అనారోగ్య కారణాలతో పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాలను చేపట్టలేకపోతుండటం, రాష్ట్రాల పర్యటనలు చేయలేకపోతుండటం పార్టీకి నష్టదాయకమని రాహుల్ గాంధీకి సీనియర్లు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.
పార్టీలో మార్పులు….
దీంతో రాహుల్ గాంధీ తిరిగి అధ్యక్ష్య బాధ్యతలను స్వీకరించిందేకు రెడీ అయ్యారన్న వార్తలు వస్తున్నాయి. తల్లి సోనియా గాంధీకి కొంత ఊరట కల్గించాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నట్లు ఢిల్లీ వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే ఉదయపూర్ లో ఏఐసీసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనే రాహుల్ గాంధీ తిరిగి అధ్యక్ష్య బాధ్యతలను స్వీకరిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాహుల్ గాంధీ తిరిగి ఆ పదవి స్వీకరిస్తే పార్టీలో కొన్ని మార్పులు జరిగే అవకాశముంది. రాహుల్ గాంధీ రాకతో తిరిగి యువనేతలకు పార్టీలో కీలక బాధ్యతలను అప్పగించనున్నారని కూడా ప్రచారం జరుగుతోంది.