రాహుల్ మళ్లీ మెలిక పెడతారా?
కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నిక త్వరలో జరగబోతోంది. ఈసారి ఎన్నిక ద్వారానే కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపిక ను చేయాలని అధిష్టానం నిర్ణయించింది. త్వరలోనే ఈ ఎన్నిక జరగనుందని [more]
కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నిక త్వరలో జరగబోతోంది. ఈసారి ఎన్నిక ద్వారానే కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపిక ను చేయాలని అధిష్టానం నిర్ణయించింది. త్వరలోనే ఈ ఎన్నిక జరగనుందని [more]
కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నిక త్వరలో జరగబోతోంది. ఈసారి ఎన్నిక ద్వారానే కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపిక ను చేయాలని అధిష్టానం నిర్ణయించింది. త్వరలోనే ఈ ఎన్నిక జరగనుందని చెబుతున్నారు. రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టేందుకు అంగీకరించారని మొన్నా మధ్య వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదంటున్నారు. రాహుల్ గాంధీ ఇప్పటికీ పార్టీ అధ్యక్ష పదవి పట్ల విముఖత చూపుతున్నారని తెలుస్తోంది.
సీనియర్ నేతలు మాత్రం…..
ఇటీవల సోనియా గాంధీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది సీనియర్ నేతల్లో కొంతమందితో సోనియా గాంధీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అందరి అభిప్రాయం ఒక్కటే. తిరిగి రాహుల్ గాంధీ అధ్యక్ష పదవిని చేపట్టాలని. రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి చేపట్టకుంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దిగజారిపోతుందని సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికలుండటంతో….
అయితే రాహుల్ గాంధీ ఆలోచన వేరేగా ఉందంటున్నారు. వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలకు వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఎన్నికలు జరుగుతాయి. అంటే ఏప్రిల్, మేనెలల్లో ఈ రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ కేరళ లో తప్పించి ఎక్కడా బలంగా లేదు. కేరళలో కూడా ఈసారి అధికారం దక్కడం కష్టమేనన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.
ఆ ఎన్నికల తర్వాతే…..
ఇక తమిళనాడు, పుదుచ్చేరిలో డీఎంకేతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ వెళుతుంది. అక్కడ గెలిచినా పెద్దగా లెక్కలోకి రాలేదు. అసోం, పశ్చిమ బెంగాల్ లో కాంగ్రెస్ నెగ్గుకు రావడం కష్టమే. తాను ఫిబ్రవరి, మార్చిలో అధ్యక్ష బాధ్యతలు చేపడితే మేలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమికి ఎవరు బాధ్యత వహించాల్సి ఉందన్న ప్రశ్న తలెత్తుతోంది. అందుకే రాహుల్ గాంధీ ఇప్పట్లో పార్టీ అధ్యక్ష పదవి చేపట్టే అవకాశం లేదని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.