రాహుల్ ఆ రాష్ట్రాన్ని వదిలేశారా?
ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ కాంగ్రెస్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. ఐదు రాష్ట్రాల్లో ఎక్కడా సొంతంగా కాంగ్రెస్ గెలుచుకోలేని పరిస్థితి. కాంగ్రెస్ అధినేత రాహుల్ [more]
ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ కాంగ్రెస్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. ఐదు రాష్ట్రాల్లో ఎక్కడా సొంతంగా కాంగ్రెస్ గెలుచుకోలేని పరిస్థితి. కాంగ్రెస్ అధినేత రాహుల్ [more]
ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ కాంగ్రెస్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. ఐదు రాష్ట్రాల్లో ఎక్కడా సొంతంగా కాంగ్రెస్ గెలుచుకోలేని పరిస్థితి. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఎక్కువగా కేరళపైనే దృష్టి పెట్టారు. పార్లమెంటు ఎన్నికల్లోనూ తనను గెలిపించిన కేరళ ప్రజలు తన పార్టీకి ఈసారి అధికారాన్ని కట్టబెడతారన్న ఆశతో రాహుల్ గాంధీ ఉన్నారు. కేరళ సంప్రదాయం ప్రకారం ఈసారి యూడీఎఫ్ అధికారంలోకి రావాలి. అందుకోసమే రాహుల్ గాంధీ ఎక్కువగా కేరళపైనే దృష్టి పెట్టారు.
కేరళపైనే నమ్మకం…..
కేరళలో ఎల్డీఎఫ్ పాలనపై రాహుల్ గాంధీ విరుచుకుపడుతున్నారు. అక్కడి పినరయి విజయన్ ప్రభుత్వం గోల్డ్ స్కాం కేసును పదే పదే రాహుల్ గాంధీ ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ బీజేపీ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో ఇక్కడ సీపీఎం కూటమితోనే రాహుల్ గాంధీ యుద్ధం చేయాల్సి వస్తుంది. చిన్న రాష్ట్రం, అక్షరాస్యులు ఎక్కువగా ఉండటంతో రాహుల్ గాంధీ కేరళ విజయంపై నమ్మకంగా ఉన్నారు.
పశ్చిమ బెంగాల్ లో….
మరోవైపు అదే సమయంలో పశ్చిమ బెంగాల్ లో కాంగ్రెస్ పార్టీ వామపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకుంది. ఇక్కడ సీపీఎం, సీపీఐ, కాంగ్రెస కూటమిగా ఏర్పడింది. ఇక్కడ ఈ కూటమికి విజయావకాశాలు తక్కువే. అందుకే పశ్చిమ బెంగాల్ పై రాహుల్ గాంధీ పూర్తిగా ఆశలు వదిలేసుకున్నారు. ఒకవేళ ప్రచారానికి వెళ్లాల్సి వస్తే అక్కడ లెఫ్ట్ నేతలకు మద్దతుగా రాహుల్ గాంధీ ప్రచారం చేయాల్స ఉంటుంది.
రెండుచోట్ల….
పశ్చిమ బెంగాల్ లో లెఫ్ట్ పార్టీలకు మద్దతు పలుకుతూ, కేరళలో వ్యతిరేకిస్తే తప్పుడు సంకేతాలు వెళతాయని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. అందుకే రాహుల్ గాంధీ తొలి నుంచి పశ్చిమ బెంగాల్ ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. అక్కడి ప్రచార బాధ్యతలను స్థానిక నేతలకే అప్పగించారు. కేరళపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. రెండు చోట్ల ప్రచారం నిర్వహిస్తే కేరళలో సీపీఎం ప్రభుత్వంపై చేసే విమర్శలకు అర్థం లేకుండా పోతుంది. అందుకే పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారానికి ప్రస్తుతం రాహుల్ గాంధీ దూరంగా ఉన్నారంటున్నారు.