సీనియర్లకు సీన్ లేదట… ఇక రాహుల్ జమానా
కాంగ్రెస్ పార్టీలో సీనియర్లను ఖచ్చితంగా పక్కన పెట్టే ప్రక్రియ ప్రారంభమయింది. రాహుల్ గాంధీ కావాలని అన్నారో? అన్యాపదేశంగా అన్నా భవిష్యత్ లో సీనియర్ల విషయంలో ఆ వ్యాఖ్యలు [more]
కాంగ్రెస్ పార్టీలో సీనియర్లను ఖచ్చితంగా పక్కన పెట్టే ప్రక్రియ ప్రారంభమయింది. రాహుల్ గాంధీ కావాలని అన్నారో? అన్యాపదేశంగా అన్నా భవిష్యత్ లో సీనియర్ల విషయంలో ఆ వ్యాఖ్యలు [more]
కాంగ్రెస్ పార్టీలో సీనియర్లను ఖచ్చితంగా పక్కన పెట్టే ప్రక్రియ ప్రారంభమయింది. రాహుల్ గాంధీ కావాలని అన్నారో? అన్యాపదేశంగా అన్నా భవిష్యత్ లో సీనియర్ల విషయంలో ఆ వ్యాఖ్యలు నిజమవుతాయని చెప్పక తప్పదు. సీడబ్ల్యూసీ సమావేశం తర్వాత గులాంనబీ ఆజాద్ ఇంట్లో సమావేశమవ్వడాన్ని కూడా పార్టీ హైకమాండ్ సీరియస్ గా తీసుకున్నట్లు తెలిసిింది. దీంతో రానున్న ఆరు నెలల కాలంలో సీనియర్లను తప్పించేస్తారన్న టాక్ పార్టీలో వినపడుతుంది.
సీనియర్లను పక్కన పెట్టి…..
సీనియర్లను పక్కన పెడితేనే రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశముంది. ఆరు నెలల్లో పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని సోనియాగాంధీ నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగుతారు. ఏఐసీసీ ప్లీనరీలో రాహుల్ గాంధీని తిరిగి పార్టీ అధ్యక్షుడిగా నియమించే అవకాశాలున్నాయి. ఇందుకు రాహుల్ గాంధీ పెట్టిన షరతులు ఓకే చేస్తేనే పదవి చేపడతారంటున్నారు.
పార్టీ ఇన్ ఛార్జులను సయితం….
సీనియర్ నేతలు పార్టీకి గుదిబండగా మారారన్నది రాహుల్ గాంధీ నిశ్చితాభిప్రాయం. రాష్ట్ర పరిశీలకులుగా వెళ్లడం, రాజ్యసభ పదవులు పొందడం మినహా పార్టీకి నిబద్దతగా పనిచేసే వారు సీనియర్లలో అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారన్నది రాహుల్ గాంధీ అంచనా. వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఇన్ ఛార్జులను సయితం మార్చాలన్నది రాహుల్ గాంధీ ఆలోచనగా ఉంది. ఇన్ ఛార్జులు పార్టీ పటిష్టతను పట్టించుకోకుండా అక్కడ నేతలను బట్టి నడుచుకోవడాన్నిక కూడా రాహుల్ గాంధీ తప్పుపడుతున్నారు.
ఆరు నెలల తర్వాత….?
రాజస్థాన్ లో పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి అవినాష్ పాండేను నియమిస్తే ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ తో కలసి సచిన్ పైలట్ కు ఇబ్బందికరమైన పరిస్థితులు తెచ్చారన్నది రాహుల్ గాంధీ అభిప్రాయం. పద్దెనిమిది నెలలు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి మాట్లాడుకోకపోయినా హైకమాండ్ దృష్టికి తీసుకురాలేదు. ఇదే పరిస్థిితిని అనేక రాష్ట్రాల్లో ఇన్ ఛార్జులు సృష్టిస్తున్నారు. అందుకే పార్టీలో సమూల మార్పులు, ప్రక్షాళన జరిగిన తర్వాతనే రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టే అవకాశముంది. అందుకోసం మరో ఆరు నెలలు ఆగాల్సి ఉంటుంది. యువనేతలకు కాంగ్రెస్ లో పెద్దపీట వేయనున్నారు.