ఇంటిని చక్కదిద్దిన తర్వాతనేనా?
కాంగ్రెస్ కు గాంధీ కుటుంబం నేతృత్వం వహించకపోతే ఆ పార్టీ లేనట్లే. ఇది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. కానీ ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షురాలిగానే సోనియా గాంధీ కొనసాగుతున్నారు. [more]
కాంగ్రెస్ కు గాంధీ కుటుంబం నేతృత్వం వహించకపోతే ఆ పార్టీ లేనట్లే. ఇది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. కానీ ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షురాలిగానే సోనియా గాంధీ కొనసాగుతున్నారు. [more]
కాంగ్రెస్ కు గాంధీ కుటుంబం నేతృత్వం వహించకపోతే ఆ పార్టీ లేనట్లే. ఇది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. కానీ ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షురాలిగానే సోనియా గాంధీ కొనసాగుతున్నారు. సోనియా అనారోగ్యంగా ఉండటంతో పార్టీ కార్యక్రమాల్లో అసలు పాల్గొనలేకపోతున్నారు. దీంతో సీనియర్ నేతలు శాశ్వత అధ్యక్షులు కావాలని, పార్టీని ప్రక్షాళన చేయాలని లేఖ రూపంలో సోనియాకు తెలియజేశారు. వారి మనసులో రాహుల్ ను నియమించాలనే ఉండి ఉండవచ్చు. కానీ అధిష్టానం మాత్రం థిక్కార స్వరంగా భావించింది.
ఎవరిని పెట్టినా……
రాహుల్ గాంధీకి ఎటూ అధ్యక్ష పదవి తీసుకోక తప్పదు. అది ఆయనకూ తెలుసు. కొత్త అధ్యక్షుడిని ఎవరిని పెట్టినా దేశ వ్యాప్తంగా క్యాడర్ నిరాశ పడిపోతుంది. ఇప్పటికీ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కు క్షేత్రస్థాయిలో క్యాడర్ ఉంది. అయితే గాంధీ కుటుంబాన్ని మాత్రమే వారు అంగీకరిస్తారు. కానీ రాహుల్ గాంధీ గత కొంతకాలంగా తాను అధ్యక్ష్య పదవి చేపట్టబోనని భీష్మించుకు కూర్చున్నారు. ఇటీవల జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో తప్పనిసరి పరిస్థితుల్లో కొంతకాలం సోనియాగాంధీనే కొనసాగాలని నిర్ణయించారు.
వారందరినీ పక్కన పెట్టి…..
రాహుల్ గాంధీ సీనియర్లను, అధిష్టానాన్ని తప్పు దోవ పట్టిస్తూ తమ పబ్బం గడుపుకునే వారిని పక్కకు తప్పించాలన్న ఉద్దేశ్యంలోనే ఉన్నారు. రాహుల్ గాంధీకి సీనియర్లు రాసిన లేఖ అనుకూలంగా మార్చుకోవడానికి వీలు చిక్కింది. నమ్మకమైన నేతలతో తాను అధ్యక్ష పదవిని చేపట్టడానికి రాహుల్ గాంధీ మార్గం సుగమం చేసుకున్నాడంటున్నారు. సీనియర్లను పూర్తిగా పక్కకు తప్పించిన తర్వాతనే తాను పార్టీ పగ్గాలు చేపట్టాలని భావించినట్లుంది.
నోళ్లను కట్టడి చేసేందుకే….
అందుకే ఇటీవల పార్టీలో అనేక మార్పులు చేశారు. లేఖ రాసిన గులాంనబీ ఆజాద్ లాంటి వాళ్లను పక్కన పెట్టారు. ఈ చర్యలతో సీనియర్లకు నోరు ఎత్తితే ఇలానే ఉంటుందన్న హెచ్చరికలను పంపారు. తమకు అత్యంత నమ్మకస్తులైన మల్లికార్జున ఖర్గే, అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్, ముకుల్ వాస్నిక్, రణదీప్ సుర్జేవాలా వంటి నేతలకు అగ్రతాంబూలం ఇచ్చారు. దీంతో శశిధరూర్ వంటి నోరున్న నేతలను కట్టడి చేసినట్లే. వచ్చే ఏఐసీసీ సమావేశాల్లో రాహుల్ గాంధీ పట్టాభిషేకం జరుగుతుందని పార్టీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. మొత్తం మీద రాహుల్ గాంధీ ముందు తన ఇంటిని చక్కదిద్దే పనిలో పడ్డారని ఇట్టే అర్ధమవుతోంది.