పనికిరాడనే ఢీ కొడుతున్నారా?
దశాబ్దాలుగా కిక్కురుమనకుండా ఉన్న సీనియర్ నేతలు ఇప్పడు ఎందుకు బ్లాస్ట్ అయ్యారు? దశాబ్దాలపాటు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధాన్ని మర్చిపోయి ఎందుకు పార్టీని భ్రష్టు పట్టించడానికి రెడీ [more]
దశాబ్దాలుగా కిక్కురుమనకుండా ఉన్న సీనియర్ నేతలు ఇప్పడు ఎందుకు బ్లాస్ట్ అయ్యారు? దశాబ్దాలపాటు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధాన్ని మర్చిపోయి ఎందుకు పార్టీని భ్రష్టు పట్టించడానికి రెడీ [more]
దశాబ్దాలుగా కిక్కురుమనకుండా ఉన్న సీనియర్ నేతలు ఇప్పడు ఎందుకు బ్లాస్ట్ అయ్యారు? దశాబ్దాలపాటు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధాన్ని మర్చిపోయి ఎందుకు పార్టీని భ్రష్టు పట్టించడానికి రెడీ అయ్యారు? ఇవే ప్రశ్నలు ప్రతి కాంగ్రెస్ అభిమాని నుంచి వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని అంటారు. కానీ అది రాష్ట్ర స్థాయిలోనే ఉంటుంది. గాంధీ కుటుంబం విషయానికి వచ్చే సరికి అందరిదీ ఒకటేమాట. వారు లేకుంటే పార్టీ లేనేలేదని. వందల ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ కు ఎక్కువ కాలం గాంధీ కుటుంబీకులే నేతృత్వం వహించారు.
అధ్యక్ష పదవి చేపడతానంటే…?
ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా అధ్యక్ష పదవిని చేపడతామంటే కాదనే వారే లేరు. అయితే గత ఏడాదిన్నరగా పార్టీలో జరుగుతున్న పరిణామాలే సీనియర్ నేతలకు చికాకు తెప్పించా యంటున్నారు. రాహుల్ గాంధీ లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దాని తర్వాత సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉంటూ వస్తున్నారు. సోనియా గాంధీ అనారోగ్య కారణాలతో యాక్టివ్ గా లేరు. దీంతో ముఖ్యమైన విషయాలను సంప్రదించేందుకు సీనియర్లకు సోనియాను కలిసే అవకాశం లేకుండా పోయింది.
అన్ని వ్యవహారాలు తానే….
అయితే రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినా పార్టీ వ్యవహరాలను చూసుకుంటున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలో అనిశ్చితి ఏర్పడినప్పుడు కూడా రాహుల్ యాక్టివ్ గానే ఉన్నారు. అయితే అధ్యక్ష్య పదవికి రాజీనామా చేసిన తర్వాత కూడా సీనియర్ నేతలను పట్టించుకోవడం లేదు. వారి సూచనలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. అనేక రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జులుగా తనకు నమ్మకమైన వారినే రాహుల్ నియమించుకున్నారు. ఇది సీనియర్లకు మింగుడుపడటం లేదు.
మోదీకి ధీటైన నేత కాదని…..
రానున్న కాలంలో తమ పరిస్థితి మరింత దిగజారుతుందని భావించిన సీనియర్ నేతలు రాహుల్ ను కట్టడి చేయడానికే లేఖ రాశారు. అందుకే కొత్త అధ్యక్షుడిని నియామకం గురించి లేఖలో ప్రస్తావించారు. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి మోదీకి ధీటైన అభ్యర్థిగా ప్రజల్లో లేరన్నది సీనియర్ల అభిప్రాయం. సోనియా తర్వాత రాహుల్ పార్టీని నడపలేరన్నది సీనియర్ల అసహనం. అందుకే వారు రాహుల్ గాంధీని టార్గెట్ గా ఎంచుకున్నారు. రానున్న రోజుల్లో సీనియర్ నేతలు మరింత వ్యతిరేక వ్యాఖ్యలు చేసే అవకాశముంది. మరి యువనేత రాహుల్ వారిని ఎలా డీల్ చేస్తారన్నది చూడాల్సి ఉంది.