రైళ్లు రెడీ.. కానీ ఇలా ప్రయాణం చేయాలట
లాక్ డౌన్ పూర్తి అయ్యాక రైల్వే ప్రయాణాలు అన్ని నాన్ ఏసీ లోనే సాగే అవకాశం ఉన్నట్లు ఆ సంస్థ నుంచి అందుతున్న సమాచారం. ఏసీ లో [more]
లాక్ డౌన్ పూర్తి అయ్యాక రైల్వే ప్రయాణాలు అన్ని నాన్ ఏసీ లోనే సాగే అవకాశం ఉన్నట్లు ఆ సంస్థ నుంచి అందుతున్న సమాచారం. ఏసీ లో [more]
లాక్ డౌన్ పూర్తి అయ్యాక రైల్వే ప్రయాణాలు అన్ని నాన్ ఏసీ లోనే సాగే అవకాశం ఉన్నట్లు ఆ సంస్థ నుంచి అందుతున్న సమాచారం. ఏసీ లో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంటుందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో వచ్చే కాలంలో అన్ని స్లీపర్ కోచ్ లతోనే రైల్వే ఏర్పాటు చేయనుంది. దాంతో జూన్ నుంచి ప్రయాణాలు మొదలు అవుతాయని భావిస్తున్న పరిస్థితుల్లో రైల్వే శాఖ ఇప్పటినుంచి కార్యాచరణ మొదలు పెట్టినట్లు చెబుతున్నారు.
వలస కూలీల తరలింపులో…
ఇప్పటికే వలస కూలీల తరలింపు లో ప్రాక్టికల్స్ మొదలు పెట్టింది రైల్వే. స్లీపర్ కోచ్ లలో మిడిల్ బెర్త్ లు ఎత్తివేసి 72 ఉండే బెర్త్ లను 52 కు పరిమితం చేయనున్నారు. సామాజిక దూరం పాటించేలా, శానిటైజర్లు ఏర్పాటు మాస్క్ లు ధరింపు తప్పనిసరి చేసేలా చర్యలు చేపట్టాలని కార్యాచరణ సిద్ధం అవుతుంది.
రోడ్డు రవాణా లోను అంతే …
వివిధ రాష్ట్రాల రోడ్డు రవాణా విధానాలు పూర్తిగా మారనున్నాయి. బస్సుల్లో ఉండే సిట్టింగ్ కెపాసిటి ని 33 నుంచి 50 శాతం తగ్గించనున్నారు. దీనివల్ల జరిగే నష్టాన్ని టికెట్ల ధరలు పెంచడం ద్వారా భర్తీ చేయాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఏసీ బస్సుల కు మరికొంతకాలం బ్రేక్ లు పడనుంది. ఎప్పటికప్పుడు బస్సులను శానిటైజ్ చేస్తూ ప్రయాణికుల నడుమ భౌతిక దూరం ఉండటం, మాస్క్ లు ధరించడం, చేతులు పరిశుభ్రం చేయించడం వంటివి పూర్తి చేసిన తరువాతే బస్సులోకి అనుమతి ఇవ్వాలని భావిస్తున్నారు. ఇప్పటివరకు ఏసీ ప్రయాణాలకు అలవాటు పడిన ప్రయాణికులు ఇకపై కొన్నాళ్ళు అవి మర్చిపోకతప్పదు.