దశ తిరగాలనేనా?
రాజ్ థాక్రే కు రాజకీయ గురువు బాల్ థాక్రే. అయితే ఆయన మరణం తర్వాత శివసేన నుంచి రాజ్ థాక్రే దూరమయ్యారు. సొంత పార్టీ పెట్టుకున్నారు. మహారాష్ట్ర [more]
రాజ్ థాక్రే కు రాజకీయ గురువు బాల్ థాక్రే. అయితే ఆయన మరణం తర్వాత శివసేన నుంచి రాజ్ థాక్రే దూరమయ్యారు. సొంత పార్టీ పెట్టుకున్నారు. మహారాష్ట్ర [more]
రాజ్ థాక్రే కు రాజకీయ గురువు బాల్ థాక్రే. అయితే ఆయన మరణం తర్వాత శివసేన నుంచి రాజ్ థాక్రే దూరమయ్యారు. సొంత పార్టీ పెట్టుకున్నారు. మహారాష్ట్ర నవ నిర్మాణ సేన ను స్థాపించారు. సొంత పార్టీ పెట్టుకున్నప్పటికీ రాజ్ థాక్రే ఇప్పటికీ బాల్ థాక్రేను స్మరించుకోవడం రాజ్ థాక్రే మానుకోరు. ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ఏర్పాటు చేసి నివాళులర్పిస్తుంటారు. బాల్ థాక్రే తర్వాత శివసేన వారసత్వాన్ని అందుకోవాలన్న రాజ్ థాక్రేను పొమ్మనలేకుండానే పొగబెట్టారంటారు.
రెండూ కలసి…..
అయితే తాజాగా రాజ్ థాక్రే శివసేనను దెబ్బతీయాలని ఫడ్నవిస్ తో కలసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ ఒంటరిగా పోటీ చేస్తూూ వచ్చిన రాజ్ థాక్రే వచ్చే ఏ ఎన్నికల్లోనైనా బీజేపీతో జత కట్టేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ కూడా తమను దారుణంగా మోసం చేసిన శివసేనను దెబ్బతీయాలంటే ఎంఎన్ఎస్ ను దగ్గరకు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇద్దరు నేతల మధ్య పరస్పర అవగాహన కుదిరిందంటున్నారు.
వారసుడి ప్రకటన….
ఇదిలా ఉండగా రాజ్ థాక్రే తన రాజకీయ వారసుడిని కూడా రెడీ చేస్తున్నారు. రాజ్ థాక్రే కుమారుడు అమిత్ థాక్రే రాజకీయ అరంగేట్రం త్వరలోనే జరుగుతుంది. తన సోదరుడైన ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత మంత్రి కూడా అయ్యారు. దీంతో తన రాజకీయ వారసుడిని కూడా పరిచయం చేయాలని రాజ్ థాక్రే నిర్ణయించుకున్నారని చెబుతున్నారు.
జెండాను కూడా…..
శివసేన అధినేత బాల్ థాక్రే జయంతి ఈ నెల 23వ తేదీన జరగనుంది. ఆరోజు ముంబయిలో మహారాష్ట్ర నవనిర్మాణ సేన మొదటి మహా సమ్మేళనం జరుగుతుంది. ఈ సమావేశంలోనే రాజ్ థాక్రే తన కుమారుడు అమిత్ థాక్రేను పరిచయం చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు తనకు పెద్దగా కలసి రాని పార్టీ జెండాను కూడా రాజ్ థాక్రే మార్చాలని భావిస్తున్నారు. దీనిపై కూడా అదే రోజు నిర్ణయం తీసుకునే అవకాశముంది. వారసుడి ప్రకటన, జెండా మార్పుతోనైనా రాజ్ థాక్రే దశ తిరుగుతుందో లేదో? చూడాల్సి ఉంది.