రాజ్ థాక్రే కు కలసి వచ్చే రోజులేనా?
మహారాష్ట్రలో ఉవ్వెత్తున ఎగిసి పడిన రాజకీయ కెరటంగా రాజ్ థాక్రేను చెప్పుకోవాలి. ఆయనకు కాలం కలసి రావడంలేదు. ఆయన పార్టీకి బలం ఉంది. బలగం ఉంది. ఏ [more]
మహారాష్ట్రలో ఉవ్వెత్తున ఎగిసి పడిన రాజకీయ కెరటంగా రాజ్ థాక్రేను చెప్పుకోవాలి. ఆయనకు కాలం కలసి రావడంలేదు. ఆయన పార్టీకి బలం ఉంది. బలగం ఉంది. ఏ [more]
మహారాష్ట్రలో ఉవ్వెత్తున ఎగిసి పడిన రాజకీయ కెరటంగా రాజ్ థాక్రేను చెప్పుకోవాలి. ఆయనకు కాలం కలసి రావడంలేదు. ఆయన పార్టీకి బలం ఉంది. బలగం ఉంది. ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా వేల సంఖ్యలో కార్యకర్తలు హాజరవుతారు. ఆయన సమావేశాలు కూడా జనంతో కిక్కిరిసిపోతాయి. రాజ్ థాక్రే విసిరే ఒక్కొక్క పంచ్ డైలాగ్ కు చప్పట్ల మోత మామూలుగా ఉండదు. అయితే ఎన్నికల్లో మాత్రం రాజ్ థాక్రే పార్టీకి మాత్రం ఓట్లు వచ్చింది లేదు.
సేన నుంచి విడిపోయి…..
శివసేన నుంచి విడిపోయి రాజ్ థాక్రే మహారాష్ట్ర నవనిర్మాణ సేన పార్టీని స్థాపించారు. శివసేన పగ్గాలు తనకు అప్పగించకపోవడంపై కలత చెందిన రాజ్ థాక్రే సొంత కుంపటి పెట్టుకున్నారు. అలాగే 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 13 స్థానాలను గెలుచుకుని తన పార్టీ సత్తా ఏంటో చూపారు. అయితే ఆ తర్వాత నుంచి రాజ్ థాక్రే పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.
ఒక్కటిగానే బరిలోకి దిగి…..
బీజేపీ, శివసేన కూటమిగా ఉండటంతో మొన్నటి వరకూ ఎంఎన్ఎస్ విడిగానే పోటీ చేస్తూ వచ్చింది. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో రాజ్ థాక్రే పార్టీ కేవలం ఒకే ఒకస్థానాన్ని గెలుచుకుంది. రాజు పాటిల్ ఒక్కరే మహారాష్ట్ర నవ నిర్మాణ సేన నుంచి గెలిచారు. ఇప్పుడు ముంబయి కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ, శివసేన విడిపోయి ఉన్నాయి. శివసేనను దెబ్బకొట్టడమే రాజ్ థాక్రే లక్ష్యం. అందుకు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి రాజ్ థాక్రే రెడీ అవుతున్నారు.
ఈ ఎన్నికల్లో కూటమితో….
ముంబయి కార్పొరేషన్ ఎన్నికలను శివసేన సీరియస్ గా తీసుకుంది. ముంబయిలో తమ పట్టు జారి పోకుండా ఉండాలంటే ఖచ్చితంగా గెలవాలని శివసేన ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తుంది. ఈ ఎన్నికల్లోనూ ఎన్సీపీ, కాంగ్రెస్ తో కలసి శివసేన బరిలోకి దిగనుంది. దీంతో బీజేపీ సయితం రాజ్ థాక్రే పార్టీని కలుపుకోవాలని ప్రయత్నిస్తుంది. త్వరలో జరగనున్న ఈ ఎన్నికలు ఈ రెండు పార్టీలను కలపనున్నాయని తెలుస్తోంది. ఈ కలయికతోనైనా రాజ్ థాక్రే పార్టీకి మంచిరోజులు వస్తాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?