తలైవా ఇంటికి క్యూ కడుతున్నారుగా?
రజనీకాంత్ తమిళనాడులో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన వెంటనే రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయేటట్లు కన్పిస్తున్నాయి. వివిధ కూటమిలోని పార్టీలు రజనీకాంత్ పార్టీ వైపు చూస్తున్నాయి. ఇప్పటి [more]
రజనీకాంత్ తమిళనాడులో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన వెంటనే రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయేటట్లు కన్పిస్తున్నాయి. వివిధ కూటమిలోని పార్టీలు రజనీకాంత్ పార్టీ వైపు చూస్తున్నాయి. ఇప్పటి [more]
రజనీకాంత్ తమిళనాడులో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన వెంటనే రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయేటట్లు కన్పిస్తున్నాయి. వివిధ కూటమిలోని పార్టీలు రజనీకాంత్ పార్టీ వైపు చూస్తున్నాయి. ఇప్పటి వరకూ రజనీకాంత్ పార్టీ ప్రకటన కోసమే వెయిట్ చేసిన అనేక చిన్న పార్టీలూ రజనీ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నాయి. చివరకు అన్నాడీఎంకే సయితం రజనీకాంత్ తో పొత్తుకు సిద్ధమని ప్రకటించడం విశేషం.
రజనీ వెంట నడిచేందుకు…..
ఎవరు ఏమనుకున్నా రజనీకాంత్ కు తమిళనాడులో విపరీతమైన క్రేజ్ ఉంది. లక్షల సంఖ్యలో అభిమానులున్నారు. ఎంజీఆర్, జయలలిత తర్వాత అంతటి అభిమానాన్ని సంపాదించుకున్న రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. రజనీకాంత్ కంటే ముందుగా కమల్ హాసన్ వచ్చి మక్కల్ నీది మయ్యమ్ పార్టీని పెట్టినా అది సక్సెస్ కాలేదు. దీంతో రజనీకాంత్ పార్టీపై చిన్న పార్టీలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి.
ముందున్న పీఎంకే…..
విశేషమేంటంటే తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సయితం రజనీకాంత్ తో తాము పొత్తుకు సిద్ధమని ప్రకటించడం. దీంతో పాటు అన్నాడీఎంకే కూటమిలో ఉన్న పీఎంకే ఎప్పటి నుంచో రజనీకాంత్ పార్టీ కోసం వెయిట్ చేస్తుంది. ఇప్పటికే పీఎంకే రిజర్వేషన్ల ఉద్యమాలతో ప్రజల్లోకి వెళుతుంది. వన్నియార్ల లో పట్టున్న పీఎంకే ఈసారి అన్నాడీఎంకే కూటమిని వీడి రజనీకాంత్ తో వెళ్లేందుకు సిద్దమయింది. రజనీకాంత్ పార్టీని ప్రకటించిన వెంటనే చర్చలు ప్రారంభించాలన్న యోచనలో పీఎంకే ఉంది.
కమల్ సయితం…..
ఇక కమల్ హాసన్ సయితం ఎప్పుడో రజనీకాంత్ పార్టీతో కలసి నడిచేందుకు సిద్ధమని ప్రకటించారు. డీఎంకే, అన్నాడీఎంకే కూటములకు వ్యతిరేకంగా మూడో కూటమిని ఏర్పాటు చేయాలన్న ఉద్దేశ్యంతో కమల్ హాసన్ ఉన్నారు. ఇప్పుడు రజనీకాంత్ పార్టీ వస్తుండటంతో మూడో కూటమి సాధ్యమవుతుందని కమల్ హాసన్ భావిస్తున్నారు. అందరినీ కలుపుకుని కూటమిగా ఏర్పడితే డీఎంకే, అన్నాడీఎంకేలను ధీటుగా రజనీకాంత్ కూటమి ఎదుర్కొంటుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. మరి రజనీకాంత్ ఆలోచన ఎలా ఉందో చూడాలి.