రజనీ రెడీ అయిపోయారుగా
రజనీకాంత్ పార్టీ పనుల్లో వేగం పెంచారు. పార్టీ ని రిజిస్టర్ చేయడం దగ్గర నుంచి గుర్తులపై కూడా ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. రజనీకాంత్ ఈ నెల [more]
రజనీకాంత్ పార్టీ పనుల్లో వేగం పెంచారు. పార్టీ ని రిజిస్టర్ చేయడం దగ్గర నుంచి గుర్తులపై కూడా ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. రజనీకాంత్ ఈ నెల [more]
రజనీకాంత్ పార్టీ పనుల్లో వేగం పెంచారు. పార్టీ ని రిజిస్టర్ చేయడం దగ్గర నుంచి గుర్తులపై కూడా ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. రజనీకాంత్ ఈ నెల 31వ తేదీన పార్టీని ప్రకటిస్తున్న నేపథ్యంలో ముందుగానే అన్ని సిద్ధం చేయాలని నిర్ణయించారు. పార్టీని ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్టర్ చేయించే ఏర్పాట్లలో ఉన్నారు. ఇందుకు బాధ్యతలను తన సన్నిహితులకు రజనీకాంత్ అప్పగించినట్లు తెలుస్తోంది. పార్టీ గుర్తును కూడా త్వరలోనే ఖరారు చేయనున్నారు.
పార్టీ పేరును ప్రకటిస్తారా?
డిసెంబరు 31వ తేదీన రజనీకాంత్ పార్టీని ప్రకటించనున్నారు. అభిమానుల సమక్షంలోనే ఆయన పార్టీ పేరును, గుర్తును ప్రకటించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇందుకు పండితుల సలహాలు కూడా రజనీకాంత్ తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. డిసెంబరు 31వ తేదీన ఆయన పుట్టిన రోజున కేవలం పార్టీ పెడుతున్నట్లు ప్రకటిస్తారా? లేక పేరును కూడా ప్రజలకు పరిచయం చేస్తారా? అన్న దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
బహిరంగ సభలోనేనా?
మరోవైపు అదే రోజు బహిరంగ సభను ఏర్పాటు చేయాలని కూడా రజనీకాంత్ భావిస్తున్నారు. అభిమానుల సమక్షంలోనే పార్టీని ప్రకటించాలని ఆయన భావిస్తుండటంతో కోవిడ్ సమయంలో ఇది మంచిదా? కాదా? అన్న దానిపై కూడా చర్చలు జరుపుతున్నారు. ప్రభుత్వం కూడా బహిరంగ సభకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వం అనుమతిస్తే మధురై లేదా తిరుచ్చిలో ఒక చోట బహిరంగసభను నిర్వహించి పార్టీని ప్రకటించాలని రజనీకాంత్ భావిస్తున్నారు.
ప్రజల్లోకి వెళ్లేందుకు….
రజనీకాంత్ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించడంతో రజనీ మక్కల్ మండ్ర నేతలు జిల్లాల వ్యాప్తంగా అప్పుడే ప్రచారాన్ని ప్రారంభించారు. రజనీ ఫొటోతో వాల్ పోస్టర్లు తమిళనాడు అంతటా దర్శనమిస్తున్నాయి. రజనీకాంత్ కూడా జనవరి నాటికి సినిమా షూటింగ్ లన్నీ పూర్తి చేసుకుని ప్రజల్లోకి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ మేరకు రూట్ మ్యాప్ తయారు చేయాలని కూడా రజనీకాంత్ నేతలను కోరినట్లు తెలిసింది. మొత్తం మీద రజనీకాంత్ పార్టీ ప్రకటనకు ముందే అన్ని ఏర్పాట్లు చేసుకుని ఎన్నికల గోదాలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు.