యుద్ధానికి సిద్ధం అయిపోయారా ?
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ తెరంగేట్రానికి సిద్ధం అయిపోయారా? అవుననే అంటున్నారు ఆయన సన్నిహిత వర్గాలు. రజనీకాంత్ పార్టీ అదిగో ఇదిగో అంటూ చాలా కాలంగా [more]
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ తెరంగేట్రానికి సిద్ధం అయిపోయారా? అవుననే అంటున్నారు ఆయన సన్నిహిత వర్గాలు. రజనీకాంత్ పార్టీ అదిగో ఇదిగో అంటూ చాలా కాలంగా [more]
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ తెరంగేట్రానికి సిద్ధం అయిపోయారా? అవుననే అంటున్నారు ఆయన సన్నిహిత వర్గాలు. రజనీకాంత్ పార్టీ అదిగో ఇదిగో అంటూ చాలా కాలంగా ఊరిస్తూ వస్తున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో సైతం రజనీకాంత్ తమిళనాట బరిలోకి దిగిపోతారని అంతా ఊహించారు. అందుకు తగ్గెట్టే సంకేతాలను పంపారు ఆయన. తలైవా చేసిన హడావిడి చూసి మక్కల్ నీది మయ్యం అంటూ కమలహాసన్ సీన్ లోకి వచ్చేశారు కానీ రజనీకాంత్ తన పొలిటికల్ ఎంట్రీకి తాత్కాలిక బ్రేక్ వేసేశారు.
జోరుగా సినిమాలు …
తమిళ సూపర్ స్టార్ రాజకీయాల్లోకి వచ్చేస్తారన్న ప్రచారం ఎంత వేగంగా సాగిందో అంతే స్పీడ్ గా ఆయన కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అందరికి షాక్ ఇచ్చారు. శంకర్ రోబో 2 తో బ్రేక్ వేస్తారని అనుకున్న రజనీకాంత్ అక్కడితో ఆగలేదు. కబాలి, పేట అంటూ న్యూ పిక్చర్స్ రిలీజ్ చేసేసారు. అవి బోల్తా పడినా మరో కొత్త చిత్రంతో దూసుకువచ్చేస్తున్నారు. మురుగదాస్ డైరెక్షన్ లో రజనీకాంత్ చిత్రం వేగాంగా షూటింగ్ సాగిస్తుంది. ఈ దశలో మరోసారి ఆయన రాజకీయ ప్రస్థానం తెరపైకి వచ్చింది.
డీఎంకే దూకుడు కు చెక్ పెట్టేందుకేనా …?
ప్రస్తుతం తమిళనాడు సర్కార్ మోడీ అండర్ లో నడుస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ప్రభంజనం ఖాయమన్న సంకేతాలు ఇటీవల ముగిసిన పార్లమెంట్ ఎన్నికలు స్పష్టం చేసేశాయి. ఈ నేపథ్యంలో ఊరిస్తూ, వాయిదాలు వేస్తూ వస్తున్న రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ కమలనాథులకు తక్షణ అవసరం. దక్షిణాదిలోని తమిళనాడులో నేరుగా పాగా వేసే ఛాన్స్ లేని కమలదళం ఆధ్యాత్మిక, హిందూ భావజాలం మెండుగా ఉండటంతో పాటు లక్షలాది అభిమాన గణం సొంతమైన రజనీకాంత్ ని రాజకీయాల్లో దింపడం ద్వారా డిఎంకె ప్రభంజనానికి చెక్ పెట్టాలని చూస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏఐడిఎంకె పై జనంలో అసంతృప్తి సెగలు స్పష్టమైన నేపథ్యంలో రజనీకాంత్ ఎంట్రీ తప్పనిసరన్నది కాషాయ వ్యూహం గా కనిపిస్తుంది. దాని ప్రకారం అన్ని అనుకూలిస్తే వచ్చే ఏడాది జనవరి ఆరంభంలో రజనీకాంత్ కొత్త పార్టీ తమిళనాడులో ఆవిర్భవించడం ఖాయమంటున్నారు రాజకీయ పండితులు.