గెహ్లాత్ కు నిజంగా ఇది పరీక్ష
రాజస్థాన్ రాష్ట్రం కరోనా వైరస్ అతలా కుతలమవుతోంది. ఇక్కడ ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1400కు దాటింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ పకడ్బందీ చర్యలు [more]
రాజస్థాన్ రాష్ట్రం కరోనా వైరస్ అతలా కుతలమవుతోంది. ఇక్కడ ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1400కు దాటింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ పకడ్బందీ చర్యలు [more]
రాజస్థాన్ రాష్ట్రం కరోనా వైరస్ అతలా కుతలమవుతోంది. ఇక్కడ ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1400కు దాటింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా ఫలితం కన్పించడం లేదు. రాజస్థాన్ లోని జైపూర్, జోథ్ పర్, కోటా, దౌసా, నాగౌర్, టోంక్ ప్రాంతాల్లో ఈ వ్యాధి ప్రబలుతున్నట్లు గుర్తించారు. రాజస్థాన్ రాష్ట్రం దేశంలోనే అతి పెద్ద వైశాల్యం గల రాష్ట్రం. ఈశాన్య సరిహద్దులో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఉంది. దీంతో అక్కడి నుంచే ఎక్కువగా కరోనా వ్యాప్తి చెందినట్లు ప్రభుత్వం భావిస్తోంది.
లాక్ డౌన్ ను పకడ్బందీగా….
లాక్ డౌన్ ను రాజస్థాన్ రాష్ట్రంలో పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. కంటెయిన్ మెంట్ ప్రాంతాలను కూడా గుర్తించి అక్కడ పటిష్టమైన చర్యలు చేపట్టారు. అయినా రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రాజస్థాన్ లో ఇప్పటికీ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కొనసాగుతుంది. ఒక్కో ఇంట్లో పదికి మించి వ్యక్తులు నివసిస్తుంటారు. ఈ సంఖ్య ఒక కుటుంబంలో అతి స్వల్పం. ఇంకా ఎక్కువ మంది ఒక కుటుంబంలో నివసిస్తారు. ఇది ఇక్కడి సంప్రదాయం. ఇదే ఇప్పుడు ఆందోళన కల్గిస్తుంది.
యువకులకే ఎక్కువా…..
మరో విషయమేంటంంటే దేశంలో ఎక్కడా లేని విధంగా రాజస్థాన్ లో యువకులే ఎక్కువగా కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. కరోనా సోకిన రోగుల్లో ఎక్కువ మంది యువకులు ఉండటం ఆందోళన కల్గిస్తుంది. కరోనా పాజిటివ్ కేసుల్లో దాదాపు 65 శాతం మంది యువకులే ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. ఈ వ్యాధి సోకిన వారిలో 60 ఏళ్లకు పైబడిన వారు కేవలం 10 శాతం మంది మాత్రమే ఉండటం గమనార్హం.
లాక్ డౌన్ ను మరికొంత కాలం….
దీంతో రాజస్థాన్ ప్రభుత్వం అప్రమత్తమయింది. యువకులను రోడ్లపైకి రాకుండా పకడ్బందీ చర్యలు ప్రారంభించింది. లాక్ డౌన్ ను మరికొంత కాలం పొడిగించాలని అశోక్ గెహ్లాత్ ప్రభుత్వం భావిస్తుంది. పరీక్షలు తక్కువగా ఇక్కడ జరుగుతున్నాయి. దీంతో భవిష్యత్తులో రాజస్థాన్ లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందంటున్నారు. అందుకే మే 3వ తేదీన కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ లో మినహాయింపులు ఇచ్చినా రాజస్థాన్ లో మాత్రం పక్కాగా అమలు జరిపే అవకాశం ఉందటున్నారు.