రజనీ విషయంలో సైలెన్స్ అందుకేనా?
తమిళనాడులో రజనీకాంత్ రాజకీయ ప్రవేశం హాట్ టాపిక్ గా మారింది. అయితే రజనీ దెబ్బను ఎదుర్కొననున్న డీఎంకే మాత్రం రజనీ రాజకీయ ప్రవేశం పై ఆచితూచి వ్యవహరిస్తుంది. [more]
తమిళనాడులో రజనీకాంత్ రాజకీయ ప్రవేశం హాట్ టాపిక్ గా మారింది. అయితే రజనీ దెబ్బను ఎదుర్కొననున్న డీఎంకే మాత్రం రజనీ రాజకీయ ప్రవేశం పై ఆచితూచి వ్యవహరిస్తుంది. [more]
తమిళనాడులో రజనీకాంత్ రాజకీయ ప్రవేశం హాట్ టాపిక్ గా మారింది. అయితే రజనీ దెబ్బను ఎదుర్కొననున్న డీఎంకే మాత్రం రజనీ రాజకీయ ప్రవేశం పై ఆచితూచి వ్యవహరిస్తుంది. ఎక్కడా రజనీకాంత్ గురించి చెడుగా మాట్లాడవద్దని పార్టీ అధినేత స్టాలిన్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. రజనీకాంత్ రాజకీయ పార్టీ పెడతానని 2017లో ప్రకటించారు. కానీ ఇప్పటి వరకూ పార్టీని ప్రకటించలేదు. అయితే తాజాగా ఈనెల 31వ తేదీన పార్టీ ప్రకటన ఉంటుందని రజనీ కాంత్ ట్వీట్ చేశారు.
పార్టీ పెట్టినప్పుడు…..
అయితే రజనీకాంత్ ది చంచల మనస్తత్వమని, తొందరపడవద్దని స్టాలిన్ సీనియర్ నేతలతో జరిగిన సమావేశంలో చెప్పినట్లు తెలిసింది. రజనీకాంత్ ఇప్పటికే రాజకీయాల్లోకి వచ్చేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. అన్ని స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని కూడా రజనీకాంత్ ప్రకటించారు. ఇంకా ఎన్నికలకు మూడు, నాలుగు నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ స్వల్ప సమయంలో రజనీకాంత్ మ్యాజిక్ చేయలేరని డీఎంకే అధినేత స్టాలిన్ పూర్తి విశ్వాసంతో ఉన్నారు.
ఎక్కువగా నష్టపోయేది….
రజనీకాంత్ పార్టీ పెట్టడండ కారణంగా బాగా నష్టపోయేది డీఎంకేనే. ఇప్పుడున్న పరిస్థితుల్లో డీఎంకే తిరుగులేనిదిగా ఉంది. అన్ని సర్వేలు డీఎంకే వైపే మొగ్గు చూపుతున్నాయి. దీంతో స్టాలిన్ ప్రశాంత్ కిషోర్ నుకూడా ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్నారు. కానీ రజనీకాంత్ రాకతో కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు తమకు పడే అవకాశం లేదని స్టాలిన్ భావిస్తున్నారు.
ప్రచార సమాయానికి……
అయితే రజనీకాంత్ పార్టీని ప్రకటించి ఎన్నికల సమరంలో దిగితే ఒక ఆటాడుకోవాలని స్టాలిన్ భావిస్తున్నారు. రజనీకాంత్ అభిమానుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రచారం చేయాలన్నది స్టాలిన్ లక్ష్యంగా ఉంది. ప్రధానంగా రజనీకాంత్ అసలు పేరు శివరాజ్ గైక్వాడ్ పేరుతో సోషల్ మీడియాలో ఇప్పటికే డీఎంకే శ్రేణులు ప్రచారంలోకి దిగాయి. ఎన్నికల సమయానికి రజనీకాంత్ నాన్ లోకల్ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని స్టాలిన్ యోచనగా ఉంది. అప్పటి వరకూ రజనీకాంత్ విషయంలో మౌనం పాటించాలని పార్టీ నేతలకు ఆయన ఆదేశాలు జారీ చేశారట.