తిక్కలకే తిక్కలోడు… ఈ వర్మ ఇక మారడు
రామ్ గోపాల్ వర్మ అంటే తిక్కలకే తిక్క. అలాంటి సంచలన దర్శకుడు. నాకు తిక్కుంది దానికో లెక్కుంది అనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఎప్పటి [more]
రామ్ గోపాల్ వర్మ అంటే తిక్కలకే తిక్క. అలాంటి సంచలన దర్శకుడు. నాకు తిక్కుంది దానికో లెక్కుంది అనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఎప్పటి [more]
రామ్ గోపాల్ వర్మ అంటే తిక్కలకే తిక్క. అలాంటి సంచలన దర్శకుడు. నాకు తిక్కుంది దానికో లెక్కుంది అనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఎప్పటి నుంచో ఉంది. పవన్ ఏ స్టెప్ వేసినా ఆర్జీవీ ట్విట్టర్ లో ఏదో ఒక ట్వీట్ తో హల్ చల్ చేయడం అందరికి తెలిసిందే. జనసేన పార్టీ పవన్ నెలకొల్పిన తరువాత 2014 నుంచి 2019 వరకు వర్మ అప్పుడప్పుడు విమర్శలు గుప్పించేవారు. అయితే అది పెద్దగా ఎవ్వరు సీరియస్ గా తీసుకున్న సందర్భాలు లేవు. ఆ తరువాత శ్రీరెడ్డి వ్యవహారంలో వర్మ స్క్రీన్ ప్లే దర్శకత్వం బయటపడ్డాక ఉద్దేశ్యపూర్వకంగానే పవన్ ను టార్గెట్ చేసినట్లు తేలిపోయింది.
పవర్ స్టార్ చిత్రం తో …
తాజాగా ఈనెల 25న ఆర్జీవీ సినిమా ద్వారా రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ చిత్రం ఓ టి టి లో రిలీజ్ కానుంది. ఈ సినిమా మొత్తం పవన్ క్యారెక్టర్ ను పూర్తి డ్యామేజ్ గా చిత్రీకరించినట్లు ఇప్పటికే టీజర్ లు స్పష్టం చేసేశాయి. రెండో టీజర్ లీక్ అయ్యాక పవర్ స్టార్ అభిమానుల్లో కోపం కట్టలు తెంచుకొని ఆర్జీవీ కార్యాలయంపై దాడికి సైతం పాల్పడే స్థాయికి చేరింది. ఇక దీనిపై పోలీస్ కేసు దాడికి పాల్పడిన ఆరుగురిని అరెస్ట్ చేయడం రొటీన్ గా జరిగి పోయాయి. ఇక్కడితో పవన్ అభిమానులు ఆగలేదు. యుద్ధప్రాతిపదికపై వర్మ పై పరాన్నజీవి పేరుతో మరో చిత్రాన్ని తెరకు ఎక్కిస్తున్నారు. తమ అభిమాన స్టార్ పై వేస్తున్న బురదను తిరిగి ఆర్జీవీ పై వేసి వ్యవహారం మరింత వేడెక్కిస్తున్నారు పవర్ స్టార్ అభిమానులు.
ఎక్కడ ఎండ్ ….
ఇప్పటికే టాలీవుడ్ లో అనారోగ్య వాతావరణం నడుస్తుంది. దీనికి తోడు రామ్ గోపాల్ వర్మ తాజాగా సృష్ట్టించిన ఈ వివాదాస్పద సినిమా దానికి ప్రతిగా వర్మ పై రానున్న చిత్రాలు కరోనా కాలంలో తెలుగు ప్రేక్షకులను నవ్వించేవే. అయినా ఈ తరహా ధోరణి ఎక్కడికి దారి తీస్తుందన్న ఆందోళన సినీ ప్రముఖుల్లో వ్యక్తం అవుతుంది. సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వారిని టార్గెట్ చేసి వారిని వ్యక్తిత్వ హననం చేయడం రామ్ గోపాల్ వర్మ కు కొత్తేమి కాకున్నా ఇలాంటివి భవిష్యత్తులో ఎటువంటివాటికి దారితీస్తుందో ఆందోళన చెందుతుంది పరిశ్రమ.