తప్పు చేశారా…? సరిదిద్దుకోలేకపోతున్నారా?
రెండు వర్గాలు.. రెండు పార్టీల క్యాడర్ ఎప్పుడూ కలిసే అవకాశమే లేదు. నేతలు కలసినా క్యాడర్ మాత్రం తాము ఇంతకాలం చేతబూనిన జెండాను వీడేందుకు ఇష్టపడదు. ఇంతకు [more]
రెండు వర్గాలు.. రెండు పార్టీల క్యాడర్ ఎప్పుడూ కలిసే అవకాశమే లేదు. నేతలు కలసినా క్యాడర్ మాత్రం తాము ఇంతకాలం చేతబూనిన జెండాను వీడేందుకు ఇష్టపడదు. ఇంతకు [more]
రెండు వర్గాలు.. రెండు పార్టీల క్యాడర్ ఎప్పుడూ కలిసే అవకాశమే లేదు. నేతలు కలసినా క్యాడర్ మాత్రం తాము ఇంతకాలం చేతబూనిన జెండాను వీడేందుకు ఇష్టపడదు. ఇంతకు ముందులాగా నేతలు మారిన వెంటనే క్యాడర్ కూడా పోలోమంటూ వెళ్లే సీన్ లేదు. ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్ ల వద్ద ఢీ అంటే ఢీ అనేది క్యాడర్ మాత్రమే. ఇప్పుడు జమ్మలమడుగు నియోజకవర్గంలోనూ అదే పరిస్థితి కన్పిస్తుంది.
వైసీపీలో చేరినా….
జమ్మలమడుగు నియోజకవర్గంలో టీడీపీ కీలక నేత రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరారు. ఆయన చేరి దాదాపు ఆరు నెలలు కావస్తుంది. అయితే ప్రస్తుత జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రామసుబ్బారెడ్డిని కలుపుకుని వెళ్లడం లేదు. పార్టీ కార్యక్రమాలకు కూడా రామసుబ్బారెడ్డికి ఆహ్మానం పంపండం లేదు. దీనికి కారణం క్యాడర్ నుంచి రామసుబ్బారెడ్డిపై వస్తున్న వ్యతిరేకతే కారణమని ఆయన వర్గీయులు చెబుతున్నారు.
క్యాడర్ లో అసంతృప్తి….
2019 ఎన్నికల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ వైసీపీ క్యాడర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో హోరాహోరీ తలపడింది. అనేక చోట్ల ఘర్షణలు కూడా తలెత్తాయి. పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి. కాపుకాచి చితకబాదిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో రామసుబ్బారెడ్డి రాకను జమ్మలమడుగు వైసీపీ క్యాడర్ జీర్ణించుకులోకపోతుందంటున్నారు. అందుకే సుధీర్ రెడ్డి పై వత్తిడి తెచ్చి రామసుబ్బారెడ్డికి పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానం పంపడం లేదని చెబుతున్నారు.
హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినా….
మరోవైపు రామసుబ్బారెడ్డి కూడా సుధీర్ రెడ్డి వ్యవహార శైలి పట్ల అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తాను ఎంత దిగివచ్చినా కలుపుకుని పోయేందుకు ముందుకు రాకపోవడంపై రామసుబ్బారెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని రామసుబ్బారెడ్డి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా అన్ని నియోజకరవర్గాల మాదిరిగానే దీనిని పట్టించుకోకుండా వదిలేసింది. దీంతో రామసుబ్బారెడ్డి వర్గం రగిలిపోతుందంటున్నారు. మరి రెండు కత్తులు ఒకే ఒరలో ఇమడవన్న సామెత జమ్మలమడుగు నియోజకవర్గంలో రుజువవుతుంది.