ఈ ఇద్దరినీ ఎవరూ ఏమీ చేయలేరా?
రాజోలు జనసేన ఎమ్యెల్యే రాపాక వర ప్రసాద్ అధికారపార్టీకి ప్రసాదం లాగే దొరికారు. టీ గ్లాస్ పై నెగ్గి ఫ్యాన్ కింద సేద తీరుతున్న వరప్రసాద్ జనసేనకు [more]
రాజోలు జనసేన ఎమ్యెల్యే రాపాక వర ప్రసాద్ అధికారపార్టీకి ప్రసాదం లాగే దొరికారు. టీ గ్లాస్ పై నెగ్గి ఫ్యాన్ కింద సేద తీరుతున్న వరప్రసాద్ జనసేనకు [more]
రాజోలు జనసేన ఎమ్యెల్యే రాపాక వర ప్రసాద్ అధికారపార్టీకి ప్రసాదం లాగే దొరికారు. టీ గ్లాస్ పై నెగ్గి ఫ్యాన్ కింద సేద తీరుతున్న వరప్రసాద్ జనసేనకు కంట్లో నలుసులా తయారయ్యారు. ఆయనపై చర్య తీసుకుంటే ఉన్న ఒక్క ఎమ్యెల్యే గోవిందా అవుతారనే జనసేనాని రాపాక వ్యవహారం చూసి చూడనట్లే పోతున్నారు. ఇదే అవకాశంగా రాపాక వరప్రసాద్ చెలరేగిపోతూనే వస్తున్నారు. ముఖ్యంగా ఎపి లో అధికారపార్టీపై పవన్ కళ్యాణ్ చెలరేగినప్పుడల్లా స్క్రీన్ పై రాపాక వరప్రసాద్ ప్రత్యక్షం అయ్యి జగన్ సర్కార్ సూపర్ అంటూ కితాబు ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు.
వైసిపి కి రఘు రామ లాగే …
ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీల్లో ఈ కొత్త ట్రెండ్ ఒక ఫ్యాషన్ గా మారింది. నరసాపురం ఎంపీ రఘురామా కృష్ణం రాజు ఎపిసోడ్ లోను అదే జరుగుతుంది. ఫ్యాన్ పార్టీలో నెగ్గిన రాజు చెవిలో కమలం పువ్వు పెట్టుకుని సైకిల్ ఎక్కి టిడిపి ఎజెండా వల్లెవేస్తూ వైసిపి కి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. అయితే ఈయనపై అధికారపార్టీ ధైర్యం చేసి అనర్హత కు లోక్ సభలో ఫిర్యాదు చేసింది. కానీ జనసేన మాత్రం ఆ మాత్రం స్టెప్ సైతం వేయలేకపోవడం గమనార్హం.
చర్యలకు రాజకీయాలే అడ్డు …
ఒక పార్టీ గుర్తుపై నెగ్గి పక్క పార్టీకి జై కొట్టే వారి ని అనర్హులను చేసే చట్టాలు ఉన్నా అవి చట్టసభల సభాపతుల నిర్ణయంపై ఆధారపడుతున్నాయి. స్పీకర్ లు అధికారపార్టీ నిర్ణయాలకు శిరోధార్యం అంటారు కనుక ఆయా పార్టీల ప్రయోజనాల మేరకు అనర్హత పిటిషన్ లకు ఎస్ చెప్పకుండా నో చెప్పకుండా ఐదేళ్ళు కాలక్షేపం చేస్తూనే ఉంటారు. దేశవ్యాప్తంగా ఇలాంటి వివాదాలపై న్యాయస్థానాలు సైతం ఏమి చేయలేని అనిశ్చితి రాజ్యాంగానికి మచ్చగా మిగిలిపోతుంది. నిర్ణిత కాలవ్యవధిలోగా అనర్హత పిటిషన్ లపై చర్యలు తీసుకోవాలని పెట్టి ఉంటె పార్టీ ఫిరాయింపులకు లేదా సొంత పార్టీ పై తిరుగుబావుటా ఎగరవేసే వారి ఆటలకు చెక్ పడిఉండేది.