తండ్రి ఎమ్మెల్యే.. కొడుకు ఇంచార్జ్.. వాహ్వా…వైసీపీ రాజకీయం
తూర్పుగోదావరి జిల్లా ఎస్సీ నియోజకవర్గం రాజోలులో రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ఇక్కడ నుంచి విజయం సాధించిన జనసేన నేత.. రాపాక వరప్రసాద్ రాజకీయం ఎత్తులు, పై ఎత్తులు, [more]
తూర్పుగోదావరి జిల్లా ఎస్సీ నియోజకవర్గం రాజోలులో రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ఇక్కడ నుంచి విజయం సాధించిన జనసేన నేత.. రాపాక వరప్రసాద్ రాజకీయం ఎత్తులు, పై ఎత్తులు, [more]
తూర్పుగోదావరి జిల్లా ఎస్సీ నియోజకవర్గం రాజోలులో రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ఇక్కడ నుంచి విజయం సాధించిన జనసేన నేత.. రాపాక వరప్రసాద్ రాజకీయం ఎత్తులు, పై ఎత్తులు, వ్యూహాలతో రాజకీయాన్ని రసవత్తరంగా మారుస్తోంది. అదే సమయంలో ఇక్కడ వైసీపీకి మాజీ ఇంచార్జ్, ప్రస్తుత ఇంచార్జ్‌లుగా ఉన్న బొంతు రాజేశ్వరరావు, పెదపాటి అమ్మాజీ పరిస్థితి డోలాయమానంలో ఉందని అంటున్నారు. ఇప్పటి వరకు రాజోలులో ఉన్న పొలిటికల్ వేడి ఇటీవల జరిగిన పరిణామాలతో మరింత యూటర్న్ తీసుకుంది. దీంతో నియోజకవర్గం రాజకీయాలు.. మరోసారి చర్చకు వచ్చాయి.
ఏకైక ఎమ్మెల్యేగా……
గత ఎన్నికల్లో జనసేన నుంచి గెలిచిన రాపాక వరప్రసాద్ ఆ పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. అయితే.. కొన్నాళ్లకే ఆయన వైసీపీకి మద్దతు దారుగా మారిపోయారు. అంతేకాదు, పరోక్షంగా నియోజ కవర్గంలోనూ చక్రం తిప్పుతున్నారు. ఇక, గత ఏడాదిఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన బొంతు రాజేశ్వరరావును ఇంచార్జ్ స్థానం నుంచి తప్పించిన వైసీపీ.. ఆ స్థానంలో మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపాటి అమ్మాజీకి అవకాశం ఇచ్చారు. దీంతో వీరిద్దరు సెపరేట్ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. ఇంతలో రాపాక వరప్రసాద్ ఎంట్రీతో మరో గ్రూపు కూడా రెడీ అయ్యింది.
మూడు గ్రూపులుగా….
దీంతో నియోజకవర్గంలో మూడు గ్రూపుల రగడ జోరుగా సాగుతోంది. దీంతో రాజోలు వైసీపీలో మూడు ముక్కలాట సాగుతోంది. దీంతోనే ఇక్కడ వైసీపీలో తలనొప్పులు వస్తున్నాయి. నియోజకవర్గ రాజకీయాలను శాసించే క్షత్రియ సామాజిక వర్గం తమ చెప్పు చేతల్లో ఉండడం లేదని బొంతును బలవంతంగా తప్పించి అమ్మాజీని తెచ్చుకున్నారు. అయితే అమ్మాజీతో కూడా ఉపయోగం ఉండడం లేదని వారంతా రాపాక వరప్రసాద్ కే వైసీపీ ఇన్చార్జ్ పగ్గాలు ఇప్పించుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా జగన్ ఒప్పుకోవడం లేదు.
అధికారికంగా మాత్రం…..
ఇక రాపాక వరప్రసాద్ జగన్‌కు, వైసీపీకి ఎంత డప్పు మోగిస్తున్నా, అసెంబ్లీలో, బయటా భజన చేస్తున్నా ఆయన అధికార వైసీపీ ఎమ్మెల్యేగా గుర్తింపు లేదు. తాజాగా రాపాక వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తనకు మారుడు వెంకట్రామ్ను వైసీపీలోకి చేర్చేశారు. తాను అధికారికంగా చేరే అవకాశం లేని నేపథ్యంలో ఆయన కుమారుడుని నేరుగా వైసీపీలోకి చేర్చారు. ఇక, ఇప్పుడు రాపాక కుటుంబం నుంచి వెంకట్రామ్.. అధికారికంగానే వైసీపీ రాజకీయాల్లో శాసించే స్థాయికి ఎదిగే అవకాశం ఉందని అంటున్నారు.
త్వరలోనే ఇన్ ఛార్జిగాా……
అంతేకాదు… రేపు ఓ ఆర్నెల్లో.. ఏడాదో ఆగి.. నియోజకవర్గం ఇంచార్జ్ పీఠం కూడా దక్కించుకునేలా రాపాక వరప్రసాద్, క్షత్రియ వర్గం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందట. ఉభయగోదావరి జిల్లాల పార్టీ ఇన్చార్జ్ సుబ్బారెడ్డి దగ్గర వీరు లాబీయింగ్ కూడా స్టార్ట్ చేసేశారని తెలుస్తోంది. ఇదే జరిగితే.. ఇక, రాపాక వరప్రసాద్ దూకుడు మరింత పెరుగుతుందని అంటున్నారు. ఇక, రాపాక దూకుడుకు ఇప్పటికే ఇద్దరు మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పినిపే విశ్వరూప్ సహకరిస్తున్నారనే వాదన కూడా ఉంది. దీంతో రాజోలు వైసీపీ రాజకీయం మరింత వేడెక్కడం ఖాయమని అంటున్నారు. మరి మున్ముందు ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి.