ఎటూ కాకుండా పోయారుగా?
రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పరిస్థితి ఎటూ కాకుండా పోయింది. ఆయనను ఏ పార్టీ కార్యకర్తలు దరిచేరనీయడం లేదు. దీంతో రాపాక వరప్రసాద్ రెంటికి చెడ్డ రేవడిగా [more]
రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పరిస్థితి ఎటూ కాకుండా పోయింది. ఆయనను ఏ పార్టీ కార్యకర్తలు దరిచేరనీయడం లేదు. దీంతో రాపాక వరప్రసాద్ రెంటికి చెడ్డ రేవడిగా [more]
రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పరిస్థితి ఎటూ కాకుండా పోయింది. ఆయనను ఏ పార్టీ కార్యకర్తలు దరిచేరనీయడం లేదు. దీంతో రాపాక వరప్రసాద్ రెంటికి చెడ్డ రేవడిగా మారారు. ఇటు వైసీపీ కార్యకర్తలు ఆయనను తమ నేతగా అంగీకరించడం లేదు. జనసేన క్యాడర్ రాపాకను ఎప్పుడో తమ మనస్సుల్లో నుంచి తీసివేశారు. వచ్చే ఎన్నికల నాటికి రాపాక వరప్రసాద్ పరిస్థితి ఏంటన్నది ఆయనకే అర్థం కాకుండా ఉంది.
ఎన్నికల్లో గెలిచిన తర్వాత…..
గత ఎన్నికల్లో రాపాక వరప్రసాద్ రాజోలు నుంచి జనసేన తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జనసేన పార్టీ అభ్యర్థులు పవన్ కల్యాణ్ తో సహా అందరూ ఓటమిపాలయినా రాపాక వరప్రసాద్ మాత్రం విజయం సాధించారు. దీంతో జనసేనకు కొంత ఊరల లభించింది. అయితే ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. రాపాక వరప్రసాద్ ను జనసేన క్రమంగా దూరం పెట్టడం ప్రారంభించింది. ఇది గమనించి రాపాక వరప్రసాద్ వైసీపీకి దగ్గరయ్యారు.
పార్టీ లైన్ ను దాటి…
వైసీపీ ప్రభుత్వ వైఖరిని జనసేన ఎండగడుతుంటే రాపాక వరప్రసాద్ మాత్రం పొగుడుతుంటారు. అసెంబ్లీ లో ప్రతి అంశానికి రాపాక మద్దతిస్తున్నా పవన్ కల్యాణ్ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తన తనయుడిని కూడా అధికారికంగా జగన్ సమక్షంలో రాపాక వరప్రసాద్ వైసీపీలో చేర్చారు. అంటే రాపాక వరప్రసాద్ వైసీపీలో ఉన్నట్లే. అయితే వైసీపీ శ్రేణులు మాత్రం దీనికి అంగీకరించడం లేదు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో తాను వైసీపీ కార్యకర్తనేనని చెప్పారు
రెండు గ్రూపులుండటంతో….
నిజానికి రాజోలులో వైసీపీలో రెండు గ్రూపులున్నాయి. రాపాక వరప్రసాద్ వైసీపీకి మద్దతుదారుగా ఉండటంతో మూడు గ్రూపులయ్యాయి. రాపాక వరప్రసాద్ కు వైసీపీ శ్రేణులు సహకరించడం లేదు. గత ఎన్నికల్లో తన వెంట నడిచిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని రాపాక వరప్రసాద్ పై వైసీపీ క్యాడర్ ఆరోపిస్తుంది. ఇక జనసేన క్యాడర్ రాపాక వరప్రసాద్ వైపు ఎటూ చూడటం లేదు. దీంతో రాపాక వరప్రసాద్ ఎటూ గాకుండా పోయారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు జగన్ టిక్కెట్ ఇచ్చినా వైసీపీ లోని రెండు వర్గాలు సహకరిస్తాయన్న నమ్మకం మాత్రం లేదు.