రాజోలులో రగడ తప్పదా?
వచ్చే ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు రాజోలు పెద్ద సమస్యగా మారనుంది. రాజోలు టిక్కెట్ పై రగడ కొనసాగే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి. రాజోలులో [more]
వచ్చే ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు రాజోలు పెద్ద సమస్యగా మారనుంది. రాజోలు టిక్కెట్ పై రగడ కొనసాగే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి. రాజోలులో [more]
వచ్చే ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు రాజోలు పెద్ద సమస్యగా మారనుంది. రాజోలు టిక్కెట్ పై రగడ కొనసాగే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి. రాజోలులో గత ఎన్నికల్లో జనసేన నుంచి విజయం సాధించిన రాపాక వరప్రసాద్ కు తిరిగి వైసీపీ టిక్కెట్ ఇచ్చేందుకు జగన్ సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది. దీంతో రాజోలులో ఇప్పటికే వైసీపీలో ఉన్న రెండు వర్గాలు అసంతృప్తితో రగిలిపోతున్నాయి.
వైసీపీీకి మద్దతు దారుగా….
రాపాక వరప్రసాద్ జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే. అయితే ఆయన ఎన్నికల ఫలితాలు వెలువడిన నెల తిరక్కముందే వైసీపీకి మద్దతుదారుగా మారిపోయారు. జనసేన అగ్రనేతలు తనను పట్టించుకోలేదన్న కారణంగా రాపాక వరప్రసాద్ జగన్ కు దగ్గరయ్యారు. బయట పవన్ కల్యాణ్ జగన్ ను విమర్శిస్తుంటే దానికి కౌంటర్ గా రాపాక వరప్రసాద్ జగన్ ను పొగుడుతూ ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారారు.
జగన్ కు మరింత దగ్గరయి….
ఇంత చేస్తున్నా రాపాక వరప్రసాద్ పై జనసేన బహిష్కరణ వేటు వేయలేదు. అయితే జగన్ తనను నమ్మి వచ్చిన వారికి అన్యాయం చేయరనే పేరుంది. అందుకే రాపాక వరప్రసాద్ తాను నేరుగా పార్టీలో చేరకపోయినా తన కుమారుడికి వైసీపీ కండువా కప్పేశారు. అలా జగన్ కు దగ్గరయ్యారు. రాపాక వరప్రసాద్ పై జగన్ కు సదభిప్రాయం ఉంది. రాజోలులో వైసీపీ నాయకత్వం వీక్ గా ఉందని జగన్ భావిస్తున్నారు.
మంత్రుల మద్దతు కూడా…?
దీంతో అక్కడ వైసీపీలో ఉన్న రెండు వర్గాలను జగన్ పెద్దగా పట్టించుకోవడం లేదని తెలిసింది. వైసీపీ ఇన్ ఛార్జి ఉన్నప్పటికీ నామమాత్రంగానే ఉన్నారు. మంత్రులు కూడా రాపాక వరప్రసాద్ కు మద్దతుగా నిలుస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో రాపాక వరప్రసాద్ కే తిరిగి టిక్కెట్ అన్న ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే వైసీపీలోని రెండు వర్గాలు ఊరుకునేట్లు లేవు. దీంతో రాజోలులో వచ్చే ఎన్నికల నాటికి రగడ మామూలుగా ఉండదంటున్నారు.