Ycp : రాపాకకే టిక్కెట్ … అనుమానమేనా?
ఈసారి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం జగన్ కు ముఖ్యమే. గత ఎన్నికల్లో లభించిన 151 సీట్లను తిరిగి సాధించుకోవాలన్న ప్రయత్నంలో జగన్ ఉన్నారు. అందుకోసం మూడేళ్ల ముందు [more]
ఈసారి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం జగన్ కు ముఖ్యమే. గత ఎన్నికల్లో లభించిన 151 సీట్లను తిరిగి సాధించుకోవాలన్న ప్రయత్నంలో జగన్ ఉన్నారు. అందుకోసం మూడేళ్ల ముందు [more]
ఈసారి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం జగన్ కు ముఖ్యమే. గత ఎన్నికల్లో లభించిన 151 సీట్లను తిరిగి సాధించుకోవాలన్న ప్రయత్నంలో జగన్ ఉన్నారు. అందుకోసం మూడేళ్ల ముందు నుంచే జగన్ ప్రణాళికలను సిద్ధం చేశారు. గత ఎన్నికల్లో ఓటమి పాలయిన నియోజకవర్గాల్లో ఈసారి గెలవాలన్నది జగన్ లక్ష్యంగా ఉంది. ఇందులో రాజోలు ఒకటి. రాజోలులో గత ఎన్నికల్లో జనసేన పార్టీ గెలిచింది. ఈసారి ఆ ఒక్కటి కూడా దక్కకూడదన్నది జగన్ ఆలోచన. ప్రస్తుతం అక్కడి ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ జనసేన నుంచి గెలిచినా వైసీపీ మద్దతుదారుగా కొనసాగుతున్నారు.
అదే జరిగితే?
అయితే ఈసారి రాపాక వరప్రసాద్ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్న చర్చ ఇప్పటి నుంచే ప్రారంభమయింది. ఆయన తన కుమారుడిని అధికారికంగా జగన్ సమక్షంలో వైసీీపీలో చేర్చారు. అంటే వచ్చే ఎన్నికలకు వైసీీపీలోనే ఉండి పోటీ చేయాలన్నది ఆయన ఉద్దేశ్యం. కానీ హైకమాండ్ ఆలోచన వేరే విధంగా ఉంది. అసలే అక్కడ జనసేన పార్టీ స్ట్రాంగ్ గా ఉంది. ఈసారి టీడీపీ, జనసేన కలసి పోట ీ చేసే అవకాశాలే కన్పిస్తున్నాయి.
రాపాకకు మాత్రం…
పార్టీ మారినందుకు సహజంగా రాపాక వరప్రసాద్ పై వ్యతిరేకత ప్రజల్లో ఉంటుంది. అందుకే ఆయనను తప్పించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్నది పార్టీ హైకమాండ్ ఉద్దేశ్యం. ఇప్పటికైతా రాపాక వరప్రసాద్ జనసేనలోనే ఉన్నారు. అధికారికంగా టర్మ్ పూర్తయిన తర్వాత వైసీపీలో చేరతారు. కానీ పార్టీలో చేరినా ఆయనకు గాని, ఆయన కుమారుడికి గాని టిక్కెట్ ఇచ్చి మరోసారి ఓటమిని కొని తెచ్చుకోలేమని వైసీపీ హైకమాండ్ భావిస్తుంది.
కొత్త నేతను….
రాజోలు నియోజకవర్గం వైసీపీలో మూడు గ్రూపులున్నాయి. రాపాక వరప్రసాద్ తో పాటు వైసీపీ ఇన్ ఛార్జి అమ్మాజీ, బొంతు రాజేశ్వరరావులు తమ వర్గాలతో పార్టీని భ్రష్టు పట్టించారన్న ఆరోపణలున్నాయి. బొంతుకు నామినేటెడ్ పదవి ఇచ్చారు. ఈ ముగ్గురిలో ఎవరి వర్గానికి కాకుండా కొత్తనేతకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలన్నది పార్టీ దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చింది. అయితే ఆ నేత ఎవరన్నది సస్పెన్స్. అప్పటి వరకూ రాజోలులో రగడ కొనసాగించాలన్నదే హైకమాండ్ వ్యూహంగా ఉంది.