దండ వేసి.. దండం పెట్టి…?
ఎన్టీఆర్ తెలుగు వల్లభుడు. ఆయన తెలుగు జాతి ఉమ్మడి ఆస్తి. అంతే కాదు. ఆయన నిలువెత్తు తెలుగు సంతకం. అటువంటి వారు నూటికో కోటికో ఒకరే పుడతారు. [more]
ఎన్టీఆర్ తెలుగు వల్లభుడు. ఆయన తెలుగు జాతి ఉమ్మడి ఆస్తి. అంతే కాదు. ఆయన నిలువెత్తు తెలుగు సంతకం. అటువంటి వారు నూటికో కోటికో ఒకరే పుడతారు. [more]
ఎన్టీఆర్ తెలుగు వల్లభుడు. ఆయన తెలుగు జాతి ఉమ్మడి ఆస్తి. అంతే కాదు. ఆయన నిలువెత్తు తెలుగు సంతకం. అటువంటి వారు నూటికో కోటికో ఒకరే పుడతారు. నిజానికి ఒక రంగంలో రాణించడం. అగ్ర స్థానానికి చేరుకుని శాసించడం అన్నదే చాలా గొప్ప విషయం. అలాంటిది రెండు ప్రధాన రంగాల్లో టాప్ రేంజిలో ఉంటూ అశేష జనాభిమానాన్ని విశేషంగా చూరగొనడం అంటే అది మాటలలో వర్ణించలేనిదే. అలాంటి అరుదైన రికార్డు ఎన్టీఆర్ సృష్టించారు. అలాంటి ఎన్టీఆర్ ని ఆయన పెట్టిన టీడీపీ పెద్దలు ఏ విధంగానైనా పట్టించుకుంటున్నారా అన్నదే చర్చ.
పాతికేళ్ళుగా……
ఎన్టీఆర్ ఈ లోకాన్ని వీడి పాతికేళ్ళు అయింది. అంటే పావు శతాబ్దం అన్న మాట. కాలం ముందు అది చిన్నదే కానీ జనసామాన్యం లెక్కలలో మాత్రం చాలా పెద్దదే. ఎన్టీఆర్ తానుండగా ఎన్నో చేశారు. ఆయన్ని దించేసి పార్టీని ప్రభుత్వాన్ని లాగేసుకున్న పెద్దలు ఆయనకంటూ ఏం చేశారు అన్నది కనుక చర్చించుకుంటే ఈ పాతికేళ్లలో ఏమీ లేదు అనే చెప్పాలి. కనీసం చలన చిత్ర సీమ రారాజుగా వెలుగొందిన ఎన్టీఆర్ పేరిట ప్రతీ ఏటా అవార్డుని కూడా ఇచ్చే ప్రయత్నం చేయలేకపోయారు అన్న విమర్శలు ఉన్నాయి.
భారత రత్న ఏమైంది ?
ఎన్టీఆర్ భారత రత్నకు అర్హుడు. అందులో వేరే డౌటే లేదు. ఆయన బతికి ఉంటే ఆనాటి రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో కచ్చితంగా దేశానికి ప్రధాని అయ్యేవారు. అయితే ఆయన జాతకంలో అది లేకపోయింది కానీ రామారావు జాతీయ నాయకుడే. ఆయన దేశాన్ని తన వైపు చూసేలా తనదైన రాజకీయం చేశారు. మరి అలాంటి మహానుభావుడికి భారతరత్నను ఇప్పించలేకపోయారుగా. ఆయన పోయి పాతికేళ్ళు అయినా ఇంకా భారతరత్న డిమాండ్ అక్కడక్కడ వినిపిస్తూండడం అంటే అది ఎన్టీఆర్ వారసత్వం మాది అని జబ్బలు చరచుకుంటున్న వారికే అవమానం కాదా.
అంగుష్టమాత్రులేనా..?
ఎన్టీఆర్ హిమనగం. ఆయన ముందు ఎవరూ సాటి కారు. ఆయన పెట్టిన పార్టీలో ఉన్న వారు కూడా రామారావు వారసులమని చెప్పుకుంటారు కానీ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళలేకపొయారన్న విమర్శలు ఉన్నాయి. ఆయన బొమ్మ ఉంటే చాలు ఒక దండ వేసి దండం పెట్టేస్తే సరిపోతుంది అని భావిస్తున్నారే తప్ప తమకు పార్టీనే వదిలేసి రాజకీయ బిక్ష పెట్టిన మహానుభావుడి రుణం తీర్చుకునేందుకు కనీస ప్రయత్నం కూడా చేయడంలేదన్న మాట అయితే ఉంది. అన్న గారి కోసం మేలైన పని చేయడానికి పాతికేళ్ళ కాలమైనా తీరిక దొరకలేదని అంటే ఎవరైనా నమ్ముతారా. ఏది ఏమైనా ఎన్టీఆర్ భౌతికంగా దూరమై కాలంతో పాటు చాలా దూరం వెళ్ళిపొయారు. ఆయన పెట్టిన పార్టీలోని వారు కూడా ఆయన స్పూర్తి నుంచి ఇంకా దూరం అయిపోయారు అంటే అది నిష్టుర సత్యమే అవుతుంది మరి.