అక్కడంతా సీఎం మేనమామ చెప్పిందే వేదం
అవును,,, ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఇదే మాట వినిపిస్తోంది. ఆయన చెప్పిందే వేదం. చేసేందే పని. అన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆయనే సీఎం జగన్ మేనమామ. కడప [more]
అవును,,, ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఇదే మాట వినిపిస్తోంది. ఆయన చెప్పిందే వేదం. చేసేందే పని. అన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆయనే సీఎం జగన్ మేనమామ. కడప [more]
అవును,,, ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఇదే మాట వినిపిస్తోంది. ఆయన చెప్పిందే వేదం. చేసేందే పని. అన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆయనే సీఎం జగన్ మేనమామ. కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి. నియోజకవర్గంలో ఆయనే రారాజుగా చలామణీ అవుతున్నారు. అయితే, ఇది ఏదో అధికార పక్షానికే పరిమితం కాలేదు. ప్రతిపక్షానికి కూడా ఆయనే హీరో అంటున్నారు. ఇంతకీ విషయంలోకి వెళ్తే.. కమలాపురం నియోజకవర్గం నుంచి రెండు సార్లు వరుస విజయాలు సాధిస్తున్న రవీంద్రనాథ్‌రెడ్డి పూర్తిగా నియోజకవర్గంపై పట్టు పెంచుకున్నారు. ఇప్పుడు పార్టీ కూడా అధికారంలో ఉండడంతో ఇక్కడ టీడీపీ నాయకులు సైతం మౌనం పాటిస్తున్నారు.
అందరూ ఆయన చెప్పినట్లే….
టీడీపీ తరఫున పుత్తా నరసింహారెడ్డి ఇక్కడ ఉన్నారు. అయితే, ఆయన కూడా చేతులెత్తేసి ఖాళీగా కూర్చున్నారని టీడీపీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. అంతేకాదు, తన అనుచరులను కూడా రవీంద్రనాథ్‌రెడ్డి చెప్పింది వినాలని, ఆయనతోనే పనులు చేయించుకోవాలని సూచిస్తున్నారట. దీనికి కారణం.. నియోజకవర్గంలో అన్ని పనులు, అధికారులు అందరూ కూడా రవీంద్రనాథ్‌రెడ్డి చెప్పుచేతల్లోనే ఉంటున్నారు. ఆయన చెప్పినట్టే నడుస్తున్నారు. దీంతో ఇక్కడ ఏ పని జరగాలన్నా కూడా రవీంద్రనాథ్‌రెడ్డి చెప్పాల్సిందే అనే మాట వినిపిస్తోంది.
ఆయనతో ఉంటేనే….?
పైగా స్థానిక ఎన్నికల్లోనూ అన్నీ ఏకగ్రీవం కావడం కూడా టీడీపీ నేతలను సైలెంట్ అయ్యేందుకు కారణంగా కనిపిస్తోందని అంటున్నారు. దీనికితోడు నిన్నమొన్నటి వరకు టీడీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి కూడా వైసీపీ బాటపట్టారు. వీర శివారెడ్డికి టీడీపీలో ఉన్నప్పుడే కాస్తో కూస్తో ప్రయార్టీ ఉండేదని.. ఆయన వైసీపీలోకి వెళ్లాక ఆయనను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ పరిణామాలతో టీడీపీ పేరు చెబితే పట్టించుకునేవారు లేరనే టాక్ వినిపిస్తోంది. మరోపక్క, అధికారుల నుంచి నాయకుల వరకు అంతా రవీంద్రకే భజన చేస్తున్నారు. ఆయనతో కలిసి ఉంటేనే అన్నిపనులు అవుతాయని అందరూ భావిస్తున్నారు.
ప్రతిపక్ష నేతలు సయితం…
ముఖ్యమంత్రి మేనమామ కావడంతో ప్రతిపక్ష నేతలు కూడా ఇక్కడ బయటకు వచ్చే సాహసం చేయకపోవడం ఒక ఎత్తు అయితే.. మరో నాలుగేళ్లు సైలెంట్‌గా ఉండి పనులు చేయించుకోవాలని కూడా ప్రతిపక్ష నేతలు ఓ నిర్ణయానికి వచ్చేశారు. అయితే, రవీంద్రనాథ్‌రెడ్డి.. ఇక్కడ అవినీతి చేసేందుకు ఏమీలేకపోయినా.. 14-15 ఇసుక రీచ్‌లు ఉన్నాయి.. ఆయన పేరు చెప్పుకొని.. కొందరు మాత్రం వెనుకేసుకుంటున్నారు. ఇక, ఆయన మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఇప్పుడున్న సమీకరణల్లో ఇది సాధ్యమయ్యే పరిస్థితి లేదని అంటున్నారు పరిశీలకులు. ఇది సీఎం గారి మేనమామ రాజకీయం.