రాయపాటి ఆలోచన అదేనా? ఇక చెప్పేసినట్లేనా?
గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ దిగ్గజం, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తన వారసుడిని రాజకీయంగా నిలబెట్టాలనే ప్రయత్నాలు ఏమేరకు ఫలించాయి? గత ఎన్నికల్లో పట్టుబట్టి [more]
గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ దిగ్గజం, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తన వారసుడిని రాజకీయంగా నిలబెట్టాలనే ప్రయత్నాలు ఏమేరకు ఫలించాయి? గత ఎన్నికల్లో పట్టుబట్టి [more]
గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ దిగ్గజం, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తన వారసుడిని రాజకీయంగా నిలబెట్టాలనే ప్రయత్నాలు ఏమేరకు ఫలించాయి? గత ఎన్నికల్లో పట్టుబట్టి సాధించిన నరసరావుపేట ఎంపీ టికెట్‌ను నిలబెట్టుకోలేక పోయిన రాయపాటి సాంబశివరావు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆయన కుమారుడి భవితవ్యం ఏంటి ? అనే ప్రశ్నలు టీడీపీ సర్కిళ్లలో హల్చల్ చేస్తున్నాయి. విషయంలోకి వెళ్తే.. దాదాపు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేత రాయపాటి సాంబశివరావు. కాంగ్రెస్ నుంచి ఐదు సార్లు ఎంపీగా గెలిచిన ఆయన 2014లో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పేశారు. కాంగ్రెస్ తర్వాత టీడీపీలోకి వచ్చినా.. ఆయన తన మార్కు రాజకీయాలకు ఎప్పుడూ దూరం కాలేదు.
ఏ పార్టీలో ఉన్నా…..
టీడీపీలో ఉన్నా రాయపాటి సాంబశివరావు తన హవా నెగ్గించుకున్నారు. డొక్కా మాణిక్య వరప్రసాద్ లాంటి మాజీ మంత్రులను టీడీపీలోకి తీసుకు వచ్చి మరీ ఎమ్మెల్సీని ఇప్పించుకున్నారు. ఇక గత ఎన్నికల్లోనూ గుంటూరు తూర్పు, మాచర్ల లాంటి నియోజకవర్గాల్లో తాను చెప్పినవారికే సీట్లు ఇప్పించేలా చక్రం తిప్పారు. ఆ ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీ సీటు పట్టుబట్టి సాధించినా.. వైసీపీ యువ నాయకుడు, లావు శ్రీకృష్ణదేవరాయలుపై మాత్రం లక్షా ముఫ్ఫై వేల ఓట్ల ఓట్ల తేడాతో ఓడిపోయారు. పైగా వయో వృద్ధుడు కావడంతో వృద్ధాప్య సమస్యలు కూడా రాయపాటి సాంబశివరావుని వెంటాడుతున్నాయి.
ఈ మూడు సీట్లపైనే?
దీంతో ఆయన తన వారసుడిగా రాయపాటి రంగారావును టీడీపీలో కీలక పొజిషన్లో చూడాలని భావిస్తున్నారు. ఆయన టీడీపీ ఎంపీగా ఉన్నప్పుడే రంగారావు రాజకీయ భవిష్యత్తు కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా అవి అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. ఇక ఇప్పుడు టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో పాటు అస్తిత్వం నిలుపుకుంటుందా ? అన్న సందిగ్ధంలో పడిపోయింది. రాయపాటి సాంబశివరావు రాజకీయ నిష్క్రమణ దాదాపు ఖరారు కావడంతో ఇప్పుడు వారసుడి కోసం సత్తెనపల్లి లేదా పెదకూరపాడు.. గుంటూరు వెస్ట్ సీట్లు మాత్రమే ఆప్షన్లుగా ఉన్నాయి. ఈ మూడు సీట్లపైనే రాయపాటి ముందు నుంచి గురిపెట్టారు.
ఏ సీటులోనూ సానుకూల సంకేతాలు?
సత్తెనపల్లి విషయంలో మూడు ముక్కలాటగా ఉంది పరిస్థితి. ఇక్కడ నుంచి కోడెల కుమారుడు శివరామకృష్ణ కూడాపోటీలో ఉన్నారు. అదే సమయంలో విజయవాడకు చెందిన వంగవీటి రాధా పేరు కూడా తెరమీదకు వస్తోంది. ఇక రాయపాటి సొంత నియోజకవర్గం అయిన పెదకూరపాడులో మాజీ ఎమ్మెల్యే శ్రీథర్ ఉన్నారు. ఇక గుంటూరు వెస్ట్ సీటుపై సైతం రాయపాటి సాంబశివరావు ఆశలు ఉన్నా అక్కడ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే మద్దాలి గిరి పార్టీ మారడంతో బాబు ఆ సీటును మరో వ్యక్తికి ఇచ్చేశారు. ఈ పరిణామాలతో రాయపాటి సాంబశివరావు వారసుడి రాజకీయాలు ఏ తీరుగా ఉంటాయోనని నాయకులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఒకపక్క రాయపాటి వయోవృద్ధుడుకావడం, మరోపక్క, కుమారుడికి సరైన వేదిక లభించకపోవడంతో ఆ ఫ్యామిలీ ఫ్యూచర్ రాజకీయాన్ని కాలమే నిర్ణయించాల్సి ఉంది.