రెబెల్స్ కు గ్లాసు గల..గల…??
అవును! సాధారణంగా ఎన్నికల సమయంలో తమకు టికెట్ లభించని నాయకులు, లేదా పార్టీ నుంచి బయటకు వచ్చిన నాయకులు రెబెల్స్‌గా బరిలోకి దిగడం పరిపాటి. లేదా స్వతంత్ర [more]
అవును! సాధారణంగా ఎన్నికల సమయంలో తమకు టికెట్ లభించని నాయకులు, లేదా పార్టీ నుంచి బయటకు వచ్చిన నాయకులు రెబెల్స్‌గా బరిలోకి దిగడం పరిపాటి. లేదా స్వతంత్ర [more]
అవును! సాధారణంగా ఎన్నికల సమయంలో తమకు టికెట్ లభించని నాయకులు, లేదా పార్టీ నుంచి బయటకు వచ్చిన నాయకులు రెబెల్స్‌గా బరిలోకి దిగడం పరిపాటి. లేదా స్వతంత్ర ఎమ్మెల్యేలుగా రంగంలోకి వచ్చేవారు కూడా ఉండడం పరిపాటి కానీ, ఏపీలో పరిస్థితిని చూస్తే. ఇప్పుడు ఆ పరిస్థితి లేదనే అనిపిస్తోంది. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో రెబల్స్ తమ సత్తా చాటారు. తెలంగాణ మొత్తం మీద వైరా, రామగుండంలో మాత్రమే ఇద్దరు రెబల్స్ గెలిచినా ఎన్నికలకు ముందు మాత్రం చాలా మంది విజయం సాధిస్తారన్న అంచనాలు వెలువడ్డాయి. చాలా చోట్ల రెబల్స్ భారీగా ఓట్లు చీల్చారు. గత ఎన్నికలను చూస్తే.. ఏపీలో స్వతంత్రంగా పోటీ చేసిన వారు ఉన్నారు. అయితే, ఇప్పుడు మాత్రం ఆపరిస్థితి ఉండేలా కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం.. జనసేన పార్టీయేనని చెబుతున్నారు పరిశీలకులు. విషయంలోకి వెళ్తే.. మరో నాలుగు మాసాల్లోనే ఎన్నికలు ఉన్నాయి. మొత్తం 175 స్థానాల్లో పోటీ చేసేందుకు 600 మంది నాయకులు ఉన్నారని అనుకుందాం.
పోటీలో 600 మంది……
గత 2014లో వీరి సంఖ్య 500లకు మించలేదు. (గల్లీ స్థాయి నేతలను పక్కన పెడితే) అయితే, ఇప్పుడు పార్టీల్లో నాయకత్వా లు పెరగడం, కొత్తగా పారిశ్రామిక వేత్తలు, ఎన్నారైలు, రియల్టర్లు రంగంలోకి దిగడంతో వీరి సంఖ్య ఇప్పుడు మరో వంద వరకు పెరిగే అవకాశం ఉంది. అయితే, ప్రధానంగా మూడు పార్టీలను లెక్కలోకి తీసుకుంటే.. టీడీపీ, వైసీపీ, జనసేనలు పూర్తిగా 175 స్థానాల్లోనూ పోటీ చేసినా 525 మంది అభ్యర్థులు సరిపోతారు. అయితే, జనసేన కేవలం 90 నుంచి 100 స్థానాలనే టార్గెట్ చేసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. కాంగ్రెస్ కూడా టీడీపీతో పొత్తుకు సిద్ధమైతే.. కేవలం 25 స్థానాలకే పరిమితం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ ఎన్నికల అనంతరం పొత్తుకు ప్రాధాన్యం ఇచ్చినా.. అభ్యర్థులు సరిపోతారు.
వేరేదెందుకు….?
దీంతో టీడీపీలో టికెట్ దక్కలేదని భావించేవారు కానీ, వైసీపీలో టికెట్ ఆశించి భంగపడిన నాయకులు కానీ వేరే వేరే పార్టీలను ఎంచుకునేందుకు అవకాశం ఉంటుంది. బీజేపీని పక్కన పెడితే.. జనసేనలోకి వీరంతా క్యూ కట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో బీజేపీ నుంచి పోటీ చేసేందుకు ఆ పార్టీ వాళ్లే ఆసక్తి చూపడం లేదు. అంతెందుకు బీజేపీకి మిగిలిన ఎమ్మెల్యేలు సైతం ఒకరిద్దరు జనసేన నుంచి పోటీ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నట్టు వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. కాబట్టి రాష్ట్రంలో రెబల్స్ ఎవరైనా ఉంటే వారిని జనసేన ఆకర్షించే అవకాశం ఉంటుంది. దీంతో ఓట్లు పెద్దగా చీలే అవకాశం ఉండదని అంటున్నారు. అంటే రెబల్ అభ్యర్థులకు జనసేన అవకాశం ఇచ్చే ఛాన్స్ గట్టిగానే కనిపిస్తోంది. అయినా కూడా ఎక్కడైనా ఎవరైనాఅభ్యర్థులు రెబల్‌గా దిగినా.. పెద్ద గా ప్రయోజనం ఉంటుందని చెప్పలేమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
- Tags
- ap politics
- janasena party
- nara chandrababu naidu
- pawan kalyan
- rebels
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- à°à°à°§à±à°°à°ªà±à°°à°¦à±à°¶à±
- à°à°ªà± పాలిà°à°¿à°à±à°¸à±
- à°à°¨à°¸à±à°¨ పారà±à°à±
- à°¤à±à°²à±à°à±à°¦à±à°¶à° పారà±à°à±
- నారా à°à°à°¦à±à°°à°¬à°¾à°¬à±à°¨à°¾à°¯à±à°¡à±
- పవనౠà°à°²à±à°¯à°¾à°£à±
- à°°à±à°¬à±à°²à±à°¸à±
- à°µà±.à°à°¸à±. à°à°à°¨à±à°®à±à°¹à°¨à± à°°à±à°¡à±à°¡à°¿
- à°µà±à°à°¸à±à°¸à°¾à°°à± à°à°¾à°à°à±à°°à±à°¸à± పారà±à°à±