నెల్లూరు పెద్దారెడ్లు… లొసుగులతో మాస్టర్ స్ట్రోక్ ఇస్తారు
ఏపీ కేబినెట్లో సీఎం జగన్ అన్ని సామాజిక వర్గాలకు కూడా ప్రాధాన్యం కల్పించారు. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి కూడా కీలకమైన పదవులు ఇచ్చారు. [more]
ఏపీ కేబినెట్లో సీఎం జగన్ అన్ని సామాజిక వర్గాలకు కూడా ప్రాధాన్యం కల్పించారు. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి కూడా కీలకమైన పదవులు ఇచ్చారు. [more]
ఏపీ కేబినెట్లో సీఎం జగన్ అన్ని సామాజిక వర్గాలకు కూడా ప్రాధాన్యం కల్పించారు. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి కూడా కీలకమైన పదవులు ఇచ్చారు. అయితే, ఎంతైనా సీఎం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో రెడ్డి వర్గం పదవులు లేకపోయినా తన హవాను ప్రదర్శిస్తోంది. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా కమ్మ వర్గం హవా చెలాయించింది. ఈ క్రమంలో ఇతర సామాజిక వర్గాలకు చెందిన మంత్రులు ఒకింత ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారిలో నెల్లూరుకు చెందిన మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, అనంతపురానికి చెందిన బీసీ (కురబ) మంత్రి శంకరనారాయణలు ఇబ్బంది పడుతున్నారనేది వాస్తవం.
వర్గాలుగా విడిపోయి….
అనిల్‌కుమార్ విషయం తీసుకుంటే.. వైసీపీలోను, నెల్లూరు రాజకీయాల్లోనూ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు. జగన్‌కు అత్యంత సన్నిహితుడు కూడా కావడంతో తొలి దఫాలోనే మంత్రి వర్గంలో సీటు పొందారు. అయితే, నెల్లూరులో ఆది నుంచి కూడా రెడ్డి వర్గం రాజకీయాల్లో దూకుడు ఎక్కువ. ఈ క్రమంలో నెల్లూరుకు చెందిన రెడ్డి నేతలకు, మంత్రి అనిల్‌కు మధ్య గ్యాప్ పెరుగుతోంది. ఇది ఆధిపత్య ధోరణికి కూడా దారితీసింది. నెల్లూరు సిటీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అనిల్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు ఒక వర్గంగా ఉండగా మిగిలిన కాకాని గోవర్ధన్‌రెడ్డి, ప్రసన్న కుమార్‌రెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి ఒక వర్గంగా ఉన్నారు. ఈ వర్గ విభేదాలు జగన్ కు తలనొప్పిగా మారాయి.
నియోజకవర్గంలో పర్యటించాలన్నా…..
దీంతో ఈ నెల్లూరు పెద్ద రెడ్ల దూకుడు ముందు అనిల్ దూకుడు సరిపోవడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తన నియోజకవర్గంలో పరిస్థితి బాగానే ఉన్నా జిల్లాలో మాత్రం అనిల్ దూకుడు చూపించలేక పోతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక, ఇదే జిల్లా నుంచి రెడ్డి వర్గానికే చెందిన మేకపాటి గౌతం రెడ్డి కూడా మంత్రిగా ఉన్నారు. అయితే, ఆయన తనమానాన తను పనిచేసుకుని పోతున్నారు తప్ప ఇలా గ్రూపులు కట్టడం లేదు. అయినా అనిల్ మాత్రం ఒకింత ఎదురీతనే ఎదుర్కొంటున్నట్టు చెబుతున్నారు. అసలు ఒక్క రూరల్ నియోజకవర్గంలో మినహా (గూడూరు, సూళ్లూరుపేట రిజర్వ్డ్ నియోజకవర్గాలు మినహా) అనిల్ ఏ నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యేకు చెప్పకుండా పర్యటించే పరిస్థితి లేదు.
ఈయన కూడా….
ఇక, అనంతపురానికి చెందిన మంత్రి శంకరనారాయణ కూడా జిల్లాలో ఇదే తరహా పరిస్థితిని ఎదుర్కొంటున్నారట. అనంతపురంలో కేవలం ఒకే మంత్రి ఉన్నారు. ఇక్కడ ఢీ అంటే ఢీ అనే రేంజ్లో రెడ్లతో ఆయన పోరు సాగిస్తున్నారు. అయితే, ఈ ఆధిపత్య పోరులో శంకరనారాయణ జోరు కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. రెడ్ల నుంచి అసంతృప్తి ఎక్కువగా ఉంది. ఆయన ఇక్కడ పనులు చేయడం లేదని తన సొంత నియోజకవర్గంలోనే వినిపిస్తున్నది. ఈ పరిణామాలతో ఈయన కూడా అనంతపురంలో ఎదురీత ధోరణిలోనే ఉండడం గమనార్హం. మొత్తానికి బీసీ మంత్రులు ఇద్దరూ కూడా ఒకింత రెడ్డి వర్గం నుంచి ఎదురీత ధోరణిలోనే ఉన్నారనేది వాస్తవం అంటున్నారు పరిశీలకులు.