ఇప్పట్లో అయ్యేది కాదటగా?
తమిళనాడులో శశికళ విడుదల ఉత్కంఠను రేపుతుంది. ఆమె సన్నిహితులు మాత్రం శశికళ త్వరలో విడుదలవుతారని చెబుతున్నారు. కానీ నిబంధనలు, చట్టం మాత్రం ఇప్పట్లో ఆ అవకాశం లేదంటున్నారు. [more]
తమిళనాడులో శశికళ విడుదల ఉత్కంఠను రేపుతుంది. ఆమె సన్నిహితులు మాత్రం శశికళ త్వరలో విడుదలవుతారని చెబుతున్నారు. కానీ నిబంధనలు, చట్టం మాత్రం ఇప్పట్లో ఆ అవకాశం లేదంటున్నారు. [more]
తమిళనాడులో శశికళ విడుదల ఉత్కంఠను రేపుతుంది. ఆమె సన్నిహితులు మాత్రం శశికళ త్వరలో విడుదలవుతారని చెబుతున్నారు. కానీ నిబంధనలు, చట్టం మాత్రం ఇప్పట్లో ఆ అవకాశం లేదంటున్నారు. తమిళనాడులో మరో ఐదారు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ముందుగానే శశికళ బయటకు వచ్చి రాజకీయంగా స్థిరపడాలని భావిస్తున్నారు. అయితే శశికళ విడుదలకు అనేక ఆటంకాలు ఏర్పడుతున్నాయి.
విడుదలవుతారని…..
శశికళ అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. 2017 ఫిబ్రవరిలో శశికళ అరెస్ట్ అయ్యారు. అంటే 2021 ఫిబ్రవరి లో శశికళ వాస్తవంగా విడుదల కానుంది. అయితే జైల్లో ఆమె సత్ప్రవర్తన, పెరోల్ రోజులు మినహాయింపు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే వచ్చే నెలలోనే శశికళ విడుదల కావాల్సి ఉంది. ఆమె విడుదల కావాలంటే పది కోట్ల రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
సిద్ధంగా ఉన్నా…..
పది కోట్ల రూపాయల జరిమానా కట్టేందుకు శశికళ అనుచరులు రెడీగా ఉన్నారు. ఇందుకోసం అంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందని ఆదాయపు పన్ను శాఖ ఆరాతీస్తుందన్న అనుమానంతో వారంతా పక్కా లెక్కలతో సిద్ధపడ్డారు. జరిమానా సొమ్మును కర్ణాటక జైళ్ల శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ జరిమానా సొమ్ము జైళ్ల శాఖ ఖాతాలో పడిన వెంటనే ఆ విషయాన్ని కర్ణాటక హోంశాఖకు తెలియజేస్తారు.
జరిమానా చెల్లించినా..?
దీనిపై కర్ణాటక హోంశాఖ కూడా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు కొన్ని నెలల సమయం పట్టే అవకాశముంది. వెనువెంటనే ఫైళ్లు నడిచి రోజుల్లో శశికళ బయటపడే అవకాశం లేదని చెబుతున్నారు. జైళ్ల శాఖలో సొమ్ము జమ అయిన తర్వాత ప్రభుత్వ నిర్ణయం వెలువడాలంటే దాదాపు రెండు నుంచి మూడు నెలలు సమయం పడుతుందని చెబుతున్నారు. అదే జరిగితే వచ్చే ఏడాది జనవరిలో కాని శశికళ విడుదలయ్యే అవకాశాలు లేవు. చిన్నమ్మ రాకకోసం రాజకీయ నేతలు అనేక మంది ఎదురు చూపులు చూస్తున్నారు.