కేసీఆర్కు హరీష్ మొగుడైపోయాడే… టీఆర్ఎస్ టాక్
ఏపీ నుంచి అనేక విషయాల్లో సాయం తీసుకోవాలంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్కు.. ఇప్పుడు తన మేనల్లుడు, ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ మొగుడైపోయారా ? ఇప్పటికే [more]
ఏపీ నుంచి అనేక విషయాల్లో సాయం తీసుకోవాలంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్కు.. ఇప్పుడు తన మేనల్లుడు, ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ మొగుడైపోయారా ? ఇప్పటికే [more]
ఏపీ నుంచి అనేక విషయాల్లో సాయం తీసుకోవాలంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్కు.. ఇప్పుడు తన మేనల్లుడు, ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ మొగుడైపోయారా ? ఇప్పటికే ఉన్న విభేదాలకు ఆయన మరింత ఆజ్యం పోసినట్టుగా చేసిన వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల స్నేహం మధ్య భోగి మంటలు మండిస్తున్నాయా ? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇరు రాష్ట్రాల మధ్య ఇప్పటికే విద్యుత్ ఉద్యోగుల విభజన మంట పుట్టిస్తోంది. ఇక, నీటి వివాదాలు మరెన్నో ఏళ్లపాటు తెగేలా కనిపించడం లేదు. ఇక, రాజకీయంగా కూడా ఇరు రాష్ట్రాల మద్య అనేక వివాదాలు నడుస్తున్నాయి. జగన్ ఏపీలో తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు తెలంగాణలో మంట పుట్టిస్తున్నాయి.
హరీష్ వ్యాఖ్యలతో…..
ఈ వివాదాలతోనే జగన్కు కేసీఆర్కు మధ్య ఉన్న సాన్నిహిత్యం ఇటీవల కాలంలో కొద్దికొద్దిగా తగ్గుతూ వస్తోందన్నది వాస్తవం. ఈ సమయంలో ఉద్దేశపూర్వకంగా మంత్రి హరీష్రావు చేసిన వ్యాఖ్యలు ఏపీలో మరింత మంట పుట్టిస్తున్నాయి. “వ్యవసాయ విద్యుత్ విషయంలో జగన్ నాలుగు వేల కోట్లకు ఆశపడ్డారని, అందుకే కేంద్రం చెప్పినట్టు ఆడుతున్నారని, ఇది రైతులకు ఉరివేయడమే“ అని హరీష్రావు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలను మరింతగా వేడెక్కించాయి.
సానుకూల ఓట్లను….
వాస్తవానికి ఇప్పటికే ఇక్కడ జగన్ నిర్ణయంపై రైతులు, ప్రతిపక్షాలు ఊగిపోతున్నాయి. వ్యవసాయ మీటర్లు పెట్టరాదంటూ.. ఉద్యమాలకు కూడా రెడీ అయ్యాయి. ఈ సమయంలో వారికి మరింత బలం చేకూర్చేలా హరీష్ రావు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే ఈ వ్యాఖ్యలు ఏపీతో అంతో ఇంతో స్నేహంగా ఉండి.. హైదరాబాద్ సహా.. ఏపీ సరిహద్దుల్లో ఉన్న ఏపీ సానుకూల ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకోవాలని చూస్తున్న కేసీఆర్కు కూడా ప్రతిబంధకంగా మారాయనే తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఉద్దేశ్య పూర్వకంగానే….?
నిజానికి హరీష్ రావుకుఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు. తాము వ్యవసాయ మీటర్లను ఎందుకు పెట్టడం లేదో చెబితే సరిపోతుంది. కానీ, ఆయన అలా అనకుండా ఉద్దేశపూర్వకంగానే జగన్ ను టార్గెట్ చేశారనేది స్పష్టంగా తెలుస్తోంది. ఏదేమైనా గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ పోటీ చేసినప్పటి నుంచి రెండు పార్టీల మధ్య ఎంతో సఖ్యతతో ఉన్న వాతావరణం కాస్తా తీవ్ర విబేధాలు దాల్చేదిశగా వెళుతోంది. ఇక కేంద్రం విషయంలోనూ రెండు పార్టీలు వేర్వేరు నిర్ణయాలు తీసుకోవడంతో టీఆర్ఎస్ వర్సెస్ వైఎస్సార్సీపీ మధ్య సరికొత్త రాజకీయం యుద్ధం ఆవిష్కృతమవుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.