ఆ ఏపీ మంత్రుల కామెంట్ల వెనుక… సూపర్ సీక్రెట్ ఇదే
ఊరకరారు.. మహానుభావులు.. అన్నట్టుగా ఏపీలో మంత్రులు కూడా వ్యవహరిస్తున్న తీరు.. ఊరికేనే లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మంత్రులు అదును చూసుకుని చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. [more]
ఊరకరారు.. మహానుభావులు.. అన్నట్టుగా ఏపీలో మంత్రులు కూడా వ్యవహరిస్తున్న తీరు.. ఊరికేనే లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మంత్రులు అదును చూసుకుని చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. [more]
ఊరకరారు.. మహానుభావులు.. అన్నట్టుగా ఏపీలో మంత్రులు కూడా వ్యవహరిస్తున్న తీరు.. ఊరికేనే లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మంత్రులు అదును చూసుకుని చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. అయితే, నిత్యం ఇలాంటి విమర్శలు చేస్తున్నారా? అంటే లేదు. కానీ, సమయం చూసుకుని అనేస్తున్నారు. ఇక, ఈ సమయం ఏంటి? ఇప్పటి వరకు ఆయా విషయాలపై మౌనంగా ఉన్న మంత్రులు ఇప్పుడు ఎందుకు విరుచుకుపడ్డారు.. అనే విషయాన్ని పట్టించుకోని ప్రతిపక్ష నాయకులు .. ఆ వ్యాఖ్యలను పట్టుకుని వేలాడుతున్నారు.
మంత్రుల వ్యాఖ్యలతో……
“రాజధాని .. రాజధాని …అంటారు.. అక్కడేముంది.. శ్మశానం తప్ప“ కొన్నాళ్ల కిందట బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. అంతే ఇంకేముంది.. రాజకీయ దుమారం రేగింది. ఆ తర్వాత కొన్నాళ్లకు మంత్రి కొడాలి నాని.. “రాజధాని ఎడారి. అక్కడ పశువులు తప్ప.. ఎవరూ లేరు“ అన్నారు .. మళ్లీ పొలిటికల్ ఫైరింగ్. ఇక, ఇప్పుడు “ఆంజనేయుడి చెయ్యి విరిగింది.. బొమ్మకే కదా.. ఆంజనేయుడికి కాదు కదా? అంతర్వేది రథం తగలబడింది.. మహా అయితే.. కొత్త రథం చేయిస్తాం. దుర్గమ్మ వెండి సింహాలు మాయమయ్యాయి. వాటిని తీసుకెళ్లినోడు.. ఇళ్లు కట్టుకుంటాడా ?“ అంటూ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు కుమ్మరించారు.
స్పీకర్ తో సహా….
దీంతో ఏపీలో రాజకీయ రగడ స్టార్టయింది. ఇక, ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. స్పీకర్ సీతారాంతో సహా.. అనేక మంది నాయకులు సమయం చూసుకుని వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో రాజకీయ నేతలు కౌంటర్లతో రెచ్చిపోతున్నారు. అయితే, ఒక్కసారి తెరదీసి చూస్తే.. ఏపీ మంత్రుల సంచలన కామెంట్ల వెనుక ఎలాంటి రీజన్ లేదా? అసలు కారణం లేకుండానే ప్రతిపక్షాలను రెచ్చగోడుతున్నారా? అంటే.. ఇదేదో పైకి కనిపిస్తున్నది కాదు.. నిజంగానే చాలానే ఉంది.
ప్రజల దృష్టి మళ్లించడానికే….
రాష్ట్రంలో ఇప్పుడు పెట్రోలు ధరలు పెరిగాయి. సీఎం జగన్ ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. తిరుమల డిక్లరేషన్ వివాదం నడుస్తోంది. ఇలాంటి కీలక అంశాల నుంచి ప్రజల దృష్టిని ముఖ్యంగా ప్రతిపక్షాల దృష్టిని ఎప్పటికప్పుడు తప్పించేందుకు వైసీపీ మంత్రులు చేస్తున్న ప్రయత్నం.. ఫలిస్తోందని అంటున్నారు పరిశీలకులు. అదే సమయంలో ప్రతిపక్షాలు.. వీరి మాయలో పడుతున్నారని సెలవిస్తున్నారు. మరి ఇది నిజమేనా?! అయితే… తప్పు మంత్రులది కాదు.. ప్రతిపక్షాలదే..!