గోదావరి జిల్లా కావాలంటున్నారు
పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పార్లమెంట్ కి ఒక జిల్లా గా ప్రకటించేందుకు రంగం సిద్ధం అవుతుంది. ఇక్కడి వరకు బాగానే వుంది. ఈ జిల్లాల [more]
పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పార్లమెంట్ కి ఒక జిల్లా గా ప్రకటించేందుకు రంగం సిద్ధం అవుతుంది. ఇక్కడి వరకు బాగానే వుంది. ఈ జిల్లాల [more]
పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పార్లమెంట్ కి ఒక జిల్లా గా ప్రకటించేందుకు రంగం సిద్ధం అవుతుంది. ఇక్కడి వరకు బాగానే వుంది. ఈ జిల్లాల ప్రతిపాదన రాగానే ప్రాంతాలు, పేర్లపై సోషల్ మీడియా లో జనం గోల మొదలైపోయింది. తమ ప్రాంతం ఫలానా జిల్లాలో వుండాలని కొందరు, ఫలానా పేరుతో పిలవాలని మరికొందరు, ఇప్పుడెందుకు ఈ హడావిడి అంటూ ఇంకొందరు ఇలా ఎవరికీ తోచిన రీతిలో వారు సలహాలు సూచనలు ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నారు. ఇవన్నీ ఎలా వున్నా సర్కార్ తాము అనుకున్నట్లే ఎలాగూ చేసుకుపోతుందని కొందరంటుంటే, ప్రజలకు పాలన మరింత చేరువగా జగన్ తీసుకురావడాన్ని మరికొందరు స్వాగతిస్తున్నారు.
రాజమండ్రి పేరును ఇష్టపడని ప గో వాసులు …
ఉభయగోదావరి జిల్లాల్లో రాజమండ్రి పార్లమెంట్ స్థానం పరిధి విభిన్నంగా ఉంటుంది. ఈ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో అనపర్తి, రాజానగరం, రాజమండ్రి రూరల్, రాజమండ్రి సిటీ నియోజకవర్గాలు తూర్పుగోదావరి జిల్లా లో వున్నాయి. అయితే కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాలు పశ్చిమ గోదావరి జిల్లాలో వున్నాయి. ఇప్పుడు జగన్ సర్కార్ రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో కొత్త జిల్లా ప్రకటిస్తే పశ్చిమ గోదావరి నుంచి మూడు నియోజకవర్గాలు రాజమండ్రి జిల్లాలో కలపాలిసి ఉంటుంది. దీనికి పగో వాసులు ఒకే అంటున్నారు. అయితే రాజమండ్రి ని కేంద్రం చేస్తే చేయండి కానీ గోదావరి జిల్లాగా పేరు పెట్టాలని కోరుతున్నారు. బ్రిటిష్ హయాంలో పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలను గోదావరి జిల్లాలుగా పిలవబడేవి. ఇప్పుడు అలానే పిలవాలని పగో వాసులు డిమాండు చేయడం విశేషం. పశ్చిమ వాసుల డిమాండ్ నేపథ్యంలో రాజమండ్రి వాసులు ఎలా స్పందిస్తారో ప్రభుత్వం దీనికి ఏమి పేరు పెడుతుందో చూడాలి