Ys jagan : ఆ ఫలితాలు వారిని ఖచ్చితంగా వెంటాడతాయట
గత శాసనసభ ఎన్నికల ఫలితాలు వైసీపీ ఎమ్మెల్యేలకు ఇబ్బందికరంగా మారాయి. ఆ ఎన్నికల ఫలితాలను అనుసరించే వచ్చే ఎన్నికల్లో జగన్ టిక్కెట్లు కేటాయిస్తారన్న టాక్ బలంగా వినపడుతుంది. [more]
గత శాసనసభ ఎన్నికల ఫలితాలు వైసీపీ ఎమ్మెల్యేలకు ఇబ్బందికరంగా మారాయి. ఆ ఎన్నికల ఫలితాలను అనుసరించే వచ్చే ఎన్నికల్లో జగన్ టిక్కెట్లు కేటాయిస్తారన్న టాక్ బలంగా వినపడుతుంది. [more]
గత శాసనసభ ఎన్నికల ఫలితాలు వైసీపీ ఎమ్మెల్యేలకు ఇబ్బందికరంగా మారాయి. ఆ ఎన్నికల ఫలితాలను అనుసరించే వచ్చే ఎన్నికల్లో జగన్ టిక్కెట్లు కేటాయిస్తారన్న టాక్ బలంగా వినపడుతుంది. స్వల్ప మెజారిటీతో గెలిచిన వారికి ఈసారి టిక్కెట్ ఇచ్చే అవకాశం చాలా తక్కువగా కన్పిస్తున్నాయి. వారందరిలో ఇప్పటి నుంచే టెన్షన్ పట్టుకుంది. ఈ జాబితాలో అనేక మంది సీనియర్ నేతలు కూడా ఉండటంతో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
జగన్ గాలి వీచినా….
గత ఎన్నికల్లో జగన్ వేవ్ బలంగా వీచింది. అనేక నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల కంటే జగన్ ఫొటో చూసే ఓటేశారు. జగన్ కు ఒకసారి అవకాశమివ్వాలని భావించడం, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ప్రభుత్వంపై అసంతృప్తి వెరసి అత్యధిక స్థానాలు వైసీపీకి దక్కాయి. అయితే అప్పుడు కూడా స్వల్ప మెజారిటీతో బయటపడిన ఎమ్మెల్యేలను వైసీపీ అధిష్టానం బలహీనులుగా గుర్తిస్తుంది. వీరిపై వ్యతిరేకత ఉన్న కారణంగానే అంతటి వేవ్ లోనూ వీరికి మెజారిటీ లభించలేదని చెబుతున్నారు.
కొన్నింటికి మినహాయింపు….
కొన్ని నియోజకవర్గాలకు మినహాయింపు ఇవ్వవచ్చు. మంగళగిరి నియోజకవర్గాన్ని తీసుకుంటే అక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డి రెండోసారి నాలుగువేల మెజారిటీతో విజయం సాధించారు. మెజారిటీ తగ్గడానికి ఇక్కడ బలమైన అభ్యర్థి నారా లోకేష్ ఉండటమే. ఇటువంటి స్థానాలుచాలా తక్కువగా ఉన్నాయి. అలా కాకుండా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే బొండా ఉమపై వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణు కేవలం 800 ఓట్ల తేడాతోనే గెలిచారు.
ఈసారి వీరికి కష్టమే….
ఇక పొన్నూరులోనూ ఐదు సార్లు విజయం సాధిస్తూ వచ్చిన ధూళిపాళ్ల నరేంద్ర పై కిలారు రోశయ్య వెయ్యి ఓట్ల లోపు మెజారిటీతోనే విజయం సాధించారు. నగరిలో రోజా 2014లో 830 ఓట్లతోనూ, 2019 ఎన్నికల్లో 2,630 ఓట్లతోనే గెలిచారు. తిరుపతి నియోజకవర్గంలో భూమన కరుణాకర్ రెడ్డి కేవలం ఐదు వందల ఓట్లతేడాతోనే విజయం సాధించారు. అప్పటి ఎన్నికల్లో వైసీపీ నేతలు సమిష్టిగా కృషి చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేలపై అసంతృప్తి సొంత పార్టీలోనే పెరిగింది. ఇలా అతి తక్కువ ఓట్లు సాధించిన వారిని వచ్చే ఎన్నికల్లో జగన్ పక్కన పెట్టనున్నారన్న వార్తలు వారిని కలవరపరుస్తున్నాయి.