అర్థం చేసుకుంటే మేలు
ఉదయం నిద్ర లేవగానే రాయిటర్స్ అలెర్ట్ ఆకర్షించింది. అప్పటికే ఢిల్లీ మిత్రులు ఒకరిద్దరు దానిని పంపి ఏం జరుగుతోంది అనగానే పెద్ద స్థాయి కుట్ర అని నవ్వేశా. [more]
ఉదయం నిద్ర లేవగానే రాయిటర్స్ అలెర్ట్ ఆకర్షించింది. అప్పటికే ఢిల్లీ మిత్రులు ఒకరిద్దరు దానిని పంపి ఏం జరుగుతోంది అనగానే పెద్ద స్థాయి కుట్ర అని నవ్వేశా. [more]
ఉదయం నిద్ర లేవగానే రాయిటర్స్ అలెర్ట్ ఆకర్షించింది. అప్పటికే ఢిల్లీ మిత్రులు ఒకరిద్దరు దానిని పంపి ఏం జరుగుతోంది అనగానే పెద్ద స్థాయి కుట్ర అని నవ్వేశా. నిజమే రాయిటర్స్ లో వార్త రావడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రపంచ మీడియా నెట్ వర్క్. మొత్తాన్ని శాసించే వ్యవస్థ అది. కంటికి కనిపించే దేశవాళీ న్యూస్ నెట్ వర్క్ లు మొత్తం అంతర్జాతీయంగా బ్రాండింగ్ కోసం ఆ సంస్థ అజమాయిషీలోనే పని చేస్తుంటాయి. ఈ మధ్య కాలంలో ఒకటి రెండు కంపెనీలు పోటీకి వచ్చినా నిలువలేకపోయాయి. ఆ వార్త రాసిన వాళ్ళకి కూడా దాని పర్యావసనాలు పూర్తిగా తెలుసు. తేడా వస్తే తమ కెరీర్ లు తెలిసినా ఒకరికి ముగ్గురు బై లైన్ తో ఆ వార్త వచ్చింది. అంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా సిద్ధపడే రాయిటర్స్ ఆ వార్త ఇచ్చింది. లేదా చాలా పెద్ద స్థాయిలో లాబీ అయినా పని చేసి ఉండాలి.
ఎడారిలో కియా….
ప్రపంచ వాహన మార్కెట్లో మూడో స్థానంలో ఉన్న హ్యుందాయ్ మోటార్స్ అనుబంధ కియా ఇండియా సరిగ్గా ఏడాది క్రితం ఉత్పత్తి ప్రారంభించింది. రాళ్లు రప్పలతో నిండి ఉండే హైదరాబాద్ -బెంగళూరు మార్గంలో అనంతపురం పెనుగొండ దగ్గర ఈ ప్లాంట్ నిర్మాణమే అద్భుతం అనిపిస్తుంది. 2019 జనవరిలో కియా ప్రొడక్షన్ ప్రారంభించినపుడు ఎడారిలో కియా అద్భుతం చేసింది అనిపించింది. నాలుగైదు కిలోమీటర్ల పొడవునా ఓ కొత్త కొరియా నగరాన్ని నిర్మించారు. అక్కడ పని చేసే వారిలో ఎక్కువ మంది తమిళనాడు వాళ్ళు ఉండటానికి ఆటోమొబైల్ లో స్కిల్డ్ లేబర్ అక్కడ ఉండటం వల్ల వాళ్ళని తెచ్చుకున్నామని బదులు వచ్చింది. అదే ఏడాది ఆగస్టులో కియా సెల్టోస్ రోల్ ఔట్ చేసినప్పుడు రెండో సారి ప్లాంటుకి వెళ్ళినపుడు అక్కడి వాతావరణం భిన్నంగా కనిపించింది. ఆ ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో సీఎం రావడం లేదని చెప్పినా వాళ్ళు వస్తారనే భావనలోనే ఉన్నారు. తొలి కారు లాంచ్ అయ్యాక ఆ సాయంత్రం తిరుగు ప్రయాణం అప్పుడు కియా ఇండియా వైస్ ప్రెసిడెంట్ భట్ ని కదిలిస్తే అన్ని ప్రశ్నలకు తల ఊపడమే తప్ప ఏ సమాధానం రాలేదు. హ్యుందాయ్ గ్లోబల్ పీఆర్ ఏజెన్సీ జనో బృందం తర్వాత మాట్లాడతారు అని సర్ది చెప్పి దేశం నలుమూలల నుంచి వచ్చిన నలభై మంది మీడియా బృందాన్ని బెంగళూరు తీసుకొచ్చారు. అప్పటికే అక్కడి పరిణామాలు చూసి ఎవరు పెద్దగా అభ్యంతరం చెప్పలేదు.
కియా… కొరియాదే….
ఆంధ్రప్రదేశ్ అనంతపురంలో ఫ్యాక్టరీ పెట్టుకున్నా అక్కడ పెత్తనం అంతా కొరియా వాళ్లదే. ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నా పై వాళ్ళు కొరియా వాళ్లే. వాళ్ల దృష్టిలో మిగతా వాళ్లంతా కూలీల కిందే లెక్క. కొరియా వాడి అనుమతి లేకుండా ఓ రోబోటిక్ ప్లాంట్ లోకి బ్యాటరీ కార్ లోకి మమ్మల్ని తీసుకెళ్లిన అనంతపురం సైట్ ఇంజినీర్ బండ బూతులు తినాల్సి వచ్చింది. కొరియా వాడి అరుపులకి ఇంకో కొరియన్ వచ్చి మీడియా అయినా ఎక్కడికి తీసుకెళ్ళాలో అక్కడి వరకే ఎంట్రీ అని నిష్కర్షగా చెప్పేశాడు. మా ప్లాంట్, డిజైన్, స్ట్రక్చర్, మెషినరీ అన్ని మాకు రహస్యమే. ఏది బయటకు వెళ్లకూడదు అని మొదటి ట్రిప్ లోనే తేల్చి చెప్పేశాడు. కనీసం మొబైల్ ఫోన్లలో కూడా ఫోటోలు తీసుకొనివ్వనంత జాగ్రత్తగా కాపలా కాశారు. పోలీసులు, ప్రోటోకాల్ సిబ్బంది, ప్రభుత్వ అధికారులు, అతిధులు అంతా కలిపినా లోపల 150-200కి మించి కనిపించలేదు. పద్దతిగా తీసుకెళ్లి, పద్దతిగా వెనక్కి తెచ్చేశారు.
రెండో సారి ఢిల్లీలో…..
కియా ప్రొడక్షన్ మొదలయ్యాక సెల్టోస్ ని 2019 జూన్ లో గుర్గావ్ ఫార్ములా 1 ట్రాక్ మీద ప్రదర్శించారు. అప్పుడు కూడా అంతే. ఆ ఉత్పత్తుల విశేషాలు దగ్గరుండి చూడటం, సందేహాలు తీర్చుకోవడం అంత వరకే… అప్పుడు కూడా కియా ఇండియా టీం హుషారుగానే కనిపించింది. రికార్డ్ స్థాయి బుకింగ్స్ చూసి తమకు పోటీలోనే లేవని ధీమా వ్యక్తం చేశారు. ఏడాదిలోపు రెండు, మూడు మోడల్స్ మార్కెట్లోకి తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆ తర్వాత రెండు నెలలకి కియా సెల్టోస్ రోల్ ఔట్ సమయానికి వాతావరణం మారిపోయింది. రాష్ట్రంలో ప్రభుత్వం కూడా మారిపోయింది. ఆంధ్ర ప్రదేశ్ లో తయారైన తొలి కారు ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవిష్కరించాలని కియా యాజమాన్యం భావించింది. ఏ కారణాల వల్లో సీఎం ఆ కార్యక్రమానికి హాజరు కాకపోవడం వారిని నిరాశకు గురి చేసింది. అదే సమయంలో తాజా రాజకీయ వాతావరణానికి తగ్గట్లుగా పాత ప్రభుత్వ ప్రస్తావన ఏ మాత్రం చేయలేదు. దివంగత వైఎస్ తో తమకున్న అనుబంధాన్ని కియా యాజమాన్యం గుర్తు చేసుకుంది. రాష్ట్ర విభజనకు ముందే కియాతో సంప్రదింపులు జరిగాయని గుర్తు చేసుకున్నారు. సీఎం తరపున ఆర్థిక మంత్రి బుగ్గన సందేశాన్ని చదివి వినిపించారు.
అనంతపురం నేతలు….
అక్కడి వరకు బాగానే జరిగినా అనంతపురం జిల్లా నాయకుల వ్యవహార శైలి అందర్నీ విస్తుబోయేలా చేసింది.ఆ జిల్లా మంత్రి వేదిక మీదే నిష్టురాలు పోయారు. బెదిరింపు ధోరణిలో ఆయన ప్రసంగం సాగింది.ఇక ఎంపీ గోరంట్ల మాధవ్ వేదిక మీదే కియా ఇండియా ఉపాధ్యక్షుడితో వాగ్వాదానికి దిగారు. ఆ కార్యక్రమానికి వచ్చిన నేషనల్ మీడియా టీంలో ఉన్న ఒకరిద్దరు తెలుగు వాళ్ళు మౌనంగా ఉండిపోయాము. ఫైనాన్సియల్ ఎక్స్ ప్రెస్ మహిళా జర్నలిస్ట్ ఇలాంటి ప్రారంభోత్సవం తాను ఎక్కడ చూడలేదనేసింది. తమిళనాడుకు చెందిన ఆమెకు తెలుగు రాకున్నా వాతావరణం అర్థమైంది. వేదిక మీదప్రసంగాలు కొనసాగుతుండగానే ఎక్కడి నుంచి వచ్చారో కానీ గుంపులు గుంపులుగా స్థానిక చోటా, మోటా లీడర్స్ వచ్చేశారు. ఓ నాలుగైదు వందల మంది సెక్యూరిటీ, పోలీసుల్ని నెట్టుకుంటూ వచ్చేశారు. వేదిక ఎత్తు తక్కువగా ఉండటంతో మీడియా కెమెరాలకు కూడా ఏమి జరుగుతుందో కనిపించక గందరగోళంగా తయారైంది. చివర్లో ఎమ్మెల్యే రోజా వచ్చి మళ్ళీ కథ మొదటికి తీసుకొచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది, పద్ధతులు మారాయి, పాలసీలు మారాయి, గతంలో చేసినట్టు చేస్తాం అంటే కుదరదు అని క్లాస్ పీకారు. అప్పటికే పరిశ్రమల్లో ఉద్యోగాలు 75శాతం స్థానికులకు అనే ప్రకటన చేయడంతో కియా కూడా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందే అని రోజా తన స్టయిల్లో వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ప్లాంట్ లోపలి నుంచి బయటకు వచ్చిన మొదటి కారు మీద ఎంపీ మాధవ్ అక్కసు వెళ్లగక్కుతూ కియా rolled out… our young and energetic ruled out అని రాసి పడేశారు. అది చూసి అంతా అవాక్కయ్యారు. ఆయన మనసులో ఎదో అసంతృప్తి ఉంటే దానిని బయట పెట్టడానికి మాత్రం అది మార్గం కాదు. ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చిన కార్ మీద ఎంపీ మాధవ్ అలా రాయడం ఆయన స్థాయికి తగని పని అని మాత్రం చెప్పొచ్చు. ఆ కార్యక్రమం అయ్యాక బయటకు వస్తుంటే ఎక్కడ చూసినా అడ్డ పంచలు కట్టి హడావుడిగా తిరుగుతున్న జనం కనిపించారు.
కింకర్తవ్యం….
?
నిన్నటి ఢిల్లీ ఆటో ఎక్స్ పోలో కియా కొత్త మోడల్ లాంచ్ చేసింది. ఇప్పుడు మార్కెట్లో ఉన్న మోడల్స్ కి ధీటుగా కొత్త మోడల్స్ విడుదల చేస్తున్నట్టు ప్రకటించినా పెద్దగా హడావుడి చేయలేదు. అది జరిగిన గంటల వ్యవధిలోనే రాయిటర్స్ బాంబ్ పేల్చింది. కియా ప్లాంట్ తరలింపు మీద వచ్చిన వార్త ఊహాజనితమో, తప్పుడు కథనమో అయ్యుండదు. మామూలు భాషలో అది ప్లాంటెడ్ స్టోరీనే. కానీ ఓ లక్ష్యంతో జరిగిన ప్లాంట్. ఓ రకంగా ఓ అత్యున్నత స్థాయి వ్యూహం అయ్యుండొచ్చు. వేల కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టిన సంస్థ వ్యూహ రచనలో భాగంగా ఇచ్చిన హెచ్చరిక కూడా అయ్యుండొచ్చు. చర్చల మధ్యలో కియా ఈవి ప్లాంట్ ప్రస్తావనకు వచ్చింది. అదెక్కడ ఉందో వెదుకు అని ఓ పీఆర్వో అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆటో మొబైల్ పరిశ్రమ వెనుక ఉండే మార్కెట్ శక్తులు, పర్యావసనాలు ఆలోచించకుండా ఆ కథనం ఇచ్చి ఉండకపోవచ్చు. దాని వెనుక జరుగుతున్న పరిణామాలు, లోటుపాట్లు సరిదిద్దుకోడానికి ఓ అవకాశం కావొచ్చు. సరైన తీరులో అర్థం చేసుకుంటే ఈ మొత్తం వ్యవహారంలో కియా ఏమి చెబుతుందో సులభంగానే స్పష్టం అవుతోంది. అర్థం చేసుకోవాల్సిన వాళ్లకి అర్థం అయితే మేలు. చివరగా కియా ప్లాంట్ మీద రాయిటర్స్ తప్పుడు వార్త రాస్తే జీవో 2430 ప్రకారం తోలు తీయాలి కదా?
- Tags
- kia
- à°à°¿à°¯à°¾